హోమ్ /వార్తలు /సినిమా /

జబర్దస్త్‌లో మళ్లీ బాలయ్యను టార్గెట్ చేసిన హైపర్ ఆది..

జబర్దస్త్‌లో మళ్లీ బాలయ్యను టార్గెట్ చేసిన హైపర్ ఆది..

హైపర్ ఆది బాలయ్య (hyper aadi balakrishna)

హైపర్ ఆది బాలయ్య (hyper aadi balakrishna)

Hyper Aadi Balakrishna: చాలా రోజుల తర్వాత జబర్దస్త్‌లో ఒరిజినల్ కంటెంట్ వస్తుంది. మూడు నెలల గ్యాప్ తర్వాత తిరిగి షూటింగ్స్ మొదలు పెట్టారు. దాంతో వరసగా ప్రోమోలు విడుదలవుతున్నాయి.

చాలా రోజుల తర్వాత జబర్దస్త్‌లో ఒరిజినల్ కంటెంట్ వస్తుంది. మూడు నెలల గ్యాప్ తర్వాత తిరిగి షూటింగ్స్ మొదలు పెట్టారు. దాంతో వరసగా ప్రోమోలు విడుదలవుతున్నాయి. ఒకేరోజు మూడు నాలుగు ఎపిసోడ్స్ షూట్ చేసినట్లుగా తెలుస్తుంది. చాలా రోజులుగా రేటింగ్స్ కూడా బాగా పడిపోవడంతో మళ్లీ ఇప్పుడు జబర్దస్త్ పుణ్యమా అని పుంజుకుంటుందని ఈటీవీ కూడా భావిస్తుంది. ఇదిలా ఉంటే కొత్త ఎపిసోడ్‌లో మొదలై కాగానే బాలయ్యను మరోసారి వాడేసుకున్నాడు హైపర్ ఆది. గతంలోనే ఈయన చాలాసార్లు బాలయ్య డైలాగులను తనకు కావాల్సినట్లుగా మార్చుకుని వాడుకున్నాడు.

హైపర్ ఆది బాలయ్య (hyper aadi balakrishna)
హైపర్ ఆది బాలయ్య (hyper aadi balakrishna)

అప్పట్లో ఈయనకు బాలయ్య ఫ్యాన్స్ నుంచి వార్నింగులు కూడా వచ్చాయనే వార్తలు కూడా వచ్చాయి. అయితే ఇప్పుడు మొదలైన జబర్దస్త్‌లో మరోసారి బాలయ్య డైలాగ్ వాడుకున్నాడు ఆది. ఈ మధ్యే విడుదలైన బోయపాటి శ్రీను సినిమాలోని బాలయ్య బర్త్ డే డైలాగ్ తన స్కిట్ కోసం వాడుకున్నాడు హైపర్ ఆది. 'ఎదుటివాడితో మాట్లాడేటప్పుడు ఎలా మాట్లాడాలో నేర్చుకో..' అంటూ బాలయ్య తనదైన శైలిలో చెప్పిన డైలాగ్‌ను ఇప్పుడు తన స్కిట్‌లో కామెడీగా వాడుకున్నాడు ఈ కమెడియన్.

హైపర్ ఆది బాలయ్య (hyper aadi balakrishna)
హైపర్ ఆది బాలయ్య (hyper aadi balakrishna)

''ఎదుటివాడితో మాట్లాడేటప్పుడు ఎలా మాట్లాడాలో నేర్చుకో.. ఆది గారికి మా జంటను చూస్తే కుళ్లులా ఉంది అనడానికి.. ఆది గారు మా కుళ్లిపోయిన జంట ఎలా ఉంది అనడానికి చాలా తేడా ఉందిరా లక్డీ కపూల్'' అంటూ ఆది బాలయ్య మేనరిజంతో పంచ్ వేశాడు. ఇది చూసి పడిపడి నవ్వుకుంది జడ్జి రోజా. మూడు నెలల తర్వాత మొదలైన ప్రోగ్రామ్ కావడంతో పంచులు అన్నీ భారీగానే పేల్చేసారు.

' isDesktop="true" id="542872" youtubeid="HdA2JDry2yA" category="movies">

ముఖ్యంగా చాలా మంది కరోనాను టార్గెట్ చేసారు. దాన్నుంచే కామెడీ తీసుకురావడానికి ప్రయత్నించారు. ఆది కూడా ఇలాంటి పంచులే వేసాడు. ఏదేమైనా కూడా హీరోలను వాడుకుంటే లేనిపోని తలనొప్పులు వస్తాయని తెలిసినా కూడా ఆది మాత్రం వెనక్కి తగ్గట్లేదు. గతంలోనే నందమూరి, మెగా హీరోల అభిమానుల నుంచి వార్నింగులు ఎదుర్కొన్నాడు ఆది. మళ్లీ ఇప్పుడు బాలయ్యను టార్గెట్ చేసాడు. మరి ఈ సారి ఎలా ఉండబోతుందో..?

Published by:Praveen Kumar Vadla
First published:

Tags: Balakrishna, Hyper Aadi, Jabardasth comedy show, Telugu Cinema, Tollywood

ఉత్తమ కథలు