ఏడాది కింది వరకు తనలో కమెడియన్ తప్ప మరొకరు లేరన్నట్లు ఉన్నాడు జబర్దస్త్ కమెడియన్ హైపర్ ఆది. కానీ ఇప్పుడు ఒక్కొక్కటిగా తనలో ఉన్న టాలెంట్స్ అన్నీ బయటికి తీస్తున్నాడు. మొన్నటి వరకు కమెడియన్‌గా ఉన్న ఈయన ఈ మధ్యే హోస్టుగా కూడా మారాడు. ఢీ ఛాంపియన్స్‌లో వర్షిణితో కలిసి మనోడు బాగానే పులిహోర కలుపుతున్నాడు. యాంకర్ వర్షిణితో హైపర్ ఆదికి సమ్‌థింగ్ అంటూ వార్తలు కూడా వస్తున్నాయి. ఇదిలా ఉంటే జబర్దస్త్ కామెడీ షోలో మల్టీ టాలెంటెడ్ అంటే వెంటనే గుర్తొచ్చే పేరు సుడిగాలి సుధీర్. ఇప్పుడు ఆయనకు పోటీగా వస్తున్నాడు హైపర్ ఆది. ఎఫైర్స్ మాత్రమే కాదు.. రొమాన్స్‌లో కూడా ఈ మధ్య సుధీర్‌కు పోటీగా వస్తున్నాడు ఆది.
వర్షిణితో ఇప్పుడు ఈయనకు మంచి జోడీ కుదిరింది. ఈ ఇద్దరే న్యూ ఇయర్ ఈవెంట్ కూడా హోస్ట్ చేసారు. ఇదిలా ఉంటే గత కొన్ని వారాలుగా ఆది, వర్షిణి మధ్య సమ్‌థింగ్ ఈజ్ గోయింగ్ ఆన్ అంటూ వార్తలు పుట్టుకొచ్చాయి. దానికి కారణం కూడా హైపర్ ఆదే. ఆయనే తమ ఇద్దరి మధ్య ఒకటి నడుస్తుందని ఒప్పుకున్నాడు. ఆ మధ్య ఢీ ఛాంపియన్స్‌లో రొమాంటిక్ పాటకు డాన్సులు చేసారు వర్షిణి, ఆది జోడీ. ఈ ఇద్దరి కెమిస్ట్రీ అదిరిపోయింది కూడా.
ఆ తర్వాత కూడా వరసగా ప్రతీ ఎపిసోడ్‌లోనూ వర్షిణితో డాన్సులు చేస్తున్నాడు హైపర్ ఆది. ఇదంతా ఇలా ఉంటే ఇప్పుడు తనలో మరో కోణం కూడా చూపించాడు ఈయన. తాజాగా ఉగాది స్పెషల్ ఈవెంట్లో సింగర్‌గా మారిపోయాడు ఈయన. అనగనగా ఆకాశం ఉంది అంటూ నువ్వే కావాలి పాట పాడాడు ఆది. తాజాగా విడుదలైన ప్రోమోలో ఈ పాటను బాగా హైలైట్ చేసారు. దానికి శ్రీముఖితో పాటు అక్కడున్న కమెడియన్లు కూడా డాన్సులు చేసారు. మొత్తానికి హైపర్ ఆదిలో మంచి కమెడియన్, రైటర్ మాత్రమే కాదు.. సింగర్ కూడా ఉన్నాడన్నమాట.
తెలుగు వార్తలు, తెలుగులో బ్రేకింగ్ న్యూస్ న్యూస్ 18లో చదవండి. రాష్ట్రీయ, జాతీయ, అంతర్జాతీయ, టాలీవుడ్, క్రీడలు, బిజినెస్, ఆరోగ్యం, లైఫ్ స్టైల్, ఆధ్యాత్మిక, రాశిఫలాలు చదవండి.
Tags: Hyper Aadi, Jabardasth comedy show, Telugu Cinema, Tollywood