JABARDASTH COMEDIAN HYPER AADHI SUPER STRATEGY AND HIMSELF CREATED CONTROVERSY FOR COMEDY SCENES PK
హైపర్ ఆది సూపర్ స్ట్రాటజీ.. కాంట్రవర్సీ లేకపోతే కామెడీ లేదా..?
హైపర్ ఆది ఫైల్ ఫోటో
జబర్దస్త్ కామెడీ షోలో హైపర్ ఆదిని మించిన వాళ్లు ప్రస్తుతం ఎవరూ లేరు. ఈయన స్కిట్ వస్తే చాలు లక్షల్లో వ్యూస్ వస్తుంటాయి. జబర్దస్త్ కామెడీ షోలో ఎవరికీ లేని యూ ట్యూబ్ ఫాలోయింగ్ ఆది సొంతం.
జబర్దస్త్ కామెడీ షోలో హైపర్ ఆదిని మించిన వాళ్లు ప్రస్తుతం ఎవరూ లేరు. ఈయన స్కిట్ వస్తే చాలు లక్షల్లో వ్యూస్ వస్తుంటాయి. జబర్దస్త్ కామెడీ షోలో ఎవరికీ లేని యూ ట్యూబ్ ఫాలోయింగ్ ఆది సొంతం. మనోడు ఏదైనా స్కిట్ చేసాడంటే చాలు.. అందులో నవ్వులతో పాటు కాంట్రవర్సీలకు కూడా కొదవే ఉండదు. ఇప్పుడు కూడా ఇదే జరుగుతుంది. అసలు వివాదంలోంచి వినోదం వెతుక్కోవడమే హైపర్ ఆది స్టైల్. ఎప్పటికప్పుడు సెన్సేషనల్ స్కిట్స్ చేస్తూ ముందుకు వెళ్తున్నాడు ఈ కుర్ర కమెడియన్. తన ప్రతీ స్కిట్ కూడా వివాదానికి దగ్గరగా ఉండేలా ప్లాన్ చేసుకుంటున్నాడు ఈయన.
సైరా స్పూఫ్ చేసిన హైపర్ ఆది
మిగిలిన కంటెస్టెంట్లతో పోలిస్తే ఆదికి కాస్త గట్స్ ఎక్కువే. అందుకే ప్రస్తుతం సమాజంలో జరుగుతున్న వాటిపైనే ఎక్కువగా తన స్కిట్స్ రాసుకుంటాడు. అందులోంచే డైలాగులు కూడా పేలుస్తుంటాడు. కొన్నిసార్లు అవి పట్టు తప్పుతుంటాయి కూడా. అప్పట్లో హిజ్రాలను టార్గెట్ చేసిన చేసిన ఓ స్కిట్ చాలా పెద్ద కాంట్రవర్సీ అయింది. ఇక కత్తి మహేష్‌తో ఈయన ఆడుకున్న తీరు చాలా రోజుల పాటు వార్తల్లో నానింది. దీనిపై ఓ ప్రముఖ ఛానెల్ ఆదిని తీసుకెళ్లి ఇంటర్వ్యూలు.. డిబేట్లు కూడా చేసింది. ఆ తర్వాత కూడా ఈయన చేసిన చాలా స్కిట్స్ సంచలనాలు రేపాయి.
బాలయ్య హైపర్ ఆది
ఈ మధ్య కూడా సైరాపై ఈయన చేసిన ఓ స్కిట్ దేశభక్తుల ఆగ్రహానికి గురైంది. దాంతో పాటు వరసగా మెగా హీరోలను టార్గెట్ చేస్తూ ఈయన చేస్తున్న కొన్ని స్పూఫ్‌లు వాళ్లకు కూడా నచ్చడం లేదనే వార్తలు వినిపిస్తున్నాయి. ఇక మెగా అభిమానులు అయితే ఏకంగా ఆదికి చిన్న సైజ్ వార్నింగులు కూడా ఇచ్చేస్తున్నారు. మొన్నామధ్య గబ్బర్ సింగ్.. ఆ తర్వాత గద్దలకొండ గణేష్.. ఇప్పుడు సైరా నరసింహా రెడ్డి.. ఇలా కొత్త సినిమా విడుదలైతే చాలు అందులోకి దూరిపోతున్నాడు ఆది. ఇదే ఇప్పుడు అభిమానులకు కోపం తెప్పిస్తుంది.
హైపర్ ఆది గద్దలకొండ గణేష్ (Source: youtube)
సూట్ కాకపోయినా కామెడీ కోసం అలాంటి గొప్ప కారెక్టర్స్ తీసుకుని కామెడీ చేస్తున్నాడంటూ ఆదిపై మండిపడుతున్నారు ఫ్యాన్స్. దయచేసి అలాంటి ఓవర్ యాక్షన్ చేయకు ఆది అంటూ సోషల్ మీడియాలో మనోడికి చాలా మర్యాదగా చెప్తున్నారు.. కొందరు అయితే కాస్త ఘాటుగానే వార్నింగులు కూడా ఇస్తున్నారు. మెగా అభిమాని అయినా కూడా అలాంటి గెటప్స్‌లో కనిపిస్తే అసలు సహించలేం అంటున్నారు వాళ్లు. అన్నింటికి మించి చిరంజీవి ఉయ్యాలవాడ గెటప్‌ను స్పూఫ్ చేసాడు ఆది. అందులోనే మగధీర, బాహుబలి సినిమాలను కూడా కలిపేసాడు.
రోజా, హైపర్ ఆది
తెలుగు ఇండస్ట్రీ ప్రైడ్‌గా భావించే సినిమాలను అలా నీ కామెడీ కోసం కంగాళీ చేస్తావా అంటూ మనోడితో ఆడేసుకుంటున్నారు నెటిజన్లు. దీనిపై హైపర్ ఆది మాత్రం లైట్ తీసుకుంటున్నాడు. తానేం చేసినా కూడా కామెడీ కోసమే అని.. నవ్వించడం తన లక్ష్యం అంటున్నాడు ఈ కమెడియన్. తన చుట్టూ కాంట్రవర్సీలు వచ్చినా కూడా ఈయన మాత్రం ఏం స్పందించడం లేదు. ఎవరికి తోచింది వాళ్లు రాసుకుంటారు.. నా తీరు ఇంతే అన్నట్లు ఉంటున్నాడు.
First published:
తెలుగు వార్తలు, తెలుగులో బ్రేకింగ్ న్యూస్ న్యూస్ 18లో చదవండి.
రాష్ట్రీయ, జాతీయ, అంతర్జాతీయ, టాలీవుడ్, క్రీడలు, బిజినెస్, ఆరోగ్యం, లైఫ్ స్టైల్, ఆధ్యాత్మిక, రాశిఫలాలు చదవండి.