Home /News /movies /

JABARDASTH COMEDIAN HYPER AADI ROMANCE WITH NANI SNEHITHUDA MOVIE ACTRESS MADHAVI LATHA PK

నాని హీరోయిన్‌తో హైపర్ ఆది రొమాన్స్.. అనసూయ షాక్..

హైపర్ ఆది మాధవి లత (hyper aadi anasuya madhavi latha)

హైపర్ ఆది మాధవి లత (hyper aadi anasuya madhavi latha)

Hyper Aadi: ఈ మధ్య హైపర్ ఆది బాగా రొమాంటిక్ అయిపోతున్నాడు. మనోడు చేసే పనులు చూసి అంతా షాక్ అవుతున్నారు కూడా. కెరీర్ కొత్తలో అమ్మాయిలంటేనే కిలోమీటర్ దూరం పరిగెత్తే ఆది.. ఇప్పుడు మాత్రం వాళ్లే కావాలంటున్నాడు.

ఈ మధ్య హైపర్ ఆది బాగా రొమాంటిక్ అయిపోతున్నాడు. మనోడు చేసే పనులు చూసి అంతా షాక్ అవుతున్నారు కూడా. కెరీర్ కొత్తలో అమ్మాయిలంటేనే కిలోమీటర్ దూరం పరిగెత్తే ఆది.. ఇప్పుడు మాత్రం వాళ్లే కావాలంటున్నాడు. వెంటపడి మరీ అమ్మాయిలతోనే స్కిట్స్ చేస్తున్నాడు ఈ కమెడియన్. అందులో భాగంగానే జబర్దస్త్‌కు కొత్త అమ్మాయిలను కూడా తీసుకొస్తున్నాడు ఆది. తన స్కిట్‌‌లో అమ్మాయిలు లేకుండా అసలు మనోడు ముందుకు వెళ్లడం లేదు. ప్రతీవారం కనీసం ఎవరో ఓ అమ్మాయి ఈయన స్కిట్‌లో చేస్తుంది. ఇప్పుడు కూడా ఇదే జరిగింది. వచ్చే వారం ఆది స్కిట్‌కు రాబోతుంది నాని హీరోయిన్ మాధవి లత.
హైపర్ ఆది మాధవి లత (hyper aadi anasuya madhavi latha)
హైపర్ ఆది మాధవి లత (hyper aadi anasuya madhavi latha)

నచ్చావులే సినిమాతో పరిచయం అయిన ఈ ముద్దుగుమ్మ.. ఆ తర్వాత కొన్ని సినిమాలు చేసింది కానీ గుర్తింపు మాత్రం రాలేదు. ఆ తర్వాత నానితో స్నేహితుడా సినిమాలో నటించింది. అయితే అది కూడా ఫ్లాప్ కావడంతో పెద్దగా కెరీర్‌కు యూజ్ కాలేదు. ఆ తర్వాత రాజకీయాలు అంటూ అటు వెళ్లిపోయింది. దాంతో పాటు ఇండస్ట్రీలో అవకాశాలు రావాలంటే పడుకోవాల్సిందే అంటూ సంచలన వ్యాఖ్యలు చేసింది. ఇక ఇప్పుడు చివరికి జబర్దస్త్ షోకు వచ్చింది మాధవి లత.
హైపర్ ఆది మాధవి లత (hyper aadi anasuya madhavi latha)
హైపర్ ఆది మాధవి లత (hyper aadi anasuya madhavi latha)

ఇందులో హైపర్ ఆదితో కలిసి రొమాన్స్ చేసింది ఈ బ్యూటీ. గతవారం యాంకర్ మంజూషను తీసుకొచ్చాడు ఆది. దానికి ముందు బిగ్ బాస్ ఫేమ్ రోహిణితో రొమాన్స్ చేసాడు. దానికి ముందు అనసూయతో ఎన్నో స్కిట్స్ చేసాడు. ఇక ఇప్పుడు మాధవి లతతో రొమాన్స్ చేస్తుంటే.. అనసూయ మాత్రం అలా చూస్తుండిపోయింది. దాంతో వెంటనే రోజా కూడా సెటైర్ వేసింది. ఇక్కడేదో కాలుతున్న వాసన వస్తుందే అంటూ అనసూయపై అదిరిపోయే పంచ్ వేసింది ఈ సీనియర్ హీరోయిన్. ఏదేమైనా కూడా ఈ మధ్య హైపర్ ఆది మాత్రం బాగా రొమాంటిక్ అయిపోయాడు.
Published by:Praveen Kumar Vadla
First published:

Tags: Hyper Aadi, Madhavi latha, Telugu Cinema, Tollywood

ఉత్తమ కథలు

తదుపరి వార్తలు