JABARDASTH COMEDIAN GETUP SRINU SHOCKED BY THE QUESTION ASKED BY A NETIZEN ABOUT HIS TEAM PK
Jabardasth Getup Srinu: మీరేంటో.. మీ స్కిట్స్ ఏంటో.. గెటప్ శ్రీను పరువు తీసిన నెటిజన్..
జబర్దస్త్ గెటప్ శ్రీను (jabardasth getup srinu)
Jabardasth Getup Srinu: జబర్దస్త్ కామెడీ షో(Jabardasth Comedy Show) అంటే కేవలం కమెడియన్లు మాత్రమే కాదు.. అందులో కొందరు అద్భుతమైన నటులు కూడా ఉన్నారు. వాళ్లు కేవలం కామెడీ మాత్రమే కాదు ఏమిచ్చినా చేస్తారు. అందులో మరీ ముఖ్యంగా చెప్పుకోవాల్సిన నటుడు గెటప్ శ్రీను(Getup Srinu).
గెటప్ శ్రీను.. తెలుగు ప్రేక్షకులకు ప్రత్యేకంగా పరిచయం అవసరం లేని పేరు. జబర్దస్త్ కామెడీ షో చూసే వాళ్లకు ఈయనతో బాగా పరిచయమే. మరీ ముఖ్యంగా జబర్దస్త్ కామెడీ షో అంటే కేవలం కమెడియన్లు మాత్రమే కాదు.. అందులో కొందరు అద్భుతమైన నటులు కూడా ఉన్నారు. వాళ్లు కేవలం కామెడీ మాత్రమే కాదు ఏమిచ్చినా చేస్తారు. ఎలాంటి పాత్రలో అయినా మెప్పిస్తారు. అందులో మరీ ముఖ్యంగా చెప్పుకోవాల్సిన నటుడు గెటప్ శ్రీను. ఈయన్ని ఏకంగా బుల్లితెర కమల్ హాసన్ అంటూ అప్పట్లోనే నాగబాబు కన్ఫర్మ్ చేసారు. వారానికో గెటప్‌లో కనిపిస్తూ తనకంటూ ప్రత్యేకమైన గుర్తింపు తెచ్చుకున్నారు ఈయన. టీమ్ లీడర్ కావడానికి అన్ని అర్హతలు ఉన్నా కూడా కంటెస్టెంట్‌గానే ఉండిపోయారు శ్రీను. కావాలనే తాను టీమ్ లీడర్ పదవి వదిలేసుకున్నానంటూ చాలాసార్లు చెప్పారు కూడా. సుడిగాలి సుధీర్ టీమ్‌లో అత్యంత కీలకంగా ఉంటారు గెటప్ శ్రీను. ఒక్కముక్కలో చెప్పాలంటే టీమ్ లీడర్ సుధీర్ అయినా కూడా ముగ్గురు ఒకేలా ఆలోచిస్తుంటారు.. ఒకేలా ఉంటారు.. ఒకే ప్రాధాన్యత కూడా ఉంటుంది.
స్కిట్స్‌లో కూడా ఒకరికి తక్కువ.. ఎక్కువ అన్నట్లు కాకుండా అంతా సమానంగా స్క్రీన్ షేర్ చేసుకుంటారు. అయితే సుడిగాలి సుధీర్ స్కిట్ ఎంత ఎంటర్టైనింగ్గా ఉన్నా కూడా అందులో పాయింట్ అనేది ఉండదని విమర్శలు కూడా వస్తుంటాయి. ముఖ్యంగా కొట్టుకోవడం తప్ప వీళ్లేం చేయరు అంటూ సోషల్ మీడియాలో చాలా విమర్శలు వస్తుంటాయి. తాజాగా లైవ్‌లోకి వచ్చిన గెటప్ శ్రీనును ఓ నెటిజన్ కూడా ఇదే ప్రశ్న అడిగారు.
జబర్దస్త్ గెటప్ శ్రీను (Jabardasth Getup Srinu)
మీ స్కిట్స్ చాలా బాగుంటాయి.. నేను చాలా ఎంజాయ్ చేస్తాను.. అంతా బాగానే ఉంటుంది కానీ ఎందుకు చివర్లో కొట్టుకుంటారు.. ఎలా ముగించాలో తెలియక కొట్టుకుంటూ ముగిస్తారేంటి అని అడిగేసారు. దీనికి గెటప్ శ్రీను కూడా అంతే స్పోర్టివ్‌గా సమాధానం ఇచ్చారు. ఈ సారి నుంచి కంక్లూజన్ బాగుండేలా చూసుకుంటాం బ్రదర్ అంటూ చెప్పుకొచ్చారు. ఏదేమైనా కూడా కొట్టుకోవడంతోనే స్కిట్స్ కావు కదా అంటూ గెటప్ శ్రీను పరువు లైవ్‌లోనే తీసేసారు సదరు నెటిజన్. ఈ ఇద్దరి మధ్య జరిగిన డిస్కషన్ ఇప్పుడు వైరల్ అవుతుంది.
Published by:Praveen Kumar Vadla
First published:
తెలుగు వార్తలు, తెలుగులో బ్రేకింగ్ న్యూస్ న్యూస్ 18లో చదవండి.
రాష్ట్రీయ, జాతీయ, అంతర్జాతీయ, టాలీవుడ్, క్రీడలు, బిజినెస్, ఆరోగ్యం, లైఫ్ స్టైల్, ఆధ్యాత్మిక, రాశిఫలాలు చదవండి.