Home /News /movies /

Hyper Aadi Brahmanandam: హైపర్ ఆది దెబ్బకు బ్రహ్మానందం పరేషాన్.. అసలేం జరిగిందంటే..

Hyper Aadi Brahmanandam: హైపర్ ఆది దెబ్బకు బ్రహ్మానందం పరేషాన్.. అసలేం జరిగిందంటే..

హైపర్ ఆది బ్రహ్మానందం (hyper aadi brahmanandam)

హైపర్ ఆది బ్రహ్మానందం (hyper aadi brahmanandam)

Hyper Aadi Brahmanandam: జబర్దస్త్ కామెడీ షో నుంచి వచ్చిన మోస్ట్ హైపర్ కమెడియన్స్‌లో ఆది అందరికంటే ముందుంటాడు. మిగిలిన వాళ్లతో పోలిస్తే మనోడిలో ఉండే ఫైర్ కాస్త ఎక్కువే. పైగా చిన్న వయసు కదా.. ఆ వేడి కూడా కనిపిస్తూ ఉంటుంది..

జబర్దస్త్ కామెడీ షో నుంచి వచ్చిన మోస్ట్ హైపర్ కమెడియన్స్‌లో ఆది అందరికంటే ముందుంటాడు. మిగిలిన వాళ్లతో పోలిస్తే మనోడిలో ఉండే ఫైర్ కాస్త ఎక్కువే. పైగా చిన్న వయసు కదా.. ఆ వేడి కూడా కనిపిస్తూ ఉంటుంది అతడి పంచుల్లో. ముఖ్యంగా ఆటిట్యూడ్ కూడా ఎక్కువగానే ఉంటుంది హైపర్ ఆదికి. అప్పుడప్పుడూ ఈయన మాటల్లోనే అది అర్థమైపోతుంది. అప్పట్లో కత్తి మహేష్‌తో గొడవ పడినపుడు హైపర్ ఆది టెంపర్ ఏంటో అందరికీ అర్థమైంది. ఆ తర్వాత కూడా అవసరం అయిన ప్రతీసారి ఆది కామెంట్స్ కాంట్రవర్సీ అవుతూనే ఉంటాయి. మరీ ముఖ్యంగా జబర్దస్త్ వేదికపై స్కిట్స్‌లో రాసే డైలాగులు బయట చాలా మంది మనోభావాలను కూడా దెబ్బ తీస్తుంటాయి. అయినా కూడా అన్నీ కామెడీనే అంటుంటాడు హైపర్ ఆది. అలాంటి టెంపర్ ఉన్న కమెడియన్ ఓ సారి టాలీవుడ్ హాస్య బ్రహ్మ బ్రహ్మానందంతో కూడా ఆడుకున్నాడని తెలుసా..? ఈ విషయం గురించి తెలిసి చాలా మంది షాక్ అవుతుంటారు. కానీ ఫోన్‌లో బ్రహ్మికి చుక్కలు చూపించి వదిలేసాడు హైపర్ ఆది.
brahmanandam,hyper aadi comedy,jabardasth hyper aadi,brahmanandam comedy,hyper aadi on brahmanandam,hyper aadi about brahmanandam,hyper aadi jabardasth,hyper aadi skits,hyper aadi contrvoersies,brahmanandam hyper aadi,hyper aadi jabardasth spoof brahmanandam hyper aadi spoof,హైపర్ ఆది,బ్రహ్మానందం హైపర్ ఆది,హైపర్ ఆది బ్రహ్మానందం ఫోన్ టాక్
హైపర్ ఆది బ్రహ్మానందం (hyper aadi brahmanandam)

ఈ విషయాన్ని స్వయంగా ఆయనే చెప్పుకొచ్చాడు. అది విన్న తర్వాత అంతా షాక్ అయ్యారు కూడా. అది ఎప్పుడు జరిగింది.. ఎలా జరిగిందో కూడా వివరించాడు హైపర్ ఆది. అసలు ఏం జరిగిందంటే ఓ సారి ఆదికి ఫోన్ వచ్చింది. అవతలి వైపు నుంచి హలో.. నేను బ్రహ్మానందం అంటూ వాయిస్ వచ్చింది. అది విన్న హైపర్ ఆది అయితే ఏంటి ఇక్కడ హైపర్ ఆది అంటూ సమాధానమిచ్చాడు. అది కాదయ్యా నేను బ్రహ్మానందాన్ని మాట్లాడుతున్నా.. అంటే అదేనయ్యా నేను హైపర్ ఆదిని మాట్లాడుతున్నా అయితే ఏంటి చెప్పు అంటూ సమాధానమిచ్చాడు. ఇలా కాసేపు వాళ్లిద్దరి మధ్య రచ్చ జరుగుతూనే ఉంది.
brahmanandam,hyper aadi comedy,jabardasth hyper aadi,brahmanandam comedy,hyper aadi on brahmanandam,hyper aadi about brahmanandam,hyper aadi jabardasth,hyper aadi skits,hyper aadi contrvoersies,brahmanandam hyper aadi,hyper aadi jabardasth spoof brahmanandam hyper aadi spoof,హైపర్ ఆది,బ్రహ్మానందం హైపర్ ఆది,హైపర్ ఆది బ్రహ్మానందం ఫోన్ టాక్
హైపర్ ఆది (File/Hyper Aadi)

అయితే చివరికి విసిగిపోయిన బ్రహ్మానందం.. అయ్యా ఆది నిజంగానే నేనయ్యా అంటూ అరిచాడు. దాంతో అప్పుడు అయ్యో చెప్పండి సర్.. అంటూ బదులిచ్చాడు. అప్పుడప్పుడూ తన ఫ్రెండ్స్ తనకు ఫోన్ చేసి మిమిక్రీ చేస్తుంటారని.. అలాగే ఇప్పుడు కూడా చేసారేమో అనుకుని అలా అన్నానని.. తనను క్షమించమని కోరినట్లు చెప్పాడు హైపర్ ఆది. ఇదంతా ఈ మధ్యే ఓ షోకు వచ్చిన ఆది చెప్పుకొచ్చాడు. ఈ సంఘటన ఎప్పుడు గుర్తొచ్చినా కూడా నవ్వుకుంటానని చెప్పాడు. ఆ తర్వాత బ్రహ్మానందాన్ని కలిసినపుడు జరిగిందంతా చెప్పినట్లు తెలిపాడు ఆది.
Published by:Praveen Kumar Vadla
First published:

Tags: Brahmanandam, Hyper Aadi, Telugu Cinema, Tollywood

ఉత్తమ కథలు

తదుపరి వార్తలు