జబర్దస్త్ కమెడియన్ హైపర్ ఆదికి లీగల్ కష్టాలు చుట్టు ముట్టాయి. ఇప్పటికే జబర్దస్త్ షో నుంచి నాగబాబు పక్కకు తప్పుకొని జీ తెలుగు ఛానెల్లో వెళ్లాడో.. అప్పటి నుంచి జబర్ధస్త్ టీమ్‌లోని ఒక్కొ మెంబర్ నెమ్మదిగా ఈటీవీకి నుంచి బయటకు వచ్చేస్తున్నారు. ఇప్పటికే అనసూయ ఈటీవీకి సంబంధించిన జబర్ధస్త్ షోకు బై బై చెప్పేసింది. తాజాగా ఒక్కొక్కరుగా జబర్ధస్త్ టీమ్ నుంచి బయటకు వస్తున్న హైపర్ ఆది విషయంలో పెద్ద చిక్కొచ్చిపడింది. ఎందుకంటే జబర్ధస్త్ షోలో హైపర్ ఆది పంచ్‌ల కోసమే చూసేవాళ్లన్నారంటే అతిశయోక్తి కాదు. ఇక హైపర్ ఆది స్కిట్స్‌కు సోషల్ మీడియాలో విపరీతమైన ఫాలోయింగ్ ఉంది. ప్రస్తుతానికైతే హైపర్ ఆది జబర్ధస్త షోలోనే కంటిన్యూ అవుతున్నాడు. అతడికి బయటకు రావాలని ఉన్న ముందుగా మల్లెమాల వాళ్లతో చేసుకున్న అగ్రిమెంట్ కారణంగా బయటకు రాలేని పరిస్థితి నెలకొందని సమాచారం.
ఆది, నాగబాబు
ఒప్పందం ప్రకారం మల్లెమాల వాళ్లు హైపర్ ఆదిని కేవలం జబర్ధస్త్ షో మాత్రమే చేయాలని అల్టీమేట్ జారీ చేసారట. దీనిపై హైపర్ ఆది.. మల్లెమాల వాళ్లను సంప్రదిస్తే.. మా అనుమతి లేకుండా సినిమాలు చేయడానికి కూడా వీల్లేదని చెప్పారట. దీంతో ఏం చేయాలో తెలియక హైపర్ ఆది తికమక పడుతున్నాడట. నిజానికి హైపర్ ఆదికి జబర్ధస్త్ షోకు పనిచేయాలని లేదు.అతనికి సినిమాల్లో వరుసగా అవకాశాలు వస్తున్నాయి. వెంకటేష్, నాగ చైతన్య వంటి వాళ్లు కూడా వెంకీమామ సినిమా కోసం పర్సనల్‌గా మల్లెమాల వాళ్లను రిక్వెస్ట్ చేసారట. ప్రస్తుతానికి మల్లెమాలతో అగ్రిమెంట్ కారణంగా సైలెంట్‌గా ఉన్న హైపర్ ఆది.. భవిష్యత్తులో మాత్రం అతడికి టీవీకి దూరమవ్వడం మాత్రం ఖాయం అని చెబుతున్నారు.
Published by:Kiran Kumar Thanjavur
First published:
తెలుగు వార్తలు, తెలుగులో బ్రేకింగ్ న్యూస్ న్యూస్ 18లో చదవండి.
రాష్ట్రీయ, జాతీయ, అంతర్జాతీయ, టాలీవుడ్, క్రీడలు, బిజినెస్, ఆరోగ్యం, లైఫ్ స్టైల్, ఆధ్యాత్మిక, రాశిఫలాలు చదవండి.