జబర్దస్త్ జడ్జ్ రోజాకు హైపర్ ఆది దిమ్మ దిరిగే పంచ్‌లు..

రోజా, హైపర్ ఆది (Roja Hyper Aadi)

జబర్దస్త్ జడ్జ్ కమ్ వైసీపీ ఎమ్మెల్యే రోజా ఉంటే అవతల ఎంతటి వాళ్లకైనా హడల్. జబర్దస్త్ జడ్జ్‌గా ఒక వైపు చేస్తూనే.. మరోవైపు వైసీపీ ఎమ్మెల్యేగా.. ఏపీఐఐసీ చైర్మన్‌గా బహుముఖ ప్రజ్ఞను ప్రదర్శిస్తోంది. తాజాగా రోజాపై ఓ ప్రోగ్రామ్ సాక్షిగా మంచి పంచ్‌లే విసిరాడు.

  • Share this:
    జబర్దస్త్ జడ్జ్ కమ్ వైసీపీ ఎమ్మెల్యే రోజా ఉంటే అవతల ఎంతటి వాళ్లకైనా హడల్. జబర్దస్త్ జడ్జ్‌గా ఒక వైపు చేస్తూనే.. మరోవైపు వైసీపీ ఎమ్మెల్యేగా.. ఏపీఐఐసీ చైర్మన్‌గా బహుముఖ ప్రజ్ఞను ప్రదర్శిస్తోంది. అలాంటి రోజా న్యూ ఇయర్ సందర్భంగా ఈటీవీలో ‘ఆడవారి పార్టీలకు అర్ధాలే వేరులే’ అనే ప్రోగ్రామ్ చేసింది. రీసెంట్‌గా ఈ కార్యక్రమానికి సంబంధించిన ప్రోమోను మల్లెమాల వాళ్లు రిలీజ్ చేసారు. ఈ ప్రోమోలో రోజాతో పాటు హైపర్ ఆది, మరో యాంకర్  వర్షిణి ఉన్నారు. ఈ సందర్భంగా వర్షిణి.. హైపర్ ఆదిని ఆడవారి పార్టీలకు మగవారు ఎలా వచ్చారని ప్రశ్నించింది. ఈ సందర్భంగా యాంకర్ వర్షిణి.. హైపర్ ఆదిని ఎత్తేస్తా అని చెప్పింది. దానికి ఏది ఎత్తు చూద్దాం అన్నాడు. దానికి వర్షిణి.. హైపర్ ఆదిని ఒక్కసారిగా అమాంతం లేపి ప్రేక్షకులను ఆశ్చర్యచకితలను చేసింది. ఈ సందర్భంగా వర్షిణి.. హైపర్ ఆది ఉద్దేశించి ఇపుడు ఏంమంటావ్ అని అడగగా.. మరో ఎత్తితే బాగుండు అని హైపర్ ఆది పంచ్ వేయడం అందరినీ నవ్వించింది.

    ఆ తర్వాత రోజా రంగ ప్రవేశం చేయడంతో వర్షిణి.. హైపర్ ఆదిని ఉద్దేశిస్తూ.. ఇతడు పనోడు అంది. దానికి రోజా.. ఐతే..  ప్రెస్ మీట్ పెట్టు .. హైపర్ ఆదికి ఆర్డర్ పాస్ చేసింది రోజా. కానీ హైపర్ ఆది మాత్రం.. ఇది మీరనకున్న పార్టీ కాదు.. ఆడవారి పార్టీలకు అర్ధాలే వేరు అని చెప్పి పంచ్ వేయడంతో అవాక్కవడం రోజా వంతు అయింది. ఈ కార్యక్రమం న్యూ ఇయర్ సందర్భంగా ఈటీవీలో ప్రసారం కానుంది.
    Published by:Kiran Kumar Thanjavur
    First published: