జబర్దస్త్‌లో హైపర్ ఆది వేసే పంచ్‌లకు నవ్వని వారుండరు. స్కిట్లో కూడా అందరికి సమ ప్రాధాన్యం ఇస్తాడు. తాను ఎదుగుతూనే తోటి ఆర్టిస్టులు కూడా ఎదగడానికి దోహదపడతాడు. అందుకే అతడి స్కిట్లో చేయడానికి రోజా, అనసూయ కూడా సై అన్నారు. అందుకే సుధీర్‌తో పాటు టాప్ పొజిషన్లో కొనసాగుతున్నాడు. కాగా.. రోజా అభిమానులు ఆనందపడే ఓ విషయాన్ని జబర్దస్త్ వేదికగా చెప్పాడు. రోజా ఫేవరెట్ హీరో ఎవరో చెప్పేశాడు. స్కిట్ పూర్తయ్యాక.. మాట్లాడుతూ.. రోజా గారి ఫేవరెట్ సూపర్ స్టార్ మహేశ్ బాబు అని అన్నాడు. సూపర్ స్టార్ కృష్ణ అంటే ఎంతో ఇష్టపడే రోజా.. కృష్ణ తనయుడు మహేశ్ బాబును కూడా ఇష్టపడటంలో తప్పేం లేదంటున్నారు సినీ పండితులు.
కాగా, మహేశ్ బాబు నటించిన సరిలేరు నీకెవ్వరు సంక్రాంతి సందర్భంగా విడుదలై రికార్డులు సృష్టించింది. ఆ సినిమాలో మహేశ్ బాబు సరసన రష్మిక మందన్నా నటించింది. కీలక పాత్రలో విజయశాంతి నటించిన విషయం తెలిసిందే.
తెలుగు వార్తలు, తెలుగులో బ్రేకింగ్ న్యూస్ న్యూస్ 18లో చదవండి. రాష్ట్రీయ, జాతీయ, అంతర్జాతీయ, టాలీవుడ్, క్రీడలు, బిజినెస్, ఆరోగ్యం, లైఫ్ స్టైల్, ఆధ్యాత్మిక, రాశిఫలాలు చదవండి.
Tags: Hyper Aadi, Jabardasth comedy show, Rk roja