హైపర్ ఆది ఫోటోస్ (credit - insta - madhurasdesignerstudio)
Jabardasth Comedy Show : రష్మీ గౌతమ్, సుడిగాలి సుధీర్ తర్వాత హిట్ పెయిర్‌గా నిలిచిన జంట.. అనసూయ భరద్వాజ్, హైపర్ ఆది. రష్మీ, సుధీర్ అంత కాకపోయినా.. అనసూయ, ఆది బాగానే చేస్తున్నారు. వీరిద్దరు కూడా బుల్లితెరపై రొమాన్స్ పండించాలని ట్రై చేస్తున్నారు.
రష్మీ గౌతమ్, సుడిగాలి సుధీర్ తర్వాత హిట్ పెయిర్‌గా నిలిచిన జంట.. అనసూయ భరద్వాజ్, హైపర్ ఆది. రష్మీ, సుధీర్ అంత కాకపోయినా.. అనసూయ, ఆది బాగానే చేస్తున్నారు. వీరిద్దరు కూడా బుల్లితెరపై రొమాన్స్ పండించాలని ట్రై చేస్తున్నారు. ముఖ్యంగా ఈ మధ్య హైపర్ ఆది స్కిట్లలో కచ్చితంగా అనసూయకు ఓ పాత్ర ఇస్తున్నాడు ఆది. గురువారం ప్రసారమైన జబర్దస్త్ షోలో కూడా అనసూయతో ఓ పాత్ర చేయించాడు. ఖుషీ సినిమాలో పవన్ కల్యాణ్, భూమిక మధ్య పండిన రొమాన్స్.. నడుము సన్నివేశాన్ని హైపర్ ఆది స్ఫూఫ్ చేశాడు. అందులో భాగంగా అనసూయ నడుముపై హైపర్ ఆది కన్నేశాడు. అయితే.. నిజ జీవితంలో అనసూయకు పెళ్లై, పిల్లలు కూడా ఉండటంతో ఆ సన్నివేశం చేయడానికి ఆది కాస్త ఇబ్బంది పడ్డాడు.
కాగా, ఈ సన్నివేశం సహా ఆది స్కిట్ ఆసాంతం పంచ్‌లు, ప్రాసలతో కడుపుబ్బా నవ్వించింది. షోకు జడ్జిలుగా వ్యవహరించిన హీరో రాజ్‌తరుణ్, డైరెక్టర్ తరుణ్ భాస్కర్, రోజా నవ్వు ఆపుకోలేకపోయారు. స్కిట్ మొత్తం వారు నవ్వుతూనే కనిపించారు. ఈ సందర్భంగా హైపర్ ఆది స్కిట్లు అంటే తనకు చాలా ఇష్టమని రాజ్ తరుణ్ చెప్పడంతో ఆది పొంగిపోయాడు.
Published by:Shravan Kumar Bommakanti
First published:
తెలుగు వార్తలు, తెలుగులో బ్రేకింగ్ న్యూస్ న్యూస్ 18లో చదవండి.
రాష్ట్రీయ, జాతీయ, అంతర్జాతీయ, టాలీవుడ్, క్రీడలు, బిజినెస్, ఆరోగ్యం, లైఫ్ స్టైల్, ఆధ్యాత్మిక, రాశిఫలాలు చదవండి.