అవును.. నిజంగానే ఇప్పుడు బిగ్ బాస్ హేమకు చుక్కలు చూపించాడు జబర్దస్త్ కమెడియన్ హైపర్ ఆది. అసలే మనోడు నోరు తెరిస్తే పంచులు జడివానలా కురుస్తుంటాయి. అందుకే ఆదిని ఏమైనా అనాలంటే ముందే రివర్స్ పంచులకు కూడా సిద్ధంగా ఉండాలి. పంచ్‌ల మహారాణి సుమ కనకాలకే తన పంచ్ పవర్ చూపించాడు హైపర్ ఆది. ఇక ఇప్పుడు ఈయన మరో నటికి కూడా పంచ్ పవర్ రుచి చూపించాడు. ఈ మధ్య హైపర్ ఆది జబర్దస్త్ కామెడీ షోతో పాటు మిగిలిన కార్యక్రమాల్లో కూడా బాగానే పాల్గొంటున్నాడు. ముఖ్యంగా ఈటీవీలో వచ్చే చాలా షోలకు మనోడు కంటెస్టెంట్‌గా వస్తుంటాడు.
హైపర్ ఆది హేమ ఫైల్ ఫోటోస్
ఇప్పుడు ఇలాగే క్యాష్ ప్రోగ్రామ్‌కు వచ్చాడు. వచ్చే వారం ఎపిసోడ్‌కు ఆదికి తోడుగా ముగ్గురు ఆడవాళ్లను పిలిచింది సుమ. ఇద్దరు ప్రముఖ బుల్లితెర యాంకర్స్‌తో పాటు బిగ్ బాస్ ఫేమ్ హేమ కూడా వచ్చింది. ఇక అందరికీ మధ్యలో ఆది ఒక్కడే ఉన్నాడు. వచ్చీ రావడంతోనే హేమ ఏజ్‌పై అదిరిపోయే సెటైర్ వేసాడు. అత్తో అత్తమ్మ కూతురా సాంగ్‌కు ముగ్గురు ఆడాళ్లతో కలిసి స్టెప్పులు వేసిన తర్వాత నేను కూతురు అంటూ హేమ ముందుకొచ్చింది. దాంతో 70ల్లో వచ్చిన సామజవరగమనా పాట ప్లే చేసి.. అప్పుడు పుట్టారు మీరు అంటూ సెటైర్ వేసాడు.
ఆ తర్వాత మీకు మహానటి, అరుంధతి పాత్రల్లో ఏది కష్టంగా ఉంటుంది అని సుమ అడిగితే.. మహానటి ఈజీగా చేస్తాను అంటూ హేమ చెబుతుంది. దాంతో వెంటనే పక్కనే ఉన్న హైపర్ ఆది మరో సెటైర్ వేసాడు. ఏంటి ఏంటి మహానటి ఈజీగా చేస్తారా.. ఏది ఓ కంట్లోంచి నీళ్లు తెప్పించండి చూద్దాం అంటూ పంచ్ వేసాడు. దాంతో హేమ ఏం మాట్లాడలేక తెల్లమొహం వేసుకుంది. లేకపోతే మహానటి ఈజీగా చేస్తారా అంటూ డైలాగ్ పేల్చాడు ఆది. ముగ్గురు ఆడవాళ్లు.. మధ్యలో యాంకర్ సుమ.. అక్కడ హైపర్ ఆదితో అదిరిపోయే ప్రోమో కట్ చేసారు. మొత్తానికి చూడాలిక.. రేపు ఫుల్ ఎపిసోడ్లో హేమపై ఆది ఎంతగా రెచ్చిపోయాడో..? అన్నట్లు ఈ ప్రోమోలో హేమను ఆది ఎత్తుకున్నాడు కూడా.
Published by:Praveen Kumar Vadla
First published:
తెలుగు వార్తలు, తెలుగులో బ్రేకింగ్ న్యూస్ న్యూస్ 18లో చదవండి.
రాష్ట్రీయ, జాతీయ, అంతర్జాతీయ, టాలీవుడ్, క్రీడలు, బిజినెస్, ఆరోగ్యం, లైఫ్ స్టైల్, ఆధ్యాత్మిక, రాశిఫలాలు చదవండి.