Praveen Kumar VadlaPraveen Kumar Vadla
|
news18-telugu
Updated: January 9, 2020, 4:44 PM IST
దర్బార్ సినిమాలో హైపర్ ఆది ప్రస్థావన
వినడానికి విచిత్రంగా అనిపించినా కూడా ఇదే నిజం. ఒక్కోసారి క్రేజ్ అలా వచ్చేస్తుంది అంతే. తెలుగు ఇండస్ట్రీలో ప్రస్తుతం పంచ్ డైలాగ్ అనే పేరు వినగానే మరో ఆలోచన లేకుండా హైపర్ ఆది పేరు గుర్తుకొస్తుంది. మనోడు జబర్దస్త్ కామెడీ షోలో కడుపులు చెక్కలయ్యేలా నవ్విస్తున్నాడు. ఈ కమెడియన్ క్రేజ్ ఇప్పుడు సినిమాల్లో కూడా కనిపిస్తుంది. ఇప్పటికే కొన్ని సినిమాలకు డైలాగులు కూడా రాస్తున్నాడు ఈయన. ఇక ఇప్పుడు ఈయన పేరు రజినీకాంత్ సినిమాలో కూడా వినిపించింది. అదే దర్బార్.. తాజాగా విడుదలైన ఈ చిత్రంలో హైపర్ ఆది పేరును వాడుకున్నాడు దర్శకుడు మురుగదాస్.

ఏ.ఆర్.మురుగదాస్,రజినీకాంత్ ‘దర్బార్’ షూటింగ్ పూర్తి (Twitter/Photo)
సినిమాలోని ఓ సన్నివేశంలో రజినీని తన ఇంట్లోని పెళ్లి వేడుకకు ఆహ్వానిస్తుంది నయనతార. వచ్చిన తర్వాత అక్కడ ఓ చిన్నపిల్ల మెడలో గోల్డ్ చైన్ మిస్సింగ్ అని కమీషనర్ అయిన రజినీకాంత్కు చాలా అమాయకంగా కంప్లైంట్ ఇస్తుంది నయన్. దాన్ని చూసి రజినీ కూడా కమీషనర్ వచ్చి.. చైన్ వెతకాలి కదా అంటూ వెటకారంగా మాట్లాడాతాడు. అదే సమయంలో ఆ చిన్నపిల్లను పిలిచి.. చైన్ ఎక్కడ ఎప్పుడు పోయిందమ్మా అని అడుగుతాడు రజినీకాంత్.. దానికి వెంటనే ఆ పాప అది తెలిస్తే మేమే వెళ్లి వెతుక్కుంటాం కదా అంకుల్.. దానికి మిమ్మల్ని ఎందుకు పిలుస్తాం చెప్పండి అంటూ సెటైర్ వేస్తుంది.

దర్బార్ సినిమాలో హైపర్ ఆది ప్రస్థావన
ఈ డైలాగ్ తర్వాత పక్కనే ఉన్న కమెడియన్ యోగి బాబు మరో సెటైర్ వేస్తాడు.. హైపర్ ఆది ఎపెక్ట్ సర్.. అందుకే ఇలా పంచులు వస్తున్నాయి.. ఏం చేయలేం అంటూ రజినీతో చెప్తాడు. దాంతో థియేటర్స్ ఒక్కసారిగా ఆ డైలాగుతో మరోసారి నవ్వులు పూసాయి. మొత్తానికి ఏదేమైనా కూడా పంచ్ డైలాగ్ అనగానే హైపర్ ఆది పేరు గుర్తొస్తుందంటే మాత్రం నిజంగానే గొప్ప విషయమే. ఏం చేస్తాం.. అంతా జబర్దస్త్ కామెడీ షో మహిమే.
Published by:
Praveen Kumar Vadla
First published:
January 9, 2020, 4:44 PM IST