కరోనాపై జబర్దస్త్ పంచ్ వేసిన కమెడియన్ హైపర్ ఆది..

జబర్దస్త్ కమెడియన్ హైపర్ ఆది (Hyper Aadi)

Hyper Aadi: కరోనా వైరస్ కారణంగా అంతా ఇంట్లోనే ఉండి ఈ మహమ్మారిని ఇండియా నుంచి తరిమేద్దాం అంటూ జబర్దస్త్ కమెడియన్ హైపర్ ఆది చెబుతున్నాడు.

  • Share this:
కరోనా వైరస్ కారణంగా అంతా ఇంట్లోనే ఉండి ఈ మహమ్మారిని ఇండియా నుంచి తరిమేద్దాం అంటూ ఎవరికి తోచిన పద్దతిలో వాళ్లు చెబుతున్నారు. ఇప్పుడు జబర్దస్త్ కమెడియన్ హైపర్ ఆది కూడా ఇదే చెబుతున్నాడు. ఇన్ని రోజులు బయట తిరిగి సంపాదించారు కదా.. ఇప్పుడు ఇంట్లో కూర్చుని దేశసేవ చేయాల్సిన సమయం వచ్చింది.. మన కోసం.. మన కుటుంబాల కోసం కొన్ని రోజులు ప్రభుత్వం చెప్పినట్లు నడుచుకుని.. లాక్ డౌన్ సక్రమంగా పాటిద్దాం అంటున్నాడు ఈ కమెడియన్. అంతేకాదు.. ఇంట్లోనే కూర్చుంటే ఇప్పుడు దేశభక్తుడు అంటున్నారు అంటున్నాడు ఈయన.

జబర్దస్త్ కమెడియన్ హైపర్ ఆది (Jabardasth comedian Hyper Aadi)
జబర్దస్త్ కమెడియన్ హైపర్ ఆది (Jabardasth comedian Hyper Aadi)


ఇక కరోనా వైరస్ మన దేశానికి వచ్చిన శత్రువు అని.. దాన్ని తరిమి కొట్టాల్సిన బాధ్యత ప్రతీ ఒక్కడిపై ఉందంటున్నాడు హైపర్ ఆది. ఇండియా వర్సెస్ పాకిస్తాన్ మ్యాచ్ వస్తే ఇంట్లోంచి అడుగు బయటపెట్టకుండా కూర్చుంటాం.. దగ్గరుండి ఇండియాను గెలిపించే వరకు వదిలిపెట్టం. ఇప్పుడు ఇండియా వర్సెస్ కరోనా మ్యాచ్ జరుగుతుంది.. ఇప్పుడు కూడా ఇంట్లోనే కూర్చుని మన దేశాన్ని గెలిపిద్దాం అంటున్నాడు ఆది.

మనం తలుచుకుంటే కచ్చితంగా ఈ మ్యాచ్‌లో భారత్ ఘన విజయం సాధిస్తుందని చెబుతున్నాడు ఈయన. కచ్చితంగా గెలిపిస్తాం కదా అని అడుగుతున్నాడు ఆది. మరో రెండు వారాలు ఇలాగే ఉంటే ఈ మహమ్మారి నుంచి బయటిపడిపోతామని.. దయచేసి కేసీఆర్, జగన్ గారితో పాటు ప్రధాని మోదీ గారు కూడా చెప్పింది విందామంటున్నాడు హైపర్ ఆది. ఏదేమైనా కూడా కరోనాను ఇండియా వర్సెస్ పాకిస్తాన్ మ్యాచ్‌తో పోల్చిన ఈ జబర్దస్త్ ఆలోచనను చూసి అంతా సూపర్ అంటున్నారు.
Published by:Praveen Kumar Vadla
First published: