Home /News /movies /

హైపర్ ఆది విశ్వరూపం.. అదిరింది సద్దాంకు స్ట్రాంగ్ వార్నింగ్..

హైపర్ ఆది విశ్వరూపం.. అదిరింది సద్దాంకు స్ట్రాంగ్ వార్నింగ్..

హైపర్ ఆది సద్దాం హుస్సేన్ (hyper aadi saddam)

హైపర్ ఆది సద్దాం హుస్సేన్ (hyper aadi saddam)

Hyper Aadi: హైపర్ ఆది ఎప్పుడూ కామెడీతోనే కాకుండా అప్పుడప్పుడూ కాస్త కాంట్రవర్సీలు కూడా చేస్తుంటాడు. ఇప్పుడు కూడా ఇదే చేసాడు. ఈయన అదిరింది షోతో..

హైపర్ ఆది ఎప్పుడూ కామెడీతోనే కాకుండా అప్పుడప్పుడూ కాస్త కాంట్రవర్సీలు కూడా చేస్తుంటాడు. ఇప్పుడు కూడా ఇదే చేసాడు. ఈయన అదిరింది షోతో పాటు అందులో ఉన్న కొందరు కమెడియన్లను కూడా టార్గెట్ చేసాడు. ఈ మధ్యే ఓ ఎపిసోడ్‌లో అదిరింది కమెడియన్ సద్దాం తన స్కిట్‌లో భాగంగా హైపర్ ఆదిపై అదిరిపోయే పంచులు వేసాడు. అది కాదురా అంటూ ఆది కాకపోతే సద్దాం ట్రెండింగ్‌లో ఉంటది అంటూ సెటైర్ వేసాడు. దీనిపై హైపర్ ఆది చాలా సీరియస్ అయ్యాడు. ఎవడు పడితే వాడు వచ్చి హైపర్ ఆదిని కొట్టేస్తామంటే ఎలా అంటూ వార్నింగ్ ఇచ్చాడు.

హైపర్ ఆది సద్దాం హుస్సేన్ (hyper aadi saddam)
హైపర్ ఆది సద్దాం హుస్సేన్ (hyper aadi saddam)


ఇదంతా ఐదు వారాల హడావిడి.. దాన్ని చూసి మురిసిపోతే ఎలా అంటూ స్ట్రాంగ్ పంచులే వేసాడు ఆది. ఈ మధ్యే ఓ ఇంటర్వ్యూలో మాట్లాడుతూ ముందుంది ముసళ్ల పండగ.. ఐదు స్కిట్స్ చేసి ఆదిని దాటేసామంటే ఎలా.. నాన్ బాహుబలి రికార్డుల్లా నాన్ హైపర్ ఆది రికార్డులు అంటూ కొన్ని ఉంటాయి. వాటిని ముట్టుకోవాలంటే మీ వల్ల కాదంటూ సంచలన వ్యాఖ్యలు చేసాడు ఈ కమెడియన్. తనపై పోటీ అంటే అంత ఈజీ కాదంటూ స్టేట్‌మెంట్ ఇచ్చేసాడు.

హైపర్ ఆది సద్దాం హుస్సేన్ (hyper aadi saddam)
హైపర్ ఆది సద్దాం హుస్సేన్ (hyper aadi saddam)


బాబూ పక్కకెళ్లి ఆడుకోమ్మా అన్నట్లుగా సద్దాంను తీసి పారేసాడు ఆది. ఇలాంటి రికార్డులు అన్నీ తామెప్పుడో చేసేసాం.. ఇప్పుడు కొత్తగా వీళ్లు వచ్చి హైపర్ ఆదిని దాటేసామంటే ఎలా అంటున్నాడు ఈయన. తన స్కిట్‌కు వచ్చిన హైయ్యస్ట్ వ్యూస్ 58 మిలియన్ అని.. అలాగే 30 మిలియన్ దాటిన స్కిట్స్ రెండు ఉన్నాయని.. 20 మిలియన్ దాటిన స్కిట్స్ 5 ఉన్నాయని.. 10 మిలియన్ దాటిన స్కిట్స్ 40 ఉన్నాయని ఇవన్నీ ఆల్ టైమ్ రికార్డులు అంటూ గుర్తు చేసాడు ఆది.

జబర్దస్త్ కమెడియన్ హైపర్ ఆది
జబర్దస్త్ కమెడియన్ హైపర్ ఆది


ఒక సెంచరీ కొట్టేసి తానే సచిన్ టెండూల్కర్‌ను దాటేసామంటే ఎలా.. అలాంటిది ఆయన 100 కొట్టాడు.. అందుకే మురిసిపోకూడదు అంటూ వార్నింగ్ ఇచ్చాడు హైపర్ ఆది. ఎప్పుడో తాను ఐదేళ్ల కిందే దాటేసిన రికార్డులను ఇప్పుడు చూపించి నేను ట్రెండింగ్ అంటే చిన్న పిల్లలాటలా ఉంటుందని చెప్పుకొచ్చాడు ఈయన. మొత్తానికి సద్దాం పంచ్‌కు హైపర్ ఆది బాగానే హర్ట్ అయ్యాడన్నమాట.
Published by:Praveen Kumar Vadla
First published:

Tags: Adirindi comedy show, Hyper Aadi, Jabardasth comedy show, Telugu Cinema, Tollywood

ఉత్తమ కథలు

తదుపరి వార్తలు