JABARDASTH COMEDIAN HYPER AADI CO TEAM LEADER RISING RAJU MISSING IN SHOW FROM PAST FEW WEEKS PK
Jabardasth: జబర్దస్త్ కామెడీ షోలో ఆ టీమ్ లీడర్ ఎక్కడున్నాడు.. హైపర్ ఆది తొక్కేసాడా ఏంటి..?
హైపర్ ఆది (File/Hyper Aadi)
Jabardasth: జబర్దస్త్ కామెడీ షోలో చాలా మంది కమెడియన్లు సత్తా చూపిస్తున్నారు. బయట ఎంత బిజీగా ఉన్నా తమకు లైఫ్ ఇచ్చిన జబర్దస్త్ కామెడీ షోను మాత్రం వదలట్లేదు కమెడియన్స్. అయితే ఈ మధ్య ఓ కమెడియన్ కమ్ టీమ్ లీడర్ మాత్రం కనిపించడం మానేసాడు.
జబర్దస్త్ కామెడీ షోలో చాలా మంది కమెడియన్లు సత్తా చూపిస్తున్నారు. కేవలం ఆ షో నుంచే పాపులర్ అయిన వాళ్లు చాలా మందే ఉన్నారు. బుల్లితెరపై తమ సత్తా చూపించి కొందరు సినిమాలు కూడా చేస్తున్నారు. జబర్దస్త్ కామెడీ షో నుంచి హీరోలుగా మారిన వాళ్లు కూడా లేకపోలేదు. సుడిగాలి సుధీర్ కూడా అందులో ఉన్నాడు. ఈయన హీరోగా వరస సినిమాలు చేస్తున్నాడు ఈయన. ఓ వైపు జబర్దస్త్ చేస్తూనే మరోవైపు సినిమాలు కూడా చేస్తున్నారు వీళ్లంతా. బయట ఎంత బిజీగా ఉన్నా తమకు లైఫ్ ఇచ్చిన జబర్దస్త్ కామెడీ షోను మాత్రం వదలట్లేదు కమెడియన్స్. అయితే కొంత కాలంగా ఓ టీమ్ లీడర్ మాత్రం జబర్దస్త్లో కనిపించడం లేదు. మొన్నటి వరకు కనిపించని గెటప్ శ్రీను.. జూన్ 18 ప్రోమోలో సందడి చేస్తున్నాడు. అయితే హైపర్ ఆదితో పాటు మరో టీమ్ లీడర్ రైజింగ్ రాజు ఉంటాడు.. ఆయన మాత్రం కొన్ని వారాలుగా జబర్దస్త్లో మాయం అయ్యాడు. అక్కడ కనిపించడం లేదు.
దాంతో అందరికీ అనుమానాలు వస్తున్నాయి. ఆయన లేకుండానే దొరబాబు, పరదేశీ లాంటి వాళ్ళతోనే స్కిట్స్ చేస్తున్నాడు ఆది. అసలు హైపర్ ఆదితో పాటు రైజింగ్ రాజు కూడా టీమ్ లీడర్ అని చెప్తుంటారు కానీ చాలా మందికి కనీసం ఈ విషయం గుర్తు కూడా లేదు.
హైపర్ ఆది రైజింగ్ రాజు (Hyper aadi raising raju)
ఎందుకంటే ఆ స్థాయిలో ఆది అతన్ని డామినేట్ చేస్తున్నాడు కాబట్టి. హైపర్ ఆది, రైజింగ్ రాజు అంటూ పేరుకు మాత్రమే ఉంటుంది కానీ పేమెంట్స్ నుంచి అన్నీ చూసుకునేది ఆది మాత్రమే. డైలాగ్స్, స్కిట్స్ అన్నీ రాసేది కూడా ఆదే. అందుకే ఇద్దరు పేర్లు టీం లీడర్ కింద కనిపించినా కూడా అక్కడ హైపర్ ఆది సోలో పర్ఫార్మెన్స్ ఎక్కువగా ఉంటుంది. ఇప్పుడు సీనియర్ కమెడియన్ రాజు కనిపించడం లేదు.
హైపర్ ఆది రైజింగ్ రాజు (Hyper aadi raising raju)
దాంతో ఆయన మానేసాడా లేదంటే కొన్ని రోజులు బ్రేక్ తీసుకున్నాడా అర్థం కావడం లేదు. ఈ మధ్య చాలా మంది కమెడియన్లకు కరోనా వచ్చి క్వారంటైన్లోకి వెళ్లిపోయారు. గెటప్ శ్రీను కూడా కరోనా రాకపోయినా మొన్నటి వరకు క్వారంటైన్లోనే ఉండి వచ్చాడు. ఇప్పుడు రైజింగ్ రాజు పరిస్థితి ఏంటి అనేది హైపర్ ఆది టీమ్ క్లారిటీ ఇవ్వాలి.
Published by:Praveen Kumar Vadla
First published:
తెలుగు వార్తలు, తెలుగులో బ్రేకింగ్ న్యూస్ న్యూస్ 18లో చదవండి.
రాష్ట్రీయ, జాతీయ, అంతర్జాతీయ, టాలీవుడ్, క్రీడలు, బిజినెస్, ఆరోగ్యం, లైఫ్ స్టైల్, ఆధ్యాత్మిక, రాశిఫలాలు చదవండి.