JABARDASTH COMEDIAN HYPER AADI DOMINATING SUDIGALI SUDHEER IN AFFAIRS WITH ANCHORS PK
సుడిగాలి సుధీర్ పులిహోర రాజా బిరుదుపై హైపర్ ఆది కన్ను..
సుడిగాలి సుధీర్,హైపర్ ఆది (Sudigali Sudheer Hyper Aadi)
Hyper Aadi: హైపర్ ఆది, సుడిగాలి సుధీర్.. ఈ ఇద్దరి పేర్లకు ప్రత్యేకంగా పరిచయం అవసరం లేని పేరు. వీళ్ల గురించి తెలుసుకోవాలంటే పంచ్ డైలాగులు అని కొడితే చాలు. తమ పంచులతో ఎప్పటికప్పుడు కడుపులు..
హైపర్ ఆది, సుడిగాలి సుధీర్.. ఈ ఇద్దరి పేర్లకు ప్రత్యేకంగా పరిచయం అవసరం లేని పేరు. వీళ్ల గురించి తెలుసుకోవాలంటే పంచ్ డైలాగులు అని కొడితే చాలు. తమ పంచులతో ఎప్పటికప్పుడు కడుపులు చెక్కలు చేయడం ఈ ఇద్దరికి అలవాటే. ఇందులో హైపర్ ఆది కేవలం కాంట్రవర్సీల్లో మాత్రమే కామెడీ చేస్తూ వచ్చాడు. ఈయనపై ఎఫైర్స్ వార్తలు మాత్రం ఇప్పటి వరకు రాలేదు. కెరీర్లో పెద్దగా ఎప్పుడూ అమ్మాయిలతో ఉన్నట్లు కూడా కనిపించలేదు ఆది. జబర్దస్త్ కామెడీ షోలో అప్పుడప్పుడూ అనసూయతో డ్యూయెట్స్ చేస్తూ కామెడీ చేయడం మినహా ఎవరితోనూ ఎఫైర్స్ నడుపుతున్నాడనే వార్తలు మాత్రం రాలేదు. కానీ ఇప్పుడు ఈయన కూడా అటు వైపుగా అడుగులేస్తున్నాడు.
హైపర్ ఆది, వర్షిణి, రోజా (Image: Youtube)
హైపర్ ఆదిపై ఎఫైర్ వార్తలు ఇప్పుడు వచ్చాయి.. ఈయన ఈ మధ్యే కమెడియన్ నుంచి హోస్టుగా కూడా మారాడు. పైగా వరసగా యాంకర్ వర్షిణితో కలిసి కొన్ని ప్రోగ్రామ్స్ హోస్టింగ్ కూడా చేస్తున్నాడు. ఢీ ఛాంపియన్స్‌లో ఈ ఇద్దరి మధ్య కెమిస్ట్రీ కూడా బాగానే పండుతుంది. అమాయకంగా ఉండే వర్షిణిపై తనదైన పంచులు వేస్తూ నవ్విస్తున్నాడు ఆది. సాధారణంగా పులిహోర రాజా అంటే సుడిగాలి సుధీర్ గుర్తొస్తాడు. కానీ ఇప్పుడు మాత్రం హైపర్ ఆది బాగానే గుర్తొస్తున్నాడు. అలా మారిపోతున్నాడు ఈ కమెడియన్.
హైపర్ ఆది వర్షిణి మధ్య రొమాన్స్ (hyper aadi varshini)
వర్షిణితో ఇప్పుడు ఈయనకు మంచి జోడీ కుదిరింది. ఈ ఇద్దరే న్యూ ఇయర్ ఈవెంట్ కూడా హోస్ట్ చేసారు. ఇదిలా ఉంటే గత కొన్ని వారాలుగా ఆది, వర్షిణి మధ్య సమ్‌థింగ్ ఈజ్ గోయింగ్ ఆన్ అంటూ వార్తలు పుట్టుకొచ్చాయి. దానికి కారణం కూడా హైపర్ ఆదే. ఆయనే తమ ఇద్దరి మధ్య ఒకటి నడుస్తుందని ఒప్పుకున్నాడు. ఆ మధ్య ఢీ ఛాంపియన్స్‌లో రొమాంటిక్ పాటకు డాన్సులు చేసారు వర్షిణి, ఆది జోడీ. ఈ ఇద్దరి కెమిస్ట్రీ అదిరిపోయింది కూడా. ఆ తర్వాత కూడా వరసగా ప్రతీ ఎపిసోడ్‌లోనూ వర్షిణితో డాన్సులు చేస్తున్నాడు హైపర్ ఆది.
హైపర్ ఆది వర్షిణి మధ్య రొమాన్స్ (hyper aadi varshini)
ఆది, వర్షిణి జోడీ చూస్తుంటే రష్మి, సుధీర్ జోడీ గుర్తుకొస్తుంది అంటున్నారు అభిమానులు. అబ్బో అంటూ అంతా పొగిడేస్తుంటే.. ఈ మధ్యే మా ఇద్దరి మధ్య ఒకటి నడుస్తుందిలెండీ అంటూ ఆది హింటిచ్చాడు. యాంకర్ రవి వెళ్లిపోయిన తర్వాత వర్షిణికి జోడీ అయిపోయాడు హైపర్ ఆది. మరి ఈయన తీరు చూస్తుంటే కొన్ని రోజుల్లోనే కాంట్రవర్సీ రాజా కాస్తా పులిహోర రాజా అయిపోయేలా కనిపిస్తున్నాడు.
Published by:Praveen Kumar Vadla
First published:
తెలుగు వార్తలు, తెలుగులో బ్రేకింగ్ న్యూస్ న్యూస్ 18లో చదవండి.
రాష్ట్రీయ, జాతీయ, అంతర్జాతీయ, టాలీవుడ్, క్రీడలు, బిజినెస్, ఆరోగ్యం, లైఫ్ స్టైల్, ఆధ్యాత్మిక, రాశిఫలాలు చదవండి.