జబర్దస్త్‌లో హైపర్ ఆది పంచులు ఎలా ఉంటాయో ప్రత్యేకంగా చెప్పనక్కర్లేదు. ఆయన వస్తే చాలు పంచుల ప్రవాహం నడుస్తుంటుంది. ఇప్పుడు కూడా ఇదే జరిగింది. అసలే కరోనా తర్వాత జబర్దస్త్ కమెడియన్లు మంచి కసి మీద కనిపిస్తున్నారు. ప్రతీ ఎపిసోడ్‌ను ఫైనల్ మాదిరే చూస్తున్నారు. అందుకే పంచులు కూడా అలాగే వస్తున్నాయి. అందులోనూ మరీ ముఖ్యంగా ఆదికి పంచ్ కింగ్ అనే పేరు కూడా ఉందాయే. ఆయన ప్రస్తుతం నడుస్తున్న ట్రెండింగ్ టాపిక్స్‌ను తీసుకుని పంచులు రాసుకుంటాడు. ఇప్పుడు కూడా ఇదే చేసాడు.
తాజాగా ఈయన వేసిన ఓ పంచ్‌కు రోజా మొహం చిన్నబోయింది. అనుకోకుండా వేసిన పంచ్‌తో షాక్ అయిపోయింది. నోరెళ్లబెట్టి హైపర్ ఆది వైపు చూస్తుండిపోయింది. తనపైనే అంత పెద్ద పంచ్ వేస్తాడని అస్సలు ఊహించలేకపోయింది ఈమె. అసలేం జరిగిందంటే.. మొన్నటి జబర్దస్త్ ఎపిసోడ్లో ఎప్పట్లాగే మరో స్పూఫ్ చేసాడు ఆది. అందులో ఆయన ప్రేమించుకుందాం రా..లో వెంకటేష్ లిటిల్ హార్ట్స్ సీన్ చేసాడు. ఈ నేపథ్యంలోనే సైకిల్ తీసుకొచ్చాడు.
స్టేజిపైకి వచ్చీ రాగానే రోజాను చూసి పేలిపోయే పంచ్ వేసాడు. ఒరేయ్ ఎవర్రా అక్కడ.. వెంటనే రోజా గారికి ఏసి పెంచండి.. ఫ్యాన్ స్పీడ్ ఎక్కువ చేయండి అంటూ హడావిడి చేసాడు. ఎందుకంటే ఆమెకు సైకిల్ చూస్తే చాలు వెంటనే కోపం వచ్చేస్తుందంటూ రాజకీయాలను తన పంచ్‌తో మిక్స్ చేసాడు.
తెలుగుదేశం పార్టీ గుర్తు సైకిల్ అని అందరికీ తెలిసిందే.. టీడీపి నాయకులపై రోజా ఎలా ఫైర్ అవుతుందో కూడా ప్రత్యేకంగా చెప్పనక్కర్లేదు. దాంతో ఈ రెండింటినీ మిక్స్ చేసాడు హైపర్ ఆది. ఫ్యాన్ స్పీడ్ పెంచండి అంటూ జగన్ పార్టీ గుర్తును కూడా గుర్తు చేసాడు ఆది. అలాగే సైకిల్ చూస్తే చాలు కారణం లేకుండానే కోపం వచ్చేస్తుందంటూ పంచ్ వేసాడు. ఇది విన్న వెంటనే రోజా షాక్ అయిపోయింది. గతంలోనూ ఆమె పొలిటికల్ లైఫ్‌పై చాలా పంచులు వేసాడు ఆది.
తెలుగు వార్తలు, తెలుగులో బ్రేకింగ్ న్యూస్ న్యూస్ 18లో చదవండి. రాష్ట్రీయ, జాతీయ, అంతర్జాతీయ, టాలీవుడ్, క్రీడలు, బిజినెస్, ఆరోగ్యం, లైఫ్ స్టైల్, ఆధ్యాత్మిక, రాశిఫలాలు చదవండి.
Tags: Hyper Aadi, Jabardasth comedy show, MLA Roja, Telugu Cinema, Tollywood