Jabardasth Hyper Aadi: హైపర్ ఆది సొంతూళ్లో ఇల్లు ఎలా ఉంది.. ఆస్తులు ఎన్నో తెలుసా..?

జబర్దస్త్ హైపర్ ఆది ఇల్లు (Jabardasth Hyper Aadi)

Jabardasth Hyper Aadi: హైపర్ ఆది.. ఇప్పుడు బుల్లితెరపై ఇది పేరు కాదు.. పంచులకు కేరాఫ్ అడ్రస్.. ఇంకా చెప్పాలంటే సెటైర్లకు బ్రాండ్ అంబాసిడర్. చాలా తక్కువ సమయంలోనే స్టార్ అయిపోయాడు హైపర్ ఆది. తన కామెడీతో అందర్నీ నవ్విస్తున్నాడు.

  • Share this:
హైపర్ ఆది.. ఇప్పుడు బుల్లితెరపై ఇది పేరు కాదు.. పంచులకు కేరాఫ్ అడ్రస్.. ఇంకా చెప్పాలంటే సెటైర్లకు బ్రాండ్ అంబాసిడర్. చాలా తక్కువ సమయంలోనే స్టార్ అయిపోయాడు హైపర్ ఆది. తన కామెడీతో అందర్నీ నవ్విస్తున్నాడు. అప్పుడప్పుడూ కాంట్రవర్సీల జోలికి వెళ్లినా కూడా ఎప్పుడూ ట్రెండింగ్‌లోనే ఉండటానికి చూస్తాడు హైపర్ ఆది. ఈయన ఇండస్ట్రీకి రాకముందు సాఫ్ట్ వేర్ ఇంజనీర్‌గా పని చేసాడు కూడా. అయినా కూడా రైటింగ్ సైడ్ వెళ్లి అక్కడ కొన్ని సంస్థలకు పని చేసాడు. ఆ తర్వాత అభి పరిచయంతో జబర్దస్త్‌లోకి ఎంట్రీ ఇచ్చాడు ఆది. ఆ తర్వాత కొన్ని ఎపిసోడ్స్ తర్వాత ఆది కాస్తా హైపర్ ఆది అయ్యాడు. తనదైన మార్క్ పంచులతో పిచ్చెక్కిస్తున్నాడు ఈయన. గత నాలుగేళ్లుగా స్పెషల్ బ్రాండ్ సంపాదించుకున్నాడు. ఈ మధ్యే ఓ షోకు వచ్చిన ఆది.. తన గురించి చాలా విషయాలు చెప్పుకొచ్చాడు. జబర్దస్త్‌కు రాకముందు తమ కుటుంబ పరిస్థితి దారుణంగా ఉండేదని.. మిడిల్ క్లాస్ కుటుంబం నుంచే వచ్చానని చెప్పుకొచ్చాడు ఆది. అప్పట్లో తను, తన ఇద్దరు అన్నయ్యల చదువు కోసం తండ్రి ఆస్తులు అన్నీ అమ్మేసాడని.. చేతిలో చిల్లిగవ్వ లేకుండా ఉన్నామని గుర్తు చేసుకున్నాడు. ఆది సొంతూరు ప్రకాశం జిల్లాలోని పల్లమల్లి. అక్కడ ఊళ్ళో 3 ఎకరాల పొలం ఉండేదని.. దాన్ని కూడా తమ కోసమే నాన్న అమ్మేసాడని చెప్పాడు.

jabardasth hyper aadi,jabardasth hyper aadi skits,jabardasth hyper aadi assets,jabardasth hyper aadi assets land,jabardasth hyper aadi crores assets,jabardasth hyper aadi comedy,jabardasth hyper aadi movies,jabardasth hyper aadi controversy,హైపర్ ఆది,జబర్దస్త్ హైపర్ ఆది కాంట్రవర్సీ,జబర్దస్త్ హైపర్ ఆది ఆస్తులు
హైపర్ ఆది ఫేస్ బుక్ ఫోటో (Source: Facebook)


దానికితోడు బిటెక్ చదివిన తాను ఇలా జబర్దస్త్‌లోకి వెళ్లడం చాలా మందికి నచ్చలేదని.. తిట్టేవారని చెప్పుకొచ్చాడు. కానీ అవకాశం కోసం వేచి చూస్తూనే ఉన్నానని.. ఒక్కసారి తనకు ఛాన్స్ వచ్చిన తర్వాత వదల్లేదని.. చాలా కష్టపడ్డానని చెప్పాడు. పగలు రాత్రి తేడా లేకుండా స్క్రిప్ట్ రాసుకునేవాడిని అంటూ చెప్పుకొచ్చాడు. ఈ ఇండస్ట్రీ దయతోనే ఎక్కడైతే తన ఆస్తులు పోయాయో అక్కడే తిరిగి సంపాదించుకున్నానని చెప్పాడు ఆది.

ఊళ్ళో నాన్న అమ్మేసిన 3 ఎకరాల స్థలం స్థానంలో ఇప్పుడు 10 ఎకరాలు కొన్నానని చెప్పాడు. అంతేకాదు ఈయనకు తన సొంతూరు పల్లమల్లిలో పెద్ద ఇల్లు కూడా ఉంది. తాజాగా సంక్రాంతికి ఊరొచ్చిన హైపర్ ఆదిని అక్కడి స్థానికులతో పాటు చుట్టుపక్కల ఊళ్ల నుంచి అభిమానులు ఆయన కోసం వచ్చారు. మరోవైపు హైపర్ ఆదికి ఊళ్లో ఉన్న ఇంటితో పాటు ఆయన పొలాలను కూడా కొన్ని యూ ట్యూబ్ ఛానెల్స్ హైలైట్ చేసి చూపించాయి.
Published by:Praveen Kumar Vadla
First published: