JABARDASTH COMEDIAN HYPER AADI REVEALS ABOUT HIS LOVE FAILURE SK
నా లవర్‌కు పెళ్లైంది... హైపర్ ఆది లవ్ ఫెయిల్యూర్ స్టోరీ..
హైపర్ ఆది ( ప్రతీకాత్మక చిత్రం)
ఇకపై తన జీవితంలో ప్రేమాదోమా ఉండదని.. పెద్దలు కుదర్చిన పెళ్లే చేసుకుంటానని స్పష్టం చేశాడు. తన పంచుల సీక్రెట్ రైటింగేనని చెప్పిన హైపర్ ఆది.. ఇండస్ట్రీలో ఆర్పీ తన బెస్ట్ ఫ్రెండ్ అని చెప్పాడు.
బుల్లితెరపై జబర్దస్త్ సంచలనాలేంటో అందరికీ తెలిసిందే. గురు, శుక్ర వారాల్లో టీవీల్లో జబర్దస్త్ చేసే సందడి అంతా ఇంతా కాదు. ఇక జబర్దస్త్ టీమ్స్‌లో హైపర్ ఆదికి ప్రత్యేకమైన ఫాలోయింగ్ ఉంది. హైపర్ ఆది స్కిట్లంటే పడిపడి నవ్వుతారు జనాలు. ఆది వేసే నాన్ స్టాప్ పంచులు కడుపుబ్బా నవ్విస్తుంటాయి. ఒక్కోసారి జడ్జిలు నాగబాబు, రోజా నవ్వు ఆపుకోలేక ఇబ్బందిపడ్డ సందర్భాలూ ఉన్నాయి. అంతలా పంచుల పటాకులు పేల్చుతాడు ఆది. ఐతే తన పర్సనల్ లైఫ్‌కి సంబంధించి ఆసక్తికర విషయాలు బయటకొచ్చాయి. తనది లవ్ ఫెయిల్యూర్ అని.. తాను ప్రేమించిన అమ్మాయికి పెళ్లయిపోయిందని ఓ యూ ట్యూబ్ ఛానెల్‌కి ఇచ్చిన ఇంటర్వ్యూలో చెప్పాడు ఆది.
కాలేజీ రోజుల్లో ఓ అమ్మాయిని ఇష్టపడ్డానని చెప్పిన ఆది.. ఆమెను సీరియస్‌గా లవ్ చేశానని తెలిపాడు. కానీ ఆమెకు పెళ్లపోయిందని, పెళ్లి కాకుంటే ప్రపోజ్ చేసేవాడినని చెప్పాడు. ఇప్పటి వరకు ఎవరికీ లవ్ లెటర్స్ రాయలేదని వెల్లడించాడు. ఇకపై తన జీవితంలో ప్రేమాదోమా ఉండదని.. పెద్దలు కుదర్చిన పెళ్లే చేసుకుంటానని స్పష్టం చేశాడు హైపర్ ఆది. తన పంచుల సీక్రెట్ రైటింగేనని చెప్పిన హైపర్ ఆది.. ఇండస్ట్రీలో ఆర్పీ తన బెస్ట్ ఫ్రెండ్ అని చెప్పాడు. బంధువులు గతంలో మనుషులకు విలువ ఇచ్చే వారని.. కానీ ఇప్పుడు వాళ్లున్న పొజిషన్ బట్టి వ్యాల్యూ ఇస్తున్నారని పేర్కొన్నాడు. తల్లిదండ్రుల తర్వాత తనకు అభి, నాగబాబు, డైరెక్టర్స్ అంటే చాలా ఇష్టమని చెప్పుకొచ్చాడు.
Published by:Shiva Kumar Addula
First published:
తెలుగు వార్తలు, తెలుగులో బ్రేకింగ్ న్యూస్ న్యూస్ 18లో చదవండి.
రాష్ట్రీయ, జాతీయ, అంతర్జాతీయ, టాలీవుడ్, క్రీడలు, బిజినెస్, ఆరోగ్యం, లైఫ్ స్టైల్, ఆధ్యాత్మిక, రాశిఫలాలు చదవండి.