హోమ్ /వార్తలు /సినిమా /

Sudigali Sudheer - Getup Srinu: జబర్దస్త్‌లో రాజకీయం.. సుడిగాలి సుధీర్ కారణంగా గెటప్ శ్రీను టీమ్ లీడర్ పదవి దూరం..

Sudigali Sudheer - Getup Srinu: జబర్దస్త్‌లో రాజకీయం.. సుడిగాలి సుధీర్ కారణంగా గెటప్ శ్రీను టీమ్ లీడర్ పదవి దూరం..

సుడిగాలి సుధీర్, గెటప్ శ్రీను (File/Photo)

సుడిగాలి సుధీర్, గెటప్ శ్రీను (File/Photo)

Sudigali Sudheer - Getup Srinu: బుల్లితెర కమెడియన్స్‌లో నెంబర్ వన్ సుధీర్ అంటే అతిశయోక్తి కాదు. టీవీ షోలతో పాటు యాంకర్, డాన్సర్, మెజీషియన్‌గా కూడా సత్తా చూపిస్తున్నాడు సుధీర్. గతేడాది సాఫ్ట్‌‌వేర్ సుధీర్ అంటూ హీరో అయ్యాడు కూడా.

సుడిగాలి సుధీర్.. పరిచయం అక్కర్లేని పేరు. బుల్లితెరపై ఉండి కూడా ఇంత క్రేజ్ తెచ్చుకోవచ్చా అని ఆశ్చర్యపోయేలా ఎదిగిపోయాడు ఈయన. ప్రస్తుతం ఉన్న బుల్లితెర కమెడియన్స్‌లో నెంబర్ వన్ సుధీర్ అంటే అతిశయోక్తి కాదు. టీవీ షోలతో పాటు యాంకర్, డాన్సర్, మెజీషియన్‌గా కూడా సత్తా చూపిస్తున్నాడు సుధీర్. గతేడాది సాఫ్ట్‌‌వేర్ సుధీర్ అంటూ హీరో అయ్యాడు కూడా. మిగిలిన సినిమాల్లో కూడా చిన్నచిన్న పాత్రలు చేసాడు ఈయన. ఇక ఇప్పుడు ఈయన డేట్స్ హాట్ కేక్.. 30 రోజులు ఫుల్ బిజీగానే ఉన్నాడు. జబర్దస్త్ కామెడీ షోతో పాటు ఇంకా చాలా షోస్ చేస్తున్నాడు సుధీర్. దీనికి తోడు సినిమాలు కూడా చేస్తున్నాడు. దాంతో ఆస్తులు కూడా బాగానే పోగేసుకుంటున్నాడు ఈయన. ఇదిలా ఉంటే ఇప్పుడు సుధీర్ జబర్దస్త్ ఇంతగా ఎదగడానికి.. ఆయన కెరీర్‌కు రూట్ మ్యాప్ వేసింది ఎవరు అంటే తానే అంటున్నాడు గెటప్ శ్రీను. జబర్దస్త్ కామెడీ షోలో 3 ఇడియట్స్ అంటే శ్రీను, సుధీర్, రాంప్రసాద్. వీళ్లలో గెటప్ శ్రీను సీనియర్.. అయితే అనుకోని కారణాలతో ముందు సుధీర్ వచ్చాడు జబర్దస్త్ కామెడీ షోకు. అయితే అప్పట్లో తాను కమెడియన్ వేణుతో కలిసి ఓ సినిమా కోసం మలేసియాలో 30 రోజులున్నానని.. అప్పుడే ఆయనతో పరిచయం అయిందని చెప్పాడు శ్రీను. ఆ తర్వాత జబర్దస్త్ మొదలుపెడుతున్నామని చెప్పాడని.. అయితే అప్పటికి తాను టివి 9లో ఏడాది కాంట్రాక్ట్‌లో ఉన్నానని చెప్పాడు శ్రీను. అదే సమయానికి సుధీర్ తన రూమ్ మేట్ అని.. అలా వేణుకు తన సుధీర్ గురించి చెప్పానని గుర్తు చేసుకున్నాడు గెటప్ శ్రీను.

సుడిగాలి సుధీర్, గెటప్ శ్రీను (sudheer getup srinu)
సుడిగాలి సుధీర్, గెటప్ శ్రీను (sudheer getup srinu)

సుధీర్ అప్పటికే మెజీషియన్‌గా ఉన్నాడని.. అలా వాన్ని అక్కడ పరిచయం చేసానని చెప్పాడు గెటప్ శ్రీను. వేణుకు పరిచయం చేసిన తర్వాత అక్కడ సుధీర్ సెటిల్ అయిపోయాడని.. తాను మాత్రం ఏడాది తర్వాత వచ్చి టీంలో జాయిన్ అయినట్లు చెప్పాడు గెటప్ శ్రీను. సుధీర్ వాళ్ల ఊరికి వెళ్లినపుడు కూడా వాళ్ల అమ్మ తన కొడుక్కి ఏదో ఒక దారి చూపించరా అని అడిగేదని.. అలా తనకు తెలిసిన వేణుతో చెప్పి సుధీర్ ఎంట్రీకి కారణమయ్యానని చెప్పాడు గెటప్ శ్రీను. ఆ తర్వాత వేణు టీం వెళ్లిపోయిన తర్వాత తనకంటే ముందొచ్చాడని సుడిగాలి సుధీర్‌ను టీం లీడర్ చేసారని చెప్పాడు. ఆ తర్వాత తమ జర్నీ గురించి చెప్పాల్సిన పనిలేదంటున్నాడు గెటప్ శ్రీను.

First published:

Tags: Jabardasth getup srinu, Sudigali sudheer, Telugu Cinema, Tollywood