JABARDASTH COMEDIAN GETUP SRINU SPECIAL INTERVIEW WITH NEWS18 PK
జబర్దస్త్ కమెడియన్ గెటప్ శ్రీనుతో న్యూస్ 18 స్పెషల్ ఇంటర్వ్యూ..
న్యూస్ 18తో ప్రత్యేకంగా ముచ్చటించిన జబర్దస్త్ కమెడియన్ గెటప్ శ్రీను (Getup Srinu News18 Interview)
Jabardasth Getup Srinu: గెటప్ శ్రీను.. ఈ పేరుకి రెండు తెలుగు రాష్ట్రాల్లో పెద్దగా పరిచయం చేయనవసరం లేదు. అంతలా ప్రతి ఇంట్లో తమ మనిషిలా గుర్తిండిపోయాడు ఈ అబ్బాయి. నటనలో ప్రత్యేకతే కాదు..
గెటప్ శ్రీను.. ఈ పేరుకి రెండు తెలుగు రాష్ట్రాల్లో పెద్దగా పరిచయం చేయనవసరం లేదు. అంతలా ప్రతి ఇంట్లో తమ మనిషిలా గుర్తిండిపోయాడు ఈ అబ్బాయి. నటనలో ప్రత్యేకతే కాదు తాను ఎంచుకున్న పాత్రలు కూడా సమాజానికి చాలా దగ్గరగా ఉంటాయి. తాను చేసే ప్రాత్రలకి తానే మొదటి ఉలినని అంటున్న గెటప్ శ్రీనును న్యూస్ 18 పలకరించింది. ఈ లాక్ డౌన్ సమయంలో తాను ఏ విధంగా ఇంట్లో సమయం గడుపుతున్నారు...
న్యూస్ 18తో ప్రత్యేకంగా ముచ్చటించిన జబర్దస్త్ కమెడియన్ గెటప్ శ్రీను (Getup Srinu News18 Interview)
బహుశా ఇదే మొదటిసారి కదా మీరు ఇన్ని రోజులు ఖాళీగా ఇంట్లో ఉండడం.
అయ్యో అదేం లేదండి.. ప్రపంచానికి లాక్ డౌన్ కానీ నా బ్రెయిన్‌కి మాత్రం కాదు.. నిత్యం కొత్త కొత్త స్కిట్లు రాసుకుంటున్నాను. వాస్తవానికి సాదారణ రోజుల కంటే ఇప్పుడేకాస్త ఎక్కువ సమయం కొత్త ఐడియాల కోసం సమయం కేటాయిస్తున్నాను. ఈ లాక్ డౌన్ సమయాన్ని సరైన పద్దతిలోనే వాడుకుంటున్నాననే అనుకుంటున్నాను.
న్యూస్ 18తో ప్రత్యేకంగా ముచ్చటించిన జబర్దస్త్ కమెడియన్ గెటప్ శ్రీను (Getup Srinu News18 Interview)
ముఖ్యంగా కరోనా మీలో తీసుకొచ్చిన మార్పులేంటి?
ఏముంటాయండి.. అరగంటకోసారి చేతులు శుభ్రంగా కడుక్కోవడం....ఎక్కడకి బయటి వెళ్లకపోవడం.. ఇప్పుడు పోన్‌తో పాటు మన డైలీ జీవితంలో మరో వస్తువు చేరింది.. అదే శానిటైజర్. ఫోన్‌తో పాటు అది ఎప్పుడు నాతో ఉంటుంది. అస్సలు బయటి వెళ్లడం లేదు. బహుశా ఎక్కడికి వెళ్లకుండా ఇంట్లో ఉండడం ఇదే మొదటిసారి నాకే కాదు అందరికి కూడా .
న్యూస్ 18తో ప్రత్యేకంగా ముచ్చటించిన జబర్దస్త్ కమెడియన్ గెటప్ శ్రీను (Getup Srinu News18 Interview)
ముఖ్యంగా కరోనా వల్ల చిన్న మద్యతరగతి కుటుంబాలు చాలా దారణమైన స్థితికి వెళ్లిపోయాయి.. దీనిపై ఏమంటారు..?
చాలా బాధాకర విషయం అండి.. ముఖ్యంగా లాక్ డౌన్ వైరస్ కట్టడి కోసం పెట్టాం.. అయితే అదే సమయంలో చాలా మంది ఉపాధి లేక ఒక్క పూట తిండి కోసం ఎదురుచూడాల్సిన పరిస్థితి ఏర్పడింది. చాలా దురదృష్టకరమైన పరిస్థితి ఇది. అందుకే రోజు నాకు చేతనైనంత సాయం నాకు అందుబాటులో ఉన్న వారికి చేస్తున్నాను. మీరు కూడా అదే మీ చుట్టూ ఉన్న పేదలకు ఆహారం అందించండి.. ఈ సమయంలో మనం ఒకరికొకరు తోడుండాలి. ఎప్పుడు పోతామో తెలియని జీవతాలకు నాది అనుకుని స్వార్ధంగా ఉండడం మంచిది కాదు.
న్యూస్ 18తో ప్రత్యేకంగా ముచ్చటించిన జబర్దస్త్ కమెడియన్ గెటప్ శ్రీను (Getup Srinu News18 Interview)
విజయ్ దేవరకొండ లాంటి స్టార్ హీరోలే తమ దగ్గర డబ్బులు లేవని అంటున్నారు మీ ఆర్ధిక పరిస్థితి ఎలా ఉంది. ?
ప్రస్తుతానికి మల్లెమాల వాళ్లు మాకు పేమెంట్స్ ఇస్తున్నారండి.. మాకైతే ఇబ్బంది లేదు... మల్లెమాల ఉన్నంత వరకు మాకు ఎటువంటి ఇబ్బంది ఉండదండి. విజయ్ చెప్పింది నిజమే.. చాలా మంది మా పరిశ్రమలో ఈ లాక్ డౌన్ వల్ల ఇబ్బందులు పడుతున్నారు. కొంతమంది ఇప్పటికే ముందుకు వచ్చి చాలా మందికి సహయం చేస్తున్నారు.
పూర్తి ఇంటర్వ్యూ కోసం ఈ కింద వీడియో చూడండి..
Published by:Praveen Kumar Vadla
First published:
తెలుగు వార్తలు, తెలుగులో బ్రేకింగ్ న్యూస్ న్యూస్ 18లో చదవండి.
రాష్ట్రీయ, జాతీయ, అంతర్జాతీయ, టాలీవుడ్, క్రీడలు, బిజినెస్, ఆరోగ్యం, లైఫ్ స్టైల్, ఆధ్యాత్మిక, రాశిఫలాలు చదవండి.