జబర్దస్త్ కామెడీ షోకు పోటీగా అదిరిందిని మొదలుపెట్టిన సంగతి ప్రత్యేకంగా చెప్పాల్సిన పనిలేదు. ఆ రోజు నుంచి ఈ రోజు వరకు కూడా జీ తెలుగు, ఈటీవీ పోటీ పడుతున్నాయి. ఇందులో సీనియర్ అయిన ఈటీవీ జబర్దస్త్ కాస్త ముందుంది. అయితే ఇప్పుడు ఒకే ఒక్క ఇంటర్వ్యూతో చాలా విషయాలపై క్లారిటీ ఇవ్వడమే కాకుండా.. చాలా ప్రశ్నలకు సమాధానం కూడా ఇచ్చాడు జబర్దస్త్ కమెడియన్ హైపర్ ఆది. ఈయన చెప్పిన సమాధానాలతో కొందరి బుర్రలు గిర్రున తిరుగుతున్నాయి. ముఖ్యంగా జబర్దస్త్, అదిరింది టిఆర్పీ రేటింగ్స్ గురించి కూడా ఆది మనసులో మాట బయటపెట్టాడు.
ఈ రెండు ప్రోగ్రామ్స్ రేటింగ్స్ గురించి తాను మాట్లాడనని చెప్పాడు. ఎందుకంటే ఆ కార్యక్రమం కూడా బాగుండాలనే తాను కోరుకుంటున్నట్లు తెలిపాడు హైపర్ ఆది. ముఖ్యంగా పోటీ ఉంటేనే బాగుంటుందని చెప్పాడు ఈయన. అక్కడున్న వాళ్లంతా కూడా బాగా కావలసిన వాళ్లే అంటూ చెప్పుకొచ్చాడు ఆది. ముఖ్యంగా నాగబాబు కూడా తనకు కావాల్సిన వాడే అని చెప్పాడు హైపర్ ఆది. నాగబాబు గారు అక్కడున్నారంటే అది కూడా మనకు దగ్గరి షో అని అర్థం చేసుకోవాలి అని చెప్పాడు ఈయన.
ఆయన ఎక్కడున్నా కూడా మేమందరం బాగుండాలనే కోరుకుంటూ ఉంటారని.. ఇప్పటికీ మెసేజ్లు కూడా చేస్తుంటారని చెప్పాడు హైపర్ ఆది. నాగబాబు గారు వెళ్లిన చోట ఉన్న కొంత మంది వ్యక్తుల గురించి తనకు తెలిసిన నిజాల వల్ల తాను ఆయనతో నిలబడలేకపోయానని చెప్పాడు. అందుకే అదిరింది షోకు వెళ్లలేకపోయానని క్లారిటీ ఇచ్చాడు ఆది. తాను ఆ షోకు, కొందరు వ్యక్తులకు మాత్రమే దూరం. కానీ నాగబాబు గారికి తానేప్పటికీ దూరం కాదని క్లారిటీ ఇచ్చాడు ఆది. నాగబాబు ఒక్కడే మంచోడైతే సరిపోదు కదా.. అందుకే అదిరిందికి దూరమయ్యానని కన్ఫర్మ్ చేసాడు హైపర్ ఆది.
తెలుగు వార్తలు, తెలుగులో బ్రేకింగ్ న్యూస్ న్యూస్ 18లో చదవండి. రాష్ట్రీయ, జాతీయ, అంతర్జాతీయ, టాలీవుడ్, క్రీడలు, బిజినెస్, ఆరోగ్యం, లైఫ్ స్టైల్, ఆధ్యాత్మిక, రాశిఫలాలు చదవండి.
Tags: Adirindi comedy show, Hyper Aadi, Telugu Cinema, Tollywood