Home /News /movies /

JABARDASTH COMEDIAN HYPER AADI INSULTED DORABABU IN FRONT OF HIS WIFE AMMULU PK

Hyper Aadi: భార్య ముందే దొరబాబు పరువు తీసిన హైపర్ ఆది..

జబర్దస్త్ దొరబాబు భార్య (dorababu wife)

జబర్దస్త్ దొరబాబు భార్య (dorababu wife)

Hyper Aadi: జబర్దస్త్ కామెడీ షోలో ఎన్ని టీమ్స్ ఉన్నా.. ఎంతమంది టీం లీడర్స్ ఉన్నా కూడా హైపర్ ఆదికి మాత్రం సపరేట్ ఫ్యాన్ ఫాలోయింగ్ ఉంది. ఈయన తన పంచ్ డైలాగులతో..

జబర్దస్త్ కామెడీ షోలో ఎన్ని టీమ్స్ ఉన్నా.. ఎంతమంది టీం లీడర్స్ ఉన్నా కూడా హైపర్ ఆదికి మాత్రం సపరేట్ ఫ్యాన్ ఫాలోయింగ్ ఉంది. ఈయన తన పంచ్ డైలాగులతో స్కిట్‌ను అలా పైకి లేపుతుంటాడు. ప్రతీసారి కూడా కొత్త మ్యాటర్ లేకపోయినా కూడా కొత్త పంచులతో పిచ్చెక్కిస్తుంటాడు. దానికితోడు జరిగిన విషయాలను వాడుకోవడంలో ఈయన కంటే తోపు ఎవరూ లేరు. మరీ ముఖ్యంగా కాన్ టెంపరరి విషయాలపై అదిరిపోయే పంచులు వేస్తుంటాడు హైపర్ ఆది. ఇప్పుడు కూడా ఇదే చేసాడు.

దొరబాబు, హైపర్ ఆది (Hyper Aadi Dorababu)
దొరబాబు, హైపర్ ఆది (Hyper Aadi Dorababu)


తన టీంలో ఉన్న దొరబాబుతో పాటు పరదేశి ఆ మధ్య ఓ బ్రోతల్ కేసులో దొరికిపోయారు. అందులో నిజానిజాలు ఇంకా బయటికి రాలేదు. వాళ్లు నిజంగానే వ్యభిచారం చేసారా లేదంటే అనుకోకుండా వెళ్లి అడ్డంగా బుక్ అయిపోయారా అనేది ఇప్పటికీ సస్పెన్సే. అయితే ఆ సంఘటనను మాత్రం తన కామెడీ కోసం వాడేసుకుంటున్నాడు హైపర్ ఆది. ప్రతీసారి తన స్కిట్‌లో కచ్చితంగా దొరబాబును టార్గెట్ చేసి పంచులు వేస్తూనే ఉంటాడు. ఆ ఘటనను గుర్తు చేసి మళ్లీ మళ్లీ కామెడీ పుట్టిస్తూనే ఉంటాడు ఆది.

జబర్దస్త్ నటుడు దొరబాబు (Jabardasth Comedian Dorababu)
జబర్దస్త్ నటుడు దొరబాబు (Jabardasth Comedian Dorababu)


ఇప్పుడు కూడా ఇదే చేసాడు. అయితే ఈ సారి ఏకంగా దొరబాబు భార్య అమ్ములు ముందే ఆయన పరువు తీసాడు ఆది. ఎప్పట్లాగే దొరబాబు ఆ ఘటనపై పంచులు వేసాడు ఆది. దాంతో దొరబాబు నాకు ఇంకా పెళ్లి కాలేదు అంటూ చెప్తాడు.. వెంటనే సీన్‌లోకి దొరబాబు రియల్ లైఫ్ వైఫ్ అమ్ములు వచ్చేస్తుంది.. వచ్చి మరి నేనెవరూ అంటుంది.

అమ్మూ అంటూ దొరబాబు అనబోతుంటే.. నన్నేమో అమ్మూ అమ్మూ అంటావ్.. నువ్వు అక్కడ చేసే పనులు చూసి నేనేమో అమ్మో అమ్మో అనుకోవాల్సి వస్తుందంటూ పంచ్ వేసింది. చెప్పింది దొరబాబు భార్యే అయినా చెప్పించింది మాత్రం హైపర్ ఆదినే కదా అంటున్నారు నెటిజన్లు. అయితే కామెడీ కోసం మరీ ఇంతగా దిగజారాల్సిన అవసరం లేదనే వాదన కూడా వినిపిస్తుంది.

దొరబాబు భార్య నందు (dorababu wife nandu)
దొరబాబు భార్య నందు (dorababu wife nandu)


ఈ కామెడీ విషయంలో ఆది కాస్త హద్దులు పెట్టుకుంటే మంచిదని.. అవతలి వాళ్ల భావాలను మరీ అంతగా హర్ట్ చేసి కామెడీ పుట్టించాల్సిన అవసరం లేదని ఆయనకు హితవు పలుకుతున్నారు. అయితే దొరబాబుకే లేని బాధ మీకెందుకు అంటూ హైపర్ ఆది కూడా వాళ్లకు రివర్స్ కౌంటర్స్ బాగానే వేస్తున్నాడు. ఏదేమైనా కూడా అప్పుడు దొరబాబు దొరికితే.. దాన్ని కొన్ని వారాలుగా హైపర్ ఆది మాత్రం బాగానే యూజ్ చేసుకుంటున్నాడు.
Published by:Praveen Kumar Vadla
First published:

Tags: Hyper Aadi, Jabardasth comedy show, Telugu Cinema, Tollywood

ఉత్తమ కథలు

తదుపరి వార్తలు