Hyper Aadi: ఇంద్రభవనం లాంటి హైపర్ ఆది ఇల్లు ఇదే.. ఈ వీడియోనే సాక్ష్యం..

జబర్దస్త్ హైపర్ ఆది (jabardasth hyper aadi)

Hyper Aadi: జబర్దస్త్ కమెడియన్ హైపర్ ఆదికి ఉన్న క్రేజ్ గురించి కొత్తగా చెప్పాల్సిన అవసరం లేదు. బుల్లితెరపై ఈయనకు సూపర్ ఫాలోయింగ్ ఉంది. తనదైన పంచులతో పిచ్చెక్కిస్తుంటాడు ఆది. అలాగే సినిమాల్లో కూడా సత్తా చూపించడానికి ప్రయత్నిస్తున్నాడు.

  • Share this:
జబర్దస్త్ కమెడియన్ హైపర్ ఆదికి ఉన్న క్రేజ్ గురించి కొత్తగా చెప్పాల్సిన అవసరం లేదు. బుల్లితెరపై ఈయనకు సూపర్ ఫాలోయింగ్ ఉంది. తనదైన పంచులతో పిచ్చెక్కిస్తుంటాడు ఆది. అలాగే సినిమాల్లో కూడా సత్తా చూపించడానికి ప్రయత్నిస్తున్నాడు. ఇదిలా ఉంటే హైపర్ ఆది గురించి ఎప్పటికప్పుడు సోషల్ మీడియాలో కూడా వార్తలు వస్తూనే ఉంటాయి. ముఖ్యంగా ఈయన ఇంటిపై.. ఆస్తులపై వార్తలు వస్తుంటాయి. సోషల్ మీడియాలో దీనిపై గుట్టలు గుట్టలుగా వార్తలున్నాయి. హైపర్ ఆదికి ఇంద్రభవనం లాంటి ఇల్లు ఉందని.. ఆయనకు కోట్ల రూపాయల ఆస్తులు ఉన్నాయని చాలానే ప్రచాచం జరుగుతుంది. ఇదిలా ఉంటే అసలు నిజంగా ఆదికి ఎలాంటి ఇల్లు ఉంది.. అది ఇంద్రభవనంలా ఉంటుందా.. అన్ని కోట్ల ఆస్తులు నిజంగానే ఉన్నాయా అనే అనుమానాలు చాలా మందిలో ఉన్నాయి. దీనికి సమాధానం ఇప్పుడు వచ్చింది. హైపర్ ఆది టీంలోనే చేసే పరదేశి ఈ ప్రశ్నలకు సమాధానాలు ఇచ్చాడు. ఆయన తనకోసం ప్రత్యేకమైన యూ ట్యూబ్ ఛానెల్ పెట్టుకున్నాడు. అందులో కొన్ని వీడియోలు చేస్తున్నాడు. ఈ క్రమంలోనే హైపర్ ఆది హోమ్ టూర్ చేసాడు పరదేశి. హైదరాబాద్‌లో ఉన్న హైపర్ ఆది ఇంటిని చూపించాడు. ఈ వీడియోలో తన ఇంటిని మొత్తం తిప్పి చూపించాడు ఆది.

యూ ట్యూబ్‌లో వచ్చే వీడియోలకు సమాధానం చెప్పడానికి.. తనకు ఇంద్రభవనం లాంటి ఇల్లు ఉందని ప్రచారం చేస్తున్న వాళ్లకు ఈ వీడియోనే సాక్ష్యంగా నిలిచింది. హైదరాబాద్‌లో ఓ సొంత ఫ్లాట్ కొనుగోలు చేసాడు ఆది. అందులోనే ప్రస్తుతం ఉంటున్నాడు ఈయన. తన ఇంట్లోని ప్రతీ వస్తువును చూపిస్తూ.. ఇదే తన కలల సౌధం అంటూ చెప్పుకొచ్చాడు హైపర్ ఆది. బాల్కనీలో కూర్చున్నపుడు తనకు అద్భుతమైన ఆలోచనలు వస్తుంటాయని.. అక్కడ కూర్చుని ఐడియాలు రాసుకుంటానని చెప్పాడు ఆది. అక్కడే స్క్రిప్టులు కూడా సిద్ధం చేసుకుంటున్నట్లు చెప్పాడు ఈ జబర్దస్త్ కమెడియన్. ప్రస్తుతం హైపర్ ఆది ఇంటికి సంబంధించిన వీడియో యూ ట్యూబ్‌లో వైరల్ అవుతుంది.
Published by:Praveen Kumar Vadla
First published: