హైపర్ ఆది హాట్ యాంకర్‌‌తో ప్రేమలో ఉన్నాడా.. ఆ వీడియోలే ప్రూఫ్..

Hyper Aadi Varshini: హైపర్ ఆది.. పరిచయం అవసరం లేని పేరు. ఈయన గురించి తెలుసుకోవాలంటే పంచ్ డైలాగులు అని కొడితే చాలు. తన పంచులతో ఎప్పటికప్పుడు కడుపులు చెక్కలు చేయడం ఆదికి అలవాటే.

Praveen Kumar Vadla | news18-telugu
Updated: February 15, 2020, 7:07 PM IST
హైపర్ ఆది హాట్ యాంకర్‌‌తో ప్రేమలో ఉన్నాడా.. ఆ వీడియోలే ప్రూఫ్..
హైపర్ ఆది వర్షిణి మధ్య రొమాన్స్ (hyper aadi varshini)
  • Share this:
హైపర్ ఆది.. పరిచయం అవసరం లేని పేరు. ఈయన గురించి తెలుసుకోవాలంటే పంచ్ డైలాగులు అని కొడితే చాలు. తన పంచులతో ఎప్పటికప్పుడు కడుపులు చెక్కలు చేయడం ఆదికి అలవాటే. అయితే ఇప్పటి వరకు కేవలం కాంట్రవర్సీల్లో మాత్రమే కామెడీ చేస్తూ వచ్చాడు హైపర్ ఆది. ఈయనపై ఎఫైర్స్ వార్తలు మాత్రం ఇప్పటి వరకు రాలేదు. కెరీర్లో పెద్దగా ఎప్పుడూ అమ్మాయిలతో ఉన్నట్లు కూడా కనిపించలేదు ఆది. జబర్దస్త్ కామెడీ షోలో అప్పుడప్పుడూ అనసూయతో డ్యూయెట్స్ చేస్తూ కామెడీ చేయడం మినహా ఎవరితోనూ ఎఫైర్స్ నడుపుతున్నాడనే వార్తలు మాత్రం రాలేదు.
హైపర్ ఆది వర్షిణి మధ్య రొమాన్స్ (hyper aadi varshini)
హైపర్ ఆది వర్షిణి మధ్య రొమాన్స్ (hyper aadi varshini)

ఇప్పుడు పరిస్థితులు అలా లేవు.. ఆదిపై ఎఫైర్ వార్తలు ఇప్పుడు వచ్చాయి.. ఈయన ఈ మధ్యే కమెడియన్ నుంచి హోస్టుగా కూడా మారాడు. పైగా వరసగా యాంకర్ వర్షిణితో కలిసి కొన్ని ప్రోగ్రామ్స్ హోస్టింగ్ కూడా చేస్తున్నాడు. ఢీ ఛాంపియన్స్‌లో ఈ ఇద్దరి మధ్య కెమిస్ట్రీ కూడా బాగానే పండుతుంది. అమాయకంగా ఉండే వర్షిణిపై తనదైన పంచులు వేస్తూ నవ్విస్తున్నాడు ఆది.

హైపర్ ఆది వర్షిణి మధ్య రొమాన్స్ (hyper aadi varshini)
హైపర్ ఆది వర్షిణి మధ్య రొమాన్స్ (hyper aadi varshini)


ఈ ఇద్దరే న్యూ ఇయర్ ఈవెంట్ కూడా హోస్ట్ చేసారు. ఇదిలా ఉంటే ఇప్పుడు ఆది, వర్షిణి మధ్య సమ్‌థింగ్ ఈజ్ గోయింగ్ ఆన్ అంటూ వార్తలు పుట్టుకొచ్చాయి. దానికి కారణం కూడా హైపర్ ఆదే. ఆయనే తమ ఇద్దరి మధ్య ఒకటి నడుస్తుందని ఒప్పుకున్నాడు. తాజాగా విడుదలైన ఢీ ఛాంపియన్స్ ప్రోమోలో రొమాంటిక్ పాటకు డాన్సులు చేసారు వర్షిణి, ఆది జోడీ. ఈ ఇద్దరి కెమిస్ట్రీ అదిరిపోయింది కూడా.



హైపర్ ఆది వర్షిణి మధ్య రొమాన్స్ (hyper aadi varshini)
హైపర్ ఆది వర్షిణి మధ్య రొమాన్స్ (hyper aadi varshini)


అబ్బో అంటూ అంతా పొగిడేస్తుంటే.. ఈ మధ్యే మా ఇద్దరి మధ్య ఒకటి నడుస్తుందిలెండీ అంటూ ఆది హింటిచ్చాడు. యాంకర్ రవి వెళ్లిపోయిన తర్వాత వర్షిణికి జోడీ అయిపోయాడు హైపర్ ఆది. మరి ఈయన తీరు చూస్తుంటే కొన్ని రోజుల్లోనే కాంట్రవర్సీ రాజా కాస్తా పులిహోర రాజా అయిపోయేలా కనిపిస్తున్నాడు.
First published: February 15, 2020
మరిన్ని చదవండి
తదుపరి వార్తలు