JABARDASTH COMEDIAN HYPER AADI SATIRES ON TOLLYWOOD CHOREOGRAPHER JANI MASTER IN DHEE 14 PROMO PK
Hyper Aadi - Jani Master: మా పేరు చెప్పుకుని ఇంకా ఎన్ని రోజులు ఇలా.. జానీ మాస్టర్‌పై హైపర్ ఆది సెటైర్..
జానీ మాస్టర్‌పై హైపర్ ఆది సెటైర్లు (hyper aadi jani master)
Hyper Aadi - Jani Master: బుల్లితెరపై హైపర్ ఆదికి (Hyper Aadi - Jani Master) ఉన్న ఫాలోయింగ్ గురించి ప్రత్యేకంగా చెప్పాల్సింది ఏం ఉంది..? ఆయన పంచులు, సెటైర్లు అన్నీ బాగా పాపులర్. ముఖ్యంగా హైపర్ ఆది స్క్రీన్ మీదకు వచ్చాడంటే చాలు పడి పడి నవ్వుతుంటారు ఆడియన్స్. అంతగా పంచులు వేస్తుంటాడు ఈయన.
బుల్లితెరపై హైపర్ ఆదికి ఉన్న ఫాలోయింగ్ గురించి ప్రత్యేకంగా చెప్పాల్సింది ఏం ఉంది..? ఆయన పంచులు, సెటైర్లు అన్నీ బాగా పాపులర్. ముఖ్యంగా హైపర్ ఆది స్క్రీన్ మీదకు వచ్చాడంటే చాలు పడి పడి నవ్వుతుంటారు ఆడియన్స్. అంతగా పంచులు వేస్తుంటాడు ఈయన. అప్పుడప్పుడూ తన కడుపు మంటను కూడా అలాగే బయటపెడుతుంటాడు ఆది. కావాల్సిన వాళ్లపై కూడా పంచులు వేస్తుంటాడు ఈయన. ఇప్పుడు కూడా ఇదే చేసాడు. తాజాగా తన ఫ్రస్ట్రేషన్ అంతా చూపించాడు హైపర్ ఆది. అదిరిపోయే పంచ్‌లతో పిచ్చెక్కించాడు. ఈయన కేవలం జబర్దస్త్ కామెడీ షో మాత్రమే కాదు.. ఢీలో కూడా కనిపిస్తున్నాడు. అక్కడ్నుంచి సుడిగాలి సుధీర్, రష్మి గౌతమ్ తప్పుకున్నా.. ఆది మాత్రం అక్కడే ఉన్నాడు. అక్కడ కామెడీ పార్ట్ మొత్తం ఈయనొక్కడే చూసుకుంటున్నాడు. బిగ్ బాస్ ఫేమ్ అఖిల్‌ను కూడా తీసుకున్నా కూడా పెద్దగా యూజ్ అయితే లేదు.
మనోడు అలా కూర్చుంటున్నాడే కానీ ఏం ఉపయోగం అయితే లేదు అంటూ సెటైర్లు కూడా పేలుతున్నాయి. హైపర్ ఆది కూడా ఇదే పంచులు వేస్తుంటాడు ఈయనపై. నువ్వుండి అమ్మాయిలను చూడటం తప్ప ఇంకేం చేస్తున్నావ్ భయ్యా అంటూ అఖిల్‌పై బాగానే డైలాగులు వేస్తుంటాడు హైపర్ ఆది. తాజాగా తన కడుపు మంట జానీ మాస్టర్‌పై చూపించాడు. శేఖర్ మాస్టర్ ఢీ నుంచి వెళ్లిపోయిన తర్వాత.. చాలా మంది జడ్జిలు మారుతున్నారు. మధ్యలో కొన్ని రోజులు గణేష్ మాస్టర్ వచ్చాడు. ఇప్పుడు కొన్ని వారాల నుంచి జానీ వస్తున్నాడు. ఆయన కూడా అక్కడున్న అమ్మాయిలతో పులిహోర బాగానే కలుపుతున్నాడు.
ఇప్పుడు కూడా ఇదే చేసాడు జానీ. ప్రియమణితో పాటు మరో జడ్జితో ఎప్పటికప్పుడు పులిహోర కలపడంలో ఆది ఆరితేరిపోయాడు. అప్పుడప్పుడూ మనోడు కలిపే పులిహోర హద్దులు కూడా దాటేస్తుంటుంది. ప్రియమణితో హగ్గులు తీసుకోవడం.. బావ అని పిలుపించుకోవడం చేస్తూ హైపర్ ఆది బాగానే రెచ్చిపోతుంటాడు. ఈ మధ్యే వచ్చిన నందిత శ్వేతను కూడా వదలడం లేదు హైపర్ ఆది. ఒక హగ్ ఇవ్వాల్సిందే అంటూ రెచ్చిపోయాడు.
ఆది అంటే బొగ్గు అనుకుంటివా.. హగ్గు అంటూ పుష్ప రేంజ్లో రెచ్చిపోయాడు. అలాగే తాజాగా విడుదలైన ప్రోమోలో కూడా ఇదే జరిగింది. ఒక హగ్ కోసం నందిత, ప్రియమణిల వద్దకు వచ్చిన హైపర్ ఆదికి జానీ మాస్టర్ షాక్ ఇస్తాడు. ఆయనకు కాకుండా జానీకి ప్రియమణి, నందిత శ్వేతా ఇద్దరూ హగ్గులు ఇస్తారు. దాంతో వెంటనే కడుపు మండిన ఆది.. మా పేర్లు చెప్పుకుని ఎన్నిసార్లు హగ్స్ తీసుకుంటారు అంటూ సెటైర్ వేసాడు. అయినా కూడా జానీ మాస్టర్ తగ్గేదే లే అనేసాడు. మీకు అయితే ఇవ్వరు.. నాకు చూశావా? అన్నట్టుగా వాళ్లిద్దరితో హగ్గులు తీసుకుంటూ జానీ మాస్టర్ రచ్చ చేసాడు.
Published by:Praveen Kumar Vadla
First published:
తెలుగు వార్తలు, తెలుగులో బ్రేకింగ్ న్యూస్ న్యూస్ 18లో చదవండి.
రాష్ట్రీయ, జాతీయ, అంతర్జాతీయ, టాలీవుడ్, క్రీడలు, బిజినెస్, ఆరోగ్యం, లైఫ్ స్టైల్, ఆధ్యాత్మిక, రాశిఫలాలు చదవండి.