ఒకప్పటిలా లేవు రోజులు.. ట్రెండ్ మారుతోంది. టెక్నాలజీ పుంజుకోవడంతో నటీనటులకు అవకాశాలు వెల్లువెత్తుతున్నాయి. ఆదాయ వనరు అనేది సినిమా మాత్రమే కాకుండా పలు రకాలుగా పొందే వెసులుబాటు వచ్చేసింది. టాలెంట్ ఉండాలే కానీ ఆదాయానికి మార్గాలు బోలెడు అన్నట్లుగా మారాయి పరిస్థితులు. దీనికి బెస్ట్ ఉదాహరణ జబర్దస్త్ (Jabardasth). కామెడీ షోగా ప్రారంభమై ఎంతోమంది కెరీర్ నిలబెట్టింది ఈ ప్రోగ్రాం. కమెడియన్స్‌గా తమ టాలెంట్ నిరూపించేందుకు బెస్ట్ వేదికగా మారింది. ఎందరో కమెడియన్స్ ఈ జబర్దస్త్ ఎపిసోడ్స్ ద్వారా భారీగా సంపాదిస్తున్నారు. అందులో ముఖ్యంగా చెప్పుకోవాల్సిన పేరు హైపర్ ఆది (Hyper Aadi). మాట మాటకు పంచ్ వేస్తూ తనదైన హావభావాలతో నవ్వు తెప్పించే ఆది.. ఒక్క జబర్దస్త్ ద్వారానే వారానికి 3 లక్షలు వెనకేస్తున్నాడట.
ఒకప్పటితో పోల్చితే టెలివిజన్ రంగం ఊపందుకుంది. బుల్లితెరపై కూడా టాలెంటెడ్ యాక్టర్స్ యమ క్రేజ్ కూడగట్టుకుంటున్నారు. సినీ మార్కెట్‌కు ఏమాత్రం తీసిపోకుండా సంపాదిస్తున్నారు. ఈ క్రమంలోనే ఇక గత కొన్నేళ్లుగా చిన్నితెరపై కడుపుబ్బా నవ్విస్తూ ఆడియన్స్ గుండెల్లో గూడు కట్టుకున్న హైపర్ ఆది పారితోషికం మరింత పెరిగిందట. దీంతో టెలివిజన్ రంగం లోనే బెస్ట్ రెమ్మ్యూనరేషన్ అందుకుంటున్న టాప్ లిస్ట్‌లో ఒకరిగా నిలిచాడు హైపర్ ఆది.
నాన్ స్టాప్ పంచులేస్తూ కామెడీ ఎక్స్‌ప్రెస్‌గా ప్రేక్షకులను కడుపుబ్బా నవ్విస్తుంటాడు హైపర్ ఆది. ఓ వైపు జబర్దస్త్‌లో చేస్తూనే శ్రీదేవి డ్రామా కంపెనీ,ఢీ లాంటి షోల్లో భాగమవుతూ పలు స్పెషల్ ఈవెంట్లలో కూడా పర్ఫామ్ చేస్తున్నాడు. సాఫ్ట్ వేర్ ఉద్యోగాన్ని వదిలేసి టెలివిజన్ రంగంలో తన మార్క్ చూపించిన ఆది.. కేవలం చురకత్తుల్లాంటి పంచులతోనే భారీ పాపులారిటీ కూడగట్టుకున్నాడు. ఆయన స్కిట్ వేస్తున్నాడంటే అది ఓ నవ్వుల రైడ్ అవుతుంది అంతే అనేలా పేరు తెచ్చుకున్నాడు. అయితే నేమ్, ఫేమ్‌తో పాటు పైకం కూడా బాగానే వసూలు చేస్తున్నాడు ఈ జబర్దస్త్ కమెడియన్.
గతేడాది వరకు ఒక్కో ఎపిసోడ్‌కి రెండు లక్షల వరకు రెమ్మ్యూనరేషన్ తీసుకున్న హైపర్ ఆది.. ఇప్పుడు మరో లక్ష ఎక్కువ డిమాండ్ చేస్తున్నాడట. అంటే కేవలం జబర్డస్త్ ద్వారానే వారానికి మూడు లక్షలు సంపాదిస్తున్నాడన్నమాట. కాగా హైపర్ ఆది జబర్దస్త్ వీడినట్లు వార్తలు వస్తున్నా అందులో క్లారిటీ అయితే లేదు. జబర్దస్త్ షోలో మరో నాలుగేళ్ళ పాటు కొనసాగేలా ఆయన అగ్రిమెంట్ చేసుకున్నాడని టాక్. ఇకపోతే చుకత్తుల్లాంటి స్క్రిప్ట్స్ రాయడంలో దిట్ట అయిన ఈ కమెడియన్.. ఇతర జబర్దస్త్ కమెడియన్లకు స్క్రిప్టులు రాస్తూ అడిషనల్ ఇన్కమ్ పొందుతున్నాడట. దీనితోడు ఇతర ప్రోగ్రామ్స్, స్పెషల్ ఈవెంట్స్ కోసం కూడా బాగానే ఛార్జ్ చేస్తున్నాడట. సో.. ఈ లెక్కన చూస్తే ఓ మిడిల్ రేంజ్ హీరో లెవెల్లో హైపర్ ఆది సంపాదన ఉందనే చెప్పుకోవాలి.
తెలుగు వార్తలు, తెలుగులో బ్రేకింగ్ న్యూస్ న్యూస్ 18లో చదవండి. రాష్ట్రీయ, జాతీయ, అంతర్జాతీయ, టాలీవుడ్, క్రీడలు, బిజినెస్, ఆరోగ్యం, లైఫ్ స్టైల్, ఆధ్యాత్మిక, రాశిఫలాలు చదవండి.
Tags: Extra jabardasth, Hyper Aadi, Jabardasth