JABARDASTH COMEDIAN HYPER AADI COMEDY WORKOUT FOR VENKY MAMA MOVIE TA
ఇప్పటికైనా హైపర్ ఆది ఆశలు ఫలించేనా.. చావో రేవో అంటున్న జబర్ధస్త్ కమెడియన్..
హైపర్ ఆది ఫైల్ ఫోటో
జబర్దస్త్ ప్రోగ్రామ్‌తో ఎంతో మంది నటులు బయటకు వచ్చారు. వాళ్లలతో హైపర్ ఆది కూడా ఒకరు. జబర్ధస్త్ షోలో హైపర్ ఆది కామెడీ కోసమే చూసేవాళ్లన్నారంటే అతిశయోక్తి కాదు. ఇక జబర్ధస్త్‌లో పాపులర్ అయిన హైపర్ ది..
జబర్దస్త్ షో ఎంతో మందికి మంచి గుర్తింపు తీసుకొచ్చింది. ఆ ఫేమ్తోనే అనసూయ, రష్మీ గౌతమ్‌కు మాస్లో మాంచి ఫాలోయింగ్ ఏర్పడింది. మరోవైపు ఈ ప్రోగ్రామ్‌తో ఎంతో మంది నటులు బయటకు వచ్చారు. వాళ్లలతో హైపర్ ఆది కూడా ఒకరు. జబర్ధస్త్ షోలో హైపర్ ఆది కామెడీ కోసమే చూసేవాళ్లన్నారంటే అతిశయోక్తి కాదు. ఇక జబర్ధస్త్‌లో పాపులర్ అయిన హైపర్ ది.. అదే ఊపుతో సినిమాల్లో అడుగుపెట్టాడు. కానీ అక్కడ హైపర్ ఆది పంచ్‌లు మాత్రం పేలలేదు. అందుకే సినిమాలకు గుడ్ బై చెప్పి ..తనకు అచ్చొచ్చిన జబర్ధస్త్ షోనే నమ్ముకున్నాడు. కానీ తాజాగా హైపర్ ఆది.. వెంకటేష్, నాగచైతన్య హీరోలుగా నటించిన ‘వెంకీ మామ’లో కమెడియన్‌గా రీ ఎంట్రీ ఇచ్చాడు. ఈ చిత్రంలో దర్శకుడు బాబీ.. హైపర్ ఆది కోసం స్పెషల్‌గా కామెడీ ట్రాక్ సిద్ధం చేసాడు. అదిచూసి ఆడియన్స్ థియేటర్స్‌లో నవ్వులే నవ్వులనే టాక్ వినబడుతోంది.
‘వెంకీ మామ’లో నాగ చైతన్య, హైపర్ ఆది (youtube/Photo)
ముఖ్యంగా నాగచైతన్య పక్కన ఉంటూనే హైపర్ ఆది పేల్చే డైలాగులు థియేటర్స్‌లో నవ్వులు తెప్పించాయి. అక్కడక్కడా హైపర్ ఆది కామెడీ వర్కౌట్ కాకపోయినా.. ఓవరాల్‌గా హైపర్ ఆది సినిమాలో కమెడియన్‌గా తన ఉనికిని చాటుకున్నాడు. మరి ‘వెంకీ మామ’ తర్వాత సినిమాల్లో కమెడియన్‌గా హైపర్ ఆది బిజీ అవ్వడం ఖాయం అంటున్నారు చూసిన ప్రేక్షకులు.
Published by:Kiran Kumar Thanjavur
First published:
తెలుగు వార్తలు, తెలుగులో బ్రేకింగ్ న్యూస్ న్యూస్ 18లో చదవండి.
రాష్ట్రీయ, జాతీయ, అంతర్జాతీయ, టాలీవుడ్, క్రీడలు, బిజినెస్, ఆరోగ్యం, లైఫ్ స్టైల్, ఆధ్యాత్మిక, రాశిఫలాలు చదవండి.