Home /News /movies /

JABARDASTH COMEDIAN HYPER AADI FAILURE STORY ON SILVER SCREEN AND HERE THE REASONS PK

Hyper Aadi: జబర్దస్త్ కమెడియన్ హైపర్ ఆది సినిమాల్లో సక్సెస్ కాకపోవడానికి కారణమేంటి..?

హైపర్ ఆది స్కిట్‌లో దొరబాబు భార్య అమ్ము (hyper aadi dorababu)

హైపర్ ఆది స్కిట్‌లో దొరబాబు భార్య అమ్ము (hyper aadi dorababu)

Hyper Aadi: హైప‌ర్ ఆది పేరు వింటే కేవ‌లం టెలివిజ‌న్ కామెడీ మాత్ర‌మే గుర్తుకు వ‌చ్చేది ఇంత‌కుముందు. కానీ ఇప్పుడు ఈయ‌న సినిమాల్లో కూడా క‌నిపిస్తున్నాడు.

హైప‌ర్ ఆది పేరు వింటే కేవ‌లం టెలివిజ‌న్ కామెడీ మాత్ర‌మే గుర్తుకు వ‌చ్చేది ఇంత‌కుముందు. కానీ ఇప్పుడు ఈయ‌న సినిమాల్లో కూడా క‌నిపిస్తున్నాడు. వెండితెర‌పై కూడా వెలిగిపోవాల‌ని ప్ర‌య‌త్నిస్తున్నాడు. అయితే అది అంత‌గా విజ‌యం సాధిస్తున్న‌ట్లు మాత్రం అనిపించ‌డం లేదు. ఈయ‌న సినిమాల్లో ఊహించినంత‌గా మెప్పించ‌లేక‌పోతున్నాడు. టీవీల్లో దుమ్ము దులిపేస్తున్న ఆది కామెడీ.. సినిమాల్లోకి వ‌చ్చేస‌రికి తేలిపోతుంది. ఈయ‌నొక్క‌డే కాదు.. జ‌బ‌ర్ద‌స్త్ క‌మెడియ‌న్ల‌కు సినిమాలు అంత‌గా క‌లిసి రావ‌డం లేదు. వీళ్ల కామెడీ బుల్లితెర వరకు ఎంజాయ్ చేస్తున్నా కూడా పెద్దతెరపై మాత్రం జబర్దస్త్ కమెడియన్లను చూడలేకపోతున్నారు ప్రేక్షకులు. హైపర్ ఆది కూడా దీనికి మినహాయింపేమీ కాదు.
జబర్దస్త్ కమెడియన్ హైపర్ ఆది (Hyper Aadi)
జబర్దస్త్ కమెడియన్ హైపర్ ఆది (Hyper Aadi)

ఇప్పటి వ‌ర‌కు టీవీల్లో సంచ‌ల‌నాలు సృష్టిస్తున్న చ‌మ్మ‌క్ చంద్ర‌, రాకెట్ రాఘ‌వ‌, సుడిగాలి సుధీర్ లాంటి వాళ్లు సినిమాల్లో క‌నీస గుర్తింపు కూడా తెచ్చుకోవ‌డంలో విఫ‌ల‌మ‌వుతున్నారు. ఇప్పుడు ఆది కూడా ఇదే దారిలో వెళ్తున్నాడు. ఈయ‌న కూడా ఆ మ‌ధ్య అల్ల‌రి న‌రేష్ మేడ మీద అబ్బాయి సినిమాలో న‌టించాడు.. అది ఫ్లాప్. దానికి క‌థా స‌హ‌కారం కూడా అందించాడు. ఇక ఆ త‌ర్వాత వ‌రుణ్ తేజ్ తొలిప్రేమ‌ హిట్ అయినా కూడా పెద్ద‌గా క‌లిసి రావ‌డం లేదు.
హైపర్ ఆది (Hyper Aadi)
జబర్దస్త్ కమెడియన్ హైపర్ ఆది (Hyper Aadi)

తొలిప్రేమ తర్వాత దర్శకుడు వెంకీ అట్లూరి మరోసారి హైపర్ ఆదికి ఆఫర్ ఇచ్చాడు. అఖిల్ హీరోగా వచ్చిన మిస్టర్ మజ్నులో పెద్ద పాత్రే చేసాడు. కానీ అది వర్కవుట్ కాలేదు. పైగా ఈ సినిమా ఫ్లాప్ కావ‌డంతో మ‌రోసారి ఆదికి నిరాశ త‌ప్ప‌లేదు. మిస్టర్ మజ్ను తన కెరీర్‌కు బాగా హెల్ప్ అవుతుందనుకున్నా కూడా కుదర్లేదు. ఆటగదరా శివా లాంటి సినిమాల్లో కీ రోల్స్ చేసినా కూడా ఆాదికి టైమ్ కలిసిరాలేదు.
జబర్దస్త్ కమెడియన్ హైపర్ ఆది (Hyper Aadi)
జబర్దస్త్ కమెడియన్ హైపర్ ఆది (Hyper Aadi)

గతేడాది వెంకటేష్, నాగ చైతన్య వెంకీ మామలో ఉన్నా హైపర్ ఆది మార్క్ కనిపించలేదు. మొత్తానికి ఇప్పుడు టీవీలో ఆది కామెడీని ప్రేక్ష‌కులు ఎంజాయ్ చేస్తున్నారు కానీ.. అదే సెటైర్లు సినిమాల్లో వేస్తే రివ‌ర్స్ అవుతున్నాయంటున్నారు విశ్లేష‌కులు. దాంతో అటూ ఇటూ రెండు పడవలపై కాళ్లు వేసి నడుస్తున్నాడు ఈ కుర్ర కమెడియన్. మ‌రి దీనిపై ఆది ఎలా స్పందిస్తాడో చూడాలి. చ‌క్క‌గా జ‌బ‌ర్ద‌స్త్ చేసుకుంటాడో లేదంటే సినిమాలంటూ అటూ ఇటూ కాకుండా పోతాడో చూడాలిక‌.
Published by:Praveen Kumar Vadla
First published:

Tags: Hyper Aadi, Jabardasth comedy show, Telugu Cinema, Tollywood

ఉత్తమ కథలు

తదుపరి వార్తలు