Jabardasth Hyper Aadi: జబర్దస్త్ కమెడియన్ ఆరోగ్యంపై హైపర్ ఆది పంచుల వర్షం..

జబర్దస్త్ హైపర్ ఆది (Jabardasth Hyper Aadi)

Jabardasth Hyper Aadi: జబర్దస్త్ కమెడియన్ హైపర్ ఆది(Jabardasth Hyper Aadi) పంచులు ఎలా ఉంటాయో ప్రత్యేకంగా గుర్తు చేయాల్సిన అవసరం లేదు. ఎందుకంటే ఎవరైనా కాస్త పంచులు వేస్తే చాలు హైపర్ ఆది అనుకుంటున్నావా అంటారు.

  • Share this:
జబర్దస్త్ కమెడియన్ హైపర్ ఆది పంచులు ఎలా ఉంటాయో ప్రత్యేకంగా గుర్తు చేయాల్సిన అవసరం లేదు. ఎందుకంటే ఎవరైనా కాస్త పంచులు వేస్తే చాలు హైపర్ ఆది అనుకుంటున్నావా అంటారు. అంతగా ఈ కుర్ర కమెడియన్ పంచులు ఫేమస్ అయిపోయాయి. స్కిట్‌లో కంటెంట్ లేకుండా కేవలం పంచులతోనే కామెడీ పుట్టించగల అతి తక్కువ మంది కమెడియన్స్‌లో ఆది ముందుంటాడు. ఈయన చేతికి మైక్ వచ్చిందంటే చాలు నాన్ స్టాప్ పంచులు పడుతూనే ఉంటాయి. ఇప్పుడు కూడా ఇదే జరిగింది. తాజాగా శ్రీదేవి డ్రామా కంపెనీ ప్రోమో విడుదలైంది. అందులో ప్రతీవారం పంచ్ ప్రసాద్ పంచుల వర్షం కురిపించేవాడు. ఈ సారి మాత్రం ఆయనపైనే హైపర్ ఆది నాన్ స్టాప్ పంచులు వేసాడు. ఊపిరి తీసుకోనీకుండా వరస పంచులతో ఉక్కిరి బిక్కిరి చేసాడు ఆది. ఓ స్కిట్‌లో భాగంగా హైపర్ ఆది, రామ్ ప్రసాద్, సుడిగాలి సుధీర్ చేతిలో ప్లేట్స్ పట్టుకుని అడుక్కునే పాత్రలు వేసారు.

ఒక్క పూట అన్నం కోసం అంటూ బిచ్చగాడు పాట కూడా బ్యాగ్రౌండ్‌లో ప్లే చేసారు. వాళ్ల గెటప్స్ చూసి స్టేజీపైకి వచ్చిన ప్రసాద్.. ఏంటయ్యా మీరు బెగ్గర్సా అనేసాడు. దానికి వెంటనే హైపర్ ఆది.. అవునండీ.. మీ ఆపరేషన్ కలెక్ట్ చేస్తున్నాం అనేసాడు. కాసేపటి తర్వాత ఇంజెక్షన్ వరకు వచ్చాయన్నా.. అరగంట కూర్చుంటే ఆపరేషన్ కవర్ అయిపోద్దన్నా అంటూ సెటైర్లు వేసాడు.

అసలు విషయం ఏంటంటే.. పంచ్ ప్రసాద్‌కు చాలా రోజుల నుంచి అనారోగ్య సమస్యలున్నాయి. కిడ్నీ సంబంధిత వ్యాధితో ఆయన బాధ పడుతున్నాడు. జబర్దస్త్ కమెడియన్స్ సాయంతోనే ఆయన బతికాడు. అయితే తర్వాత స్కిట్స్‌లోనూ ఆ అనారోగ్యాన్నే పంచుల కోసం వాడుకుంటున్నారు. ఇప్పుడు ఆది కూడా ఇదే చేసాడు.
Published by:Praveen Kumar Vadla
First published: