వర్షిణితో ఎఫైర్ నిజమే కానీ.. హైపర్ ఆది అసలు నిజాలు..

హైపర్ ఆది వర్షిణి మధ్య రొమాన్స్ (hyper aadi varshini)

Hyper Aadi Varshini: హైపర్ ఆది.. పరిచయం అవసరం లేని పేరు. ఈయన గురించి తెలుసుకోవాలంటే పంచ్ డైలాగులు అని కొడితే చాలు. తన పంచులతో ఎప్పటికప్పుడు కడుపులు..

  • Share this:
హైపర్ ఆది.. పరిచయం అవసరం లేని పేరు. ఈయన గురించి తెలుసుకోవాలంటే పంచ్ డైలాగులు అని కొడితే చాలు. తన పంచులతో ఎప్పటికప్పుడు కడుపులు చెక్కలు చేయడం ఆదికి అలవాటే. అయితే ఇప్పటి వరకు కేవలం కాంట్రవర్సీల్లో మాత్రమే కామెడీ చేస్తూ వచ్చాడు హైపర్ ఆది. ఈయనపై ఎఫైర్స్ వార్తలు మాత్రం ఇప్పటి వరకు రాలేదు. కెరీర్లో పెద్దగా ఎప్పుడూ అమ్మాయిలతో ఉన్నట్లు కూడా కనిపించలేదు ఆది. జబర్దస్త్ కామెడీ షోలో అప్పుడప్పుడూ అనసూయతో డ్యూయెట్స్ చేస్తూ కామెడీ చేయడం మినహా ఎవరితోనూ ఎఫైర్స్ నడుపుతున్నాడనే వార్తలు మాత్రం రాలేదు.

హైపర్ ఆది వర్షిణి మధ్య రొమాన్స్ (hyper aadi varshini)
హైపర్ ఆది వర్షిణి మధ్య రొమాన్స్ (hyper aadi varshini)


ఇప్పుడు పరిస్థితులు అలా లేవు.. ఆదిపై ఎఫైర్ వార్తలు ఇప్పుడు వచ్చాయి.. ఈయన ఈ మధ్యే కమెడియన్ నుంచి హోస్టుగా కూడా మారాడు. పైగా వరసగా యాంకర్ వర్షిణితో కలిసి కొన్ని ప్రోగ్రామ్స్ హోస్టింగ్ కూడా చేస్తున్నాడు. ఢీ ఛాంపియన్స్‌లో ఈ ఇద్దరి మధ్య కెమిస్ట్రీ కూడా బాగానే పండుతుంది. అమాయకంగా ఉండే వర్షిణిపై తనదైన పంచులు వేస్తూ నవ్విస్తున్నాడు ఆది. ఈ ఇద్దరి మధ్య ఏదో జరుగుతుందనే న్యూస్ బయటికి కూడా వచ్చేస్తుంది. ఢీ ఛాంపియన్స్‌లో సుధీర్, రష్మి జోడీని మరిపించే విధంగా ఈ ఇద్దరూ మాయ చేస్తున్నారు.

హైపర్ ఆది ఫోటోస్ (credit - insta - madhurasdesignerstudio)
వర్షిణి, హైపర్ ఆది (Image: youtube)


ఈ ఇద్దరే ప్రతీ ఈవెంట్‌లో రచ్చ చేస్తున్నారు. ఇదిలా ఉంటే ఇప్పుడు ఆది, వర్షిణి మధ్య సమ్‌థింగ్ ఈజ్ గోయింగ్ ఆన్ అంటూ వార్తలు పుట్టుకొచ్చాయి. దానికి కారణం కూడా హైపర్ ఆదే. ఆయనే తమ ఇద్దరి మధ్య ఒకటి నడుస్తుందని ఒప్పుకున్నాడు. ఢీ ఛాంపియన్స్‌లో వరసగా రొమాంటిక్ పాటలకు డాన్సులు కూడా చేస్తున్నారు వర్షిణి, ఆది జోడీ. ఈ ఇద్దరి కెమిస్ట్రీ అదిరిపోయింది కూడా. అయితే ఇదంతా తాము ఢీ ఛాంపియన్స్ కోసమే చేస్తున్నామని చెప్పాడు ఈ కమెడియన్. అవతలి వైపు సుధీర్, రష్మి లాంటి జోడీ ఉన్నారు కాబట్టి వాళ్లను తట్టుకోవాలంటే ఆ మాత్రం రొమాన్స్ తప్పదంటున్నాడు ఈయన.

హైపర్ ఆది వర్షిణి మధ్య రొమాన్స్ (hyper aadi varshini)
హైపర్ ఆది వర్షిణి మధ్య రొమాన్స్ (hyper aadi varshini)


ఆది, వర్షిణి మధ్య రొమాన్స్ కూడా పీక్స్‌కు వెళ్లిపోతుంది. మరోవైపు వర్షిణి కూడా ఆదితో బాగానే మింగిల్ అయిపోతుంది. అబ్బో అంటూ అంతా పొగిడేస్తుంటే.. ఈ మధ్యే మా ఇద్దరి మధ్య ఒకటి నడుస్తుందిలెండీ అంటూ హైపర్ ఆది హింటిచ్చాడు. యాంకర్ రవి వెళ్లిపోయిన తర్వాత వర్షిణికి జోడీ అయిపోయాడు హైపర్ ఆది. ఈయన తీరు చూస్తుంటే కొన్ని రోజుల్లోనే కాంట్రవర్సీ రాజా కాస్తా పులిహోర రాజా అయిపోయేలా కనిపిస్తున్నాడు. తాజాగా ఇచ్చిన ఇంటర్వ్యూలో మాత్రం అంతా తూచ్.. మేం చేసేది రేటింగ్స్ కోసమే అంటున్నాడు ఈయన. మరి ఇది ఎక్కడి వరకు వెళ్తుందో చూడాలిక.
Published by:Praveen Kumar Vadla
First published: