హైపర్ ఆది చేసిన అవమానానికి అనసూయ సీరియస్...షో మధ్యలోనే...

అనసూయ, హైపర్ ఆది

ఈ షో పెట్టుకొని ముందు రోజు ఆ షోకు వెళితే నిద్రే పట్టుద్ది అంటూ పంచ్ వేశాడు. అంతటితో ఆగలేదు. వీళ్లు వదులుకోరు...వాళ్లు వదులుకునేలా లేరు. అంటూ పంచులు వేశాడు. దీనిపై అనసూయ లైట్ తీసుకున్నట్లు కనిపిస్తున్నప్పటికీ కాస్త సీరియస్ గానే రియాక్ట్ అయినట్లు తెలుస్తోంది.

  • Share this:
    హైపర్ ఆది పంచులకు అడ్డు అదుపూ ఉండదు.. స్కిట్ మొదలు పెట్టాడంటే ముగించే వరకూ పంచుల వర్షం కురుస్తూనే ఉంటుంది. అయితే ఎప్పటిలాగే అనసూయను అయితే టార్గెట్ చేయకుండా ఆది స్కిట్ కొనసాగదు. తాజాగా హైపర్ ఆది తన స్కిట్ లో అనసూయను ఉద్దేశిస్తూ చేసిన వ్యాఖ్యలు పెద్ద దుమారానికి కేంద్రబిందువు అయినట్లు తెలుస్తోంది. ఆది స్కిట్ లో అనసూయ డైలాగ్ చెబుతూ బావ నిద్రప్టటేసింది. అనగానే ఆది అందుకొని ఈ షో పెట్టుకొని ముందు రోజు ఆ షోకు వెళితే నిద్రే పట్టుద్ది అంటూ పంచ్ వేశాడు. అంతటితో ఆగలేదు. వీళ్లు వదులుకోరు...వాళ్లు వదులుకునేలా లేరు. అంటూ పంచులు వేశాడు. దీనిపై అనసూయ లైట్ తీసుకున్నట్లు కనిపిస్తున్నప్పటికీ కాస్త సీరియస్ గానే రియాక్ట్ అయినట్లు తెలుస్తోంది. అయితే అనసూయపై హైపర్ ఆది చేసిన కామెంట్స్ ఆమె లోకల్ గ్యాంగ్స్ జడ్జిగా చేస్తున్నందు వల్లే అలా అన్నాడని టాక్ వినిపిస్తోంది.

    గతంలో నాగబాబుతో పాటు అనసూయ కూడా జబర్దస్త్ విడిచి వెళ్లిపోయినట్లు టాక్ వినిపించింది. అంతేకాదు అందుకు తగ్గట్టుగానే కొత్త షో లోకల్ గ్యాంగ్స్ లో కూడా కనిపించేసింది. అయితే జబర్దస్త్ టీమ్ మాత్రం అనసూయను వదులుకోవడం ఇష్టం లేక ఆమెను అందులోనే కొనసాగేలా ప్లాన్ చేసి షెడ్యూల్స్ వేస్తున్నారు. దీంతో అనసూయ రెండూ షోస్ లతో బాగా బిజీ అయిపోయిందనే చెప్పాలి.
    Published by:Krishna Adithya
    First published: