Praveen Kumar VadlaPraveen Kumar Vadla
|
news18-telugu
Updated: March 6, 2020, 11:04 PM IST
దొరబాబు, హైపర్ ఆది (Hyper Aadi Dorababu)
మంచి పేరు సంపాదించుకోడానికి జీవితం అంతా కష్టపడినా ఒక్కోసారి సరిపోదు.. కానీ చెడ్డ పేరు తెచ్చుకోడానికి ఒక్క సంఘటన చాలు. అప్పటి వరకు ఉన్న జీవితం అంతా ఒక్కసారిగా తలకిందులు అయిపోతుంది. ఇప్పుడు జబర్దస్త్ కమెడియన్లు దొరబాబు, పరదేశీ విషయంలో కూడా ఇదే జరుగుతుంది. అప్పటి వరకు వీళ్ళు ఎలాంటి వాళ్లు.. నిజంగానే అలాంటి వాళ్లా.. మంచి వాళ్లా అనేది అనవసరం. కానీ వీళ్లు వ్యభిచారం చేస్తూ పట్టుబడ్డారు అనేది మాత్రం నిజం. మూడు రోజల కింద వైజాగ్‌లోని ఓ ఇంట్లో వ్యభిచారం చేస్తూ దొరికిపోయారు ఈ ఇద్దరు. పోలీసుల కాళ్ల వేళ్ల పడ్డా కూడా లాభం లేకుండా పోయింది. ఒక్కోసారి లైఫ్ అంతే మరి.. అప్పటి వరకు ఉన్న ఇమేజ్ మొత్తం ఒక్క ఇన్సిడెంట్‌తో పోగొట్టుకున్నారు దొరబాబు, పరదేశీ.

వ్యభిచారం చేస్తూ దొరికిపోయిన జబర్దస్త్ నటులు (Dora Babu Paradeshi prostitution)
నిజంగానే వీళ్లు అలాంటి వాళ్లే అనే ముద్ర కూడా పడిపోయింది. అయితే ఇప్పుడు ఈ జబర్దస్త్ కమెడియన్ల భవిష్యత్తు ఏంటనేది మాత్రం ప్రశ్నార్థకంగా మారింది. వీళ్ల టీం లీడర్ హైపర్ ఆది కూడా ఈ ఇద్దరి విషయంలో ఎలాంటి నిర్ణయం తీసుకుంటాడనేది కూడా ఇప్పుడు అందరిలోనూ ఆసక్తి కలిగిస్తున్న ప్రశ్న. ప్రస్తుతానికి వినిపిస్తున్న సమాచారం ప్రకారం చూస్తుంటే మాత్రం మరో రెండు మూడు వారాలు అయితే కచ్చితంగా దొరబాబు కనిపించడు. ఆయనతో పాటు పరదేశీ కూడా. నిజానికి హైపర్ ఆది రాసే స్కిట్స్‌లో రైటర్‌గా కూడా పని చేస్తున్నాడు పరదేశీ. ఈయనకు తండ్రి కూడా లేడని తెలుస్తుంది. సినిమాల్లో రాణించాలని తపన పడుతున్న సమయంలోనే ఇలాంటి పని చేస్తూ దొరికిపోయాడు.

వ్యభిచారం చేస్తూ దొరికిపోయిన జబర్దస్త్ నటులు (Dora Babu Paradeshi prostitution)
ఇదిలా ఉంటే దొరబాబు కూడా ఇంతకుముందు బి గ్రేడ్ షార్ట్ ఫిల్మ్స్ చేసినా కూడా ఇప్పుడు మాత్రం హ్యాపీ లైఫ్ లీడ్ చేస్తున్నాడు. అంతలోనే ఇలా జరిగిపోయింది. అయితే ఈ ఇద్దరి విషయంలో మల్లెమాల ప్రొడక్షన్స్ సీరియస్‌గానే స్పందించినా కూడా వాళ్లు మాత్రం నిజానికి చాలా మంచి వాళ్లే అని సర్టిఫికేట్ ఇచ్చినట్లు వార్తలొస్తున్నాయి. వాళ్ల విషయంలో తుది నిర్ణయం మాత్రం హైపర్ ఆదికి వదిలేసినట్లు తెలుస్తుంది. దాంతో ఈయన కూడా ధీర్ఘంగానే ఆలోచిస్తున్నాడు.

జబర్దస్త్ కమెడియన్ హైపర్ ఆది (Jabardasth comedian Hyper Aadi)
తనకు చాలా కాలంగా దొరబాబు, పరదేశీతో పరిచయం ఉండటంతో వాళ్లు ఏంటనేది హైపర్ ఆదికి కూడా తెలుసు. అందుకే కొన్ని వారాలు ఈ వేడి చల్లారేంత వరకు వాళ్లను జబర్దస్త్‌కు దూరం పెట్టి.. తర్వాత మళ్లీ తీసుకురావాలని చూస్తున్నాడు. అప్పటి వరకు దొరబాబుకు బ్రేక్ ఇచ్చేసినట్లే. అయితే టీమ్‌లోంచి.. జబర్దస్త్ కామెడీ షో నుంచి దొరబాబు, పరదేశీని తీసేసినట్లు వస్తున్న వార్తలు మాత్రం నిజం కాదని మల్లెమాల వర్గాలు చెబుతున్న మాట. కచ్చితంగా కొన్ని రోజులు బ్రేక్ తప్పదు కానీ వేడి తగ్గిన తర్వాత మళ్లీ వస్తారంటున్నారు వాళ్లు. మరి వచ్చిన తర్వాత పరిస్థితులు ఎలా ఉంటాయో చూడాలిక.
Published by:
Praveen Kumar Vadla
First published:
March 6, 2020, 11:04 PM IST