అవును.. నమ్మడానికి విచిత్రంగా అనిపించినా కూడా ఇప్పుడు నిజంగానే సుధీర్‌ను చూసి హైపర్ ఆది భయపడుతున్నాడు. ఆయన్ని చూస్తే వణికిపోతున్నాడు. దానికి కూడా కారణం లేకపోలేదు. జబర్దస్త్ కామెడీ షో నుంచి వస్తున్న ఒక్కో కమెడియన్ ఇప్పుడు వెండితెరపై కూడా సత్తా చూపించాలని ఉవ్విళ్ళూరుతున్నారు. అక్కడ కాస్త ఇమేజ్ రాగానే హీరో అయిపోతున్నారు. ఇప్పటికే జబర్దస్త్ నుంచి వచ్చిన వాళ్లలో సుడిగాలి సుధీర్, ధన్‌రాజ్, శంకర్ లాంటి వాళ్లు హీరోలు అయ్యారు. కానీ ఎవరూ పెద్దగా సక్సెస్ కాలేదు. ఇక ఇప్పుడు హైపర్ ఆది కూడా హీరో అయిపోతున్నాడు.
బుల్లితెరపై పంచ్ డైలాగులతో తనకంటూ ప్రత్యేక గుర్తింపు సంపాదించుకున్న ఈయన ఇప్పుడు వెండితెర వైపు అడుగులేస్తున్నాడు. ఇప్పటికే చిన్నచిన్న పాత్రలు చేస్తూ క్రేజ్ తెచ్చుకున్న ఆది.. ఇప్పుడు ఏకంగా హీరో అయిపోతున్నాడు. ఈ మధ్యే సుడిగాలి సుధీర్ నటించిన సాఫ్ట్‌వేర్ సుధీర్ సినిమా పెద్దగా ప్రభావం చూపించడం లేదు. ఈ సినిమా డిజాస్టర్ అయిపోయింది. కనీస వసూళ్లు కూడా తీసుకురాలేదు. అయినా కూడా హైపర్ ఆది మాత్రం హీరో కావాలని ఆరాటపడుతున్నాడు. కానీ ఎక్కడో ఓ మూలన సుధీర్ సినిమా ఫలితాన్ని చూసి భయపడుతున్నాడు ఆది.
ఈ మధ్యే యూ ట్యూబ్ ఛానెల్‌కు ఇంటర్వ్యూ ఇచ్చిన ఆది అక్కడే విషయం కన్ఫర్మ్ చేసాడు. సుడిగాలి సుదీర్ అంటే తనకు చాలా ఇష్టమని చెప్పాడు. అన్నపూర్ణ స్టూడియోలో సుధీర్‌తో పరిచయం జరిగిందని.. తర్వాత ఇద్దరం కలసి చాలా స్కిట్స్ చేశామని చెప్పాడు ఈయన. ఇక సుధీర్ మాదిరే త్వరలోనే తాను కూడా హీరో అవుతున్నానని అసలు విషయం చెప్పాడు ఆది. ఇప్పటికే కథలు వింటున్నానని.. తనకు డాన్సులు, ఫైట్లు అస్సలు పడవని.. పూర్తిగా కామెడీ ప్రధానంగా సాగే కథను ఎంచుకుంటానని చెప్పాడు హైపర్ ఆది. సుధీర్ డాన్సులు, ఫైట్లు చేస్తేనే చూడలేదు.. మరి ఈయన ఏం లేకుండా జస్ట్ కామెడీతో వస్తానంటున్నాడు. మరి హైపర్ ఆదిని చూస్తారా..?
తెలుగు వార్తలు, తెలుగులో బ్రేకింగ్ న్యూస్ న్యూస్ 18లో చదవండి. రాష్ట్రీయ, జాతీయ, అంతర్జాతీయ, టాలీవుడ్, క్రీడలు, బిజినెస్, ఆరోగ్యం, లైఫ్ స్టైల్, ఆధ్యాత్మిక, రాశిఫలాలు చదవండి.
Tags: Hyper Aadi, Sudigali sudheer, Telugu Cinema, Tollywood