JABARDASTH COMEDIAN HYPER AADHI SURPRISED FANS WITH A NEW GETUP AND HAIR STYLE WHICH GOES WRONG PK
హైపర్ ఆది అవసరమా ఇదంతా.. నవ్వుల పాలైన జబర్దస్త్ కమెడియన్..
జబర్దస్త్ కమెడియన్ హైపర్ ఆది (Hyper Aadi)
కమెడియన్‌గా మొదలుపెట్టి ఒక్కో మెట్టు ఎక్కుతున్నాడు హైపర్ ఆది. జబర్దస్త్ కమెడియన్ స్థాయి నుంచి ఇప్పుడు సినిమాల వరకు బాగానే వచ్చేసాడు ఈయన. ఇన్నాళ్లూ కేవలం కమెడియన్‌గానే ఉన్న ఆది..
కమెడియన్‌గా మొదలుపెట్టి ఒక్కో మెట్టు ఎక్కుతున్నాడు హైపర్ ఆది. జబర్దస్త్ కమెడియన్ స్థాయి నుంచి ఇప్పుడు సినిమాల వరకు బాగానే వచ్చేసాడు ఈయన. ఇన్నాళ్లూ కేవలం కమెడియన్‌గానే ఉన్న ఆది.. ఇప్పుడు యాంకర్ అయిపోయాడు. హోస్టుగా వరస ప్రోగ్రామ్స్ చేస్తున్నాడు హైపర్ ఆది. అసలు యాంకర్‌కు ఉండాల్సిన టైమింగ్ ఈయనలో కనిపించడం కష్టమే కానీ పంచ్‌ల జడివానతో కుమ్మేస్తున్నాడు. ప్రస్తుతం ఈయన యాంకర్ రవి వెళ్లిపోయిన తర్వాత ఢీ ఛాంపియన్స్‌లో వర్షిణితో కలిసి హోస్ట్ చేస్తున్నాడు. దాంతో పాటే న్యూ ఇయర్ ఈవెంట్ ఆడవారి పార్టీలకు అర్థాలే వేరులేలో కూడా వర్షిణితో కలిసి హోస్టింగ్ చేసాడు హైపర్ ఆది.
హైపర్ ఆది ఫైల్ ఫోటో
ఢీ ఛాంపియన్స్‌కు హోస్టింగ్‌తో పాటు స్క్రిప్ట్ రైటింగ్ కూడా చేస్తున్నాడు ఈయన. హైపర్ ఆది 2.0 అన్నట్లు వరసగా అక్కడే స్కిట్స్ ప్లస్ హోస్ట్‌గా సత్తా చూపిస్తున్నాడు ఈ కుర్ర కమెడియన్. అయితే అంతా బాగానే ఉంది కానీ ఇప్పుడు హైపర్ ఆది చేసిన పనికి మాత్రం నవ్వుల పాలవుతున్నాడు. తెలియకుండానే బుక్ అవుతున్నాడు ఈ కమెడియన్. ఢీ ఛాంపియన్స్‌లో మనోడు హోస్టుగా సత్తా చూపిస్తున్నాడు. ప్రదీప్, సుధీర్ లాంటి ఇద్దరు స్టార్ యాంకర్స్ మధ్యలో తను కూడా మెప్పించడానికి ప్రయత్నాలు చేస్తున్నాడు. అయితే ఇదిలా ఉండగా ఈ కార్యక్రమం కోసం హైపర్ ఆది కొత్త కొత్త స్టైల్స్ ఫాలో అవుతున్నాడు.
ఢీ ఛాంపియన్స్ సెట్
ఇప్పటి వరకు ఈయన్ని చూడని విధంగా మారిపోతున్నాడు. అదే ఇప్పుడు నవ్వుల పాలయ్యేలా చేసింది. తాజాగా వచ్చిన ఎపిసోడ్లో.. వచ్చే వారం ప్రోమోలో ఆదిని చూసి నవ్వుకోకుండా ఉండలేకపోతున్నారు ఫ్యాన్స్. పిచ్చుకగూడు లాంటి హెయిర్ స్టైల్‌తో ఆది వచ్చిన తీరు అందరికీ నవ్వు తెప్పిస్తుందంటున్నారు నెటిజన్లు. పైగా డ్రస్సింగ్ కూడా అలాగే ఉంది.
సాధారణంగా జబర్దస్త్ షోలో కనిపించే ఆదినే అందరికీ నచ్చుతాడు. కానీ అలవాటు లేని గెటప్‌లో ఆదిని చూస్తుంటే అస్సలు బాగోలేదంటున్నారు అభిమానులు కూడా. మరీ ముఖ్యంగా హెయిర్ స్టైల్ విషయంలో పూర్తిగా విచిత్రంగా మారిపోయాడు హైపర్ ఆది. కనీసం వచ్చే ఎపిసోడ్లో అయినా డ్రస్సింగ్ స్టైల్‌తో పాటు హెయిర్ స్టైల్ కూడా మారిస్తే బాగుంటుందంటూ ఆయనకు సూచనలు సలహాలు కూడా ఇస్తున్నారు ఫ్యాన్స్. మరి వీటిని ఆది ఎంతవరకు తీసుకుంటాడో చూడాలిక.
Published by:Praveen Kumar Vadla
First published:
తెలుగు వార్తలు, తెలుగులో బ్రేకింగ్ న్యూస్ న్యూస్ 18లో చదవండి.
రాష్ట్రీయ, జాతీయ, అంతర్జాతీయ, టాలీవుడ్, క్రీడలు, బిజినెస్, ఆరోగ్యం, లైఫ్ స్టైల్, ఆధ్యాత్మిక, రాశిఫలాలు చదవండి.