హైపర్ ఆదిని వెంటాడుతున్న కరోనా....ప్రమాదంలో పడేసిన ఆ యాంకర్ రిలేషన్...

జబర్దస్త్ కమెడియన్ హైపర్ ఆది (Hyper Aadi)

హైపర్ ఆది భాషలో చెప్పాలంటే ఎండాకాలంలో కాకిపిల్ల నీళ్ల కోసం వెతుకుంటే, ఐస్ ఫ్రూట్ దొరికినట్లు వర్షిణి దొరికందనే చెప్పాలి. నిజానికి వర్షిణి కూడా పెద్ద యాంకరేమీ కాదు. కానీ హైపర్ ఆదితో ఎక్కడో కనెక్షన్ కుదిరింది.

 • Share this:
  జబర్దస్త్ కమెడియన్ హైపర్ ఆది కెరీర్ ప్రస్తుతం హైపర్ రేంజిలో సాగుతోంది. అటు జబర్దస్త్ తో పాటు, ఈవెంట్స్, ఢీ షో, సినిమాలు ఇలా హాయిగా సాగిపోతోంది. ఇన్ని రోజులు జబర్దస్త్ లో సీనియర్ యాంకర్ అనసూయ వెంట రొమాన్స్ పండించే ప్రయత్నం చేసినా, అది పెద్దగా ప్రేక్షకులను ఆకట్టుకోలేదనే చెప్పాలి. వారిద్దరి మధ్య ఉన్న రిలేషన్ కేవలం కామెడీ పండించేందుకే కానీ అంతకు మించి ఏమీ ఉండదని అందరికీ తెలిసిందే. ఇందుకు కారణం అనసూయ ఏజ్‌ కన్నా హైపర్ ఆది చాలా చిన్నవాడు కావడంతో పాటు, ఇద్దరి మధ్య పెద్దగా కెమిస్ట్రీ కూడా వర్కౌట్ కాలేదు. అయితే ఢీ షోలో మాత్రం యాంకర్ వర్షిణితో హైపర్ ఆది కెమిస్ట్రీ అదిరిందనే చెప్పాలి. హైపర్ ఆది భాషలో చెప్పాలంటే ఎండాకాలంలో కాకిపిల్ల నీళ్ల కోసం వెతుకుంటే, ఐస్ ఫ్రూట్ దొరికినట్లు వర్షిణి దొరికందనే చెప్పాలి. నిజానికి వర్షిణి కూడా పెద్ద యాంకరేమీ కాదు. కానీ హైపర్ ఆదితో ఎక్కడో కనెక్షన్ కుదిరింది. ఇంకేముంది ఇద్దరూ కలికి బుల్లితెరపై రొమాన్స్ పండించారు. ఇద్దరి మధ్య సంథింగ్ సంథింగ్ ఉంది అనేంతలా ఒదిగిపోయారు. ఇంతలో ఢీ జోడీ సీజన్ ముగిసిపోయింది. అంతేకాదు అటు కొత్త సీజన్ షూటింగ్ కూడా కరోనా దెబ్బతో ఆగిపోయింది.

  అసలు కొత్త సీజన్ స్టార్ట్ చేయాలా వద్ద అనే డైలామాలో నిర్వాహకులు పడిపోయారు. అటు షూటింగులు కూడా ఆగిపోయాయి. అయితే ఈ టైంలో వర్షిణి బాంబు లాంటి వార్త పేల్చింది. ఏంటంటే ఢీలో కొనసాగాలా వద్దా అనే దానిపై ఇంకా నిర్ణయం తీసుకోలేదని తేల్చేసింది. తనకు వెబ్ సిరీస్ లలో వరుస ఆఫర్లు వస్తున్నాయని, వాటిపై దృష్టి సారించినట్లు వర్షిణి తేల్చేసింది.

  అసలే కదురక కుదరక ఒక జోడీ మన హైపర్ ఆదికి దొరికింది. ఇఫ్పుడు ఇది కూడా కంచి వెళ్లిపోతే తన గతి ఏంటని హైపర్ ఆది వాపోతున్నట్లు సన్నిహిత వర్గాలు చెబుతున్నాయి. అంతేకాదు లవర్ బాయ్ గా తన కెరీర్ లో మంచి పేరు సంపాదించుకునే అవకాశాన్ని వర్షిణి ప్రమాదంలో పడేసిందని బాధపడుతున్నట్లు తెలుస్తోంది.
  Published by:Krishna Adithya
  First published: