Jabardasth Hyper Aadi: కొత్తమ్మాయిని తీసుకొచ్చిన హైపర్ ఆది.. జబర్దస్త్‌‌లో కొత్త కలర్..

హైపర్ ఆది (Hyper Aadi)

Jabardasth Hyper Aadi: జబర్దస్త్ కామెడీ షో అంటే ముందుగా అంతా అబ్బాయిలే ఉండేవాళ్లు. వాళ్లు చేసే స్కిట్స్‌లో కొట్టుకోవడాలు.. తిట్టుకోవడాలు ఉంటాయని అమ్మాయిలను ఎక్కువగా ఎంకరేజ్ చేసేవాళ్లు కాదు నిర్వాహకులు. కానీ మెల్లగా పద్దతులు మారిపోతున్నాయి.

  • Share this:
జబర్దస్త్ కామెడీ షో అంటే ముందుగా అంతా అబ్బాయిలే ఉండేవాళ్లు. వాళ్లు చేసే స్కిట్స్‌లో కొట్టుకోవడాలు.. తిట్టుకోవడాలు ఉంటాయని అమ్మాయిలను ఎక్కువగా ఎంకరేజ్ చేసేవాళ్లు కాదు నిర్వాహకులు. కానీ మెల్లగా పద్దతులు మారిపోతున్నాయి. ఇప్పుడు అందరి స్కిట్స్‌లోనూ అమ్మాయిలు కనిపిస్తున్నారు. వాళ్లు ఏరికోరి తెచ్చుకుంటున్నారు.. రాకేష్ లాంటి వాళ్లైతే ఏకంగా అమ్మాయిలపైనే స్కిట్స్ చేస్తున్నారు. చమ్మక్ చంద్ర జబర్దస్త్ కామెడీ షోలో ఉన్నన్ని రోజులు కూడా లేడీ కమెడియన్ సత్య శ్రీతో అదిరిపోయే కామెడీ చేసాడు. మధ్యమధ్యలో హైపర్ ఆది కూడా అప్పుడప్పుడూ అమ్మాయిలతో వచ్చి సర్ ప్రైజ్ చేసాడు. ఈయన పరిచయం చేసిన వర్ష.. ఇప్పుడు మరో కమెడియన్ ఇమ్మాన్యుయేల్‌కు బాగా కనెక్ట్ అయిపోయింది. ఈ ఇద్దరూ చేసే స్కిట్స్ ఓ రేంజ్‌లో పేలుతున్నాయి. వాళ్లు మరో సుధీర్, రష్మి జోడీలా మారిపోయారు. మరోవైపు హైపర్ ఆది మాత్రం ఎప్పటికప్పుడు తన స్కిట్స్‌లో కొత్తమ్మాయిలను తీసుకొస్తూనే ఉంటాడు. తన స్కిట్స్‌లో అప్పుడప్పుడూ అనసూయ భరద్వాజ్, రష్మి గౌతమ్ లాంటి వాళ్లు కూడా వస్తుంటారు.

యాంకర్స్‌ మాత్రమే కాదు సెలబ్రిటీస్‌ను కూడా తీసుకురావడం.. వాళ్లపై పంచులు వేయడం హైపర్ ఆదికి అలవాటు. ఇప్పుడు కూడా ఇదే చేసాడు ఈయన. తాజాగా మరో యూ ట్యూబ్ బ్యూటీని తీసుకొచ్చాడు. సోషల్ మీడియాలో వెబ్ సిరీస్ చేసుకునే అమ్మాయిని తీసుకొచ్చాడు హైపర్ ఆది. గతంలోనూ ఈ అమ్మాయిని తీసుకొచ్చాడు ఆది.

మళ్లీ నన్నే ఎందుకు తీసుకొచ్చావ్ అంటూ ఆ అమ్మాయి అడిగితే.. నువ్వే కదా ఛాన్సులు లేవు మళ్లీ తీసుకురా అని బతిమాలావ్ అంటూ పంచ్ వేసాడు హైపర్ ఆది. ప్రస్తుతం ఈ ప్రోమో వైరల్ అవుతుంది. పైగా వెంటనే పాపులర్ అయ్యేలా ఏదో ఒకటి చేయ్ అంటూ నన్ను కౌగిలించుకో.. అప్పుడు యూ ట్యూబ్‌లో నువ్వే ట్రెండ్ అవుతావ్ అంటూ మరో పంచ్ వేసాడు. ఏదేమైనా కూడా అమ్మాయిలైనా.. అబ్బాయిలైనా ఆది స్కిట్‌కు వస్తే మాత్రం సైలెంట్ అవ్వాల్సిందే.
Published by:Praveen Kumar Vadla
First published: