• Home
  • »
  • News
  • »
  • movies
  • »
  • JABARDASTH COMEDIAN HYPER AADI SENSATIONAL COUNTER TO PRODUCER YCP LEADER PVP ABOUT THE LANGA DANCE TWEET PK

Hyper Aadi - PVP: నిన్ను కుక్కను కొట్టినట్లు కొట్టాలి.. PVPపై విరుచుకుపడ్డ జబర్దస్త్ కమెడియన్ హైపర్ ఆది..

హైపర్ ఆది పివిపి (Hyper Aadi PVP)

Hyper Aadi - PVP: టాలీవుడ్ అగ్ర నిర్మాత, వైసీపీ నేత పివిపి(PVP), జబర్దస్త్ కమెడియన్ హైపర్ ఆది మధ్య మాటల యుద్ధం జరుగుతుంది. పివిపి చేసిన ఓ ట్వీట్ ఇప్పుడు వైరల్ అవుతుంది. దీనిపై వెంటనే రివర్స్ కౌంటర్ వేసారు హైపర్ ఆది(Hyper Aadi).

  • Share this:
ఇండస్ట్రీలో మెగా హీరోలకు అభిమానులు కాదు భక్తులు ఉన్నారు. వాళ్లను ఎవరైనా ఏదైనా అంటే వెంటనే మీడియా ముందుకొస్తారు. అన్న వాళ్లను కడిగి పారేస్తుంటారు. ఇప్పుడు హైపర్ ఆది కూడా ఇదే చేసారు. తాజాగా ఈయన చేసిన ట్వీట్ వైరల్ అవుతుంది. ఈయన ఏకంగా అగ్ర నిర్మాత, వైసిపి నేత, బిజినెస్ మ్యాన్ పివిపిపైనే విరుచుకుపడ్డారు. ఆయన చేసిన ట్వీట్‌ను ఉద్దేశ్యించి రివర్స్ కౌంటర్ వేసారు. పివిపి చేసిన ట్వీట్‌ను చూసి ఈయన కూడా కౌంటర్ వేయడమే కాకుండా.. నిన్ను కుక్కను కొట్టినట్లు కొట్టాలంటూ సెన్సేషనల్ కామెంట్స్ చేసారు ఆది. ఈ మధ్యే ముంబై రైల్వే స్టేషన్‌లో చిన్నారిని కాపాడిన వీడియో ఒకటి వైరల్ అయింది. అక్కడ పని చేసే రైల్వే ఉద్యోగి మయూర్ షేక్ ఓ చిన్నారి ప్రాణాలను తన ప్రాణాలకు తెగించి కాపాడరు. ఆ వీడియో సోషల్ మీడియాలో వైరల్ అయింది. దీనిపై పలువురు సినీ రాజకీయ ప్రముఖులు ప్రశంసల వర్షం కురిపించారు. ఆ వీడియోను షేర్ చేసిన పివిపి.. టాలీవుడ్ హీరోలపై సంచలన కామెంట్స్ చేసారు.

రియల్ హీరో బాబు, రీల్ హీరో కాదు. లంగా డాన్సులేసే సార్లకు 50 కోట్లు, ఈ రియల్ హీరోకి జస్ట్ Jawa బైక్.. హతవిధి! మనం చేసే కొంచమైనా, కొట్టె సీటీమార్ లైనా ఇలాంటి సూపర్ హీరోస్‌కి కొడదాం బ్రదర్స్ అంటూ ట్విట్టర్‌లో ఓ పోస్ట్ చేసారు. ఇది చూసిన తర్వాత పవన్ కళ్యాణ్ ఫ్యాన్స్ మండి పడ్డారు. జనసేన అధ్యక్షుడిని ఉద్దేశించి ఈ ట్వీట్ చేసారు అంటూ పవన్ అభిమానులు పివిపిపై ఫైర్ అయ్యారు.

ఇక దీనిపై ఇప్పుడు జబర్దస్త్ కమెడియన్ హైపర్ ఆది కూడా స్పందించారు. నీలాంటి లంగా బాబులు కోట్లు ఉన్నా కబుర్లు చెప్పడం తప్ప ఒక్క రూపాయి సాయం చెయ్యరు. పులి ని చూసి నక్క వాత ట్టుకోవడం అంటే ఇదే. సినిమా వల్ల బతుకుతూ దానినే అవహేళన‌గా మాట్లాడుతున్న నిన్ను కుక్కని కొట్టినట్టు కొట్టాలి అని జనాలు అనుకుంటున్నారు అంటూ ఓ మెసేజ్‌తో పీవీపీ ట్వీట్‌ను హైపర్ ఆది రీ ట్వీట్ చేశారు. ఇది కూడా వైరల్ అవుతుంది.

ఈ మధ్య వకీల్ సాబ్ సినిమా కోసం పవన్ 50 కోట్ల పారితోషికం అందుకున్నారని సోషల్ మీడియాలో వార్తలు వస్తూనే ఉన్నాయి. దాంతో ఇప్పుడు కావాలనే ఫిగర్ కూడా పెట్టి పవన్ కళ్యాణ్‌ను పివిపి టార్గెట్ చేసారని అభిమానులు మండి పడుతున్నారు. మరీ ముఖ్యంగా జనసేనను కానీ.. పవన్‌ను కానీ ఏదైనా అంటే అస్సలు తట్టుకోలేని హైపర్ ఆది ఇప్పుడు కూడా అదే విధంగా రెచ్చిపోయారు.
Published by:Praveen Kumar Vadla
First published: