• Home
  • »
  • News
  • »
  • movies
  • »
  • JABARDASTH COMEDIAN GETUP SRINU INTERESTING ROLE IN CHIRANJEEVI ACHARYA MOVIE PK

Getup Srinu in Acharya movie: ‘ఆచార్య’లో జబర్దస్త్ కమెడియన్‌కు అదిరిపోయే పాత్ర ఇచ్చిన చిరంజీవి..

జబర్దస్త్ గెటప్ శ్రీను (jabardasth getup srinu)

Getup Srinu in Acharya movie: జబర్దస్త్ కమెడియన్ గెటప్ శ్రీను ఇప్పుడు కేవలం బుల్లితెరపై మాత్రమే కాదు వెండితెరపై కూడా బాగానే మెరుస్తున్నాడు. ఈ మధ్యే విడుదలైన జాంబి రెడ్డిలో సందడంతా ఈ జబర్దస్త్ కమెడియన్‌దే కనిపించింది.

  • Share this:
జబర్దస్త్ కమెడియన్ గెటప్ శ్రీను ఇప్పుడు కేవలం బుల్లితెరపై మాత్రమే కాదు వెండితెరపై కూడా బాగానే మెరుస్తున్నాడు. ఈ మధ్యే విడుదలైన జాంబి రెడ్డిలో సందడంతా ఈ జబర్దస్త్ కమెడియన్‌దే కనిపించింది. జాంబి రెడ్డిలో అదిరిపోయే కామెడీ రోల్ చేసాడు గెటప్ శ్రీను. ఈ సినిమా తర్వాత తనకు మరిన్ని సినిమాల్లో మంచి అవకాశాలు వస్తున్నాయని చెప్పాడు ఈ కమెడియన్. తాజాగా ఈయన తన స్వగ్రామానికి వచ్చాడు. కళింగగూడెం గ్రామవాసి అయిన బొడ్డుపల్లి శ్రీనివాస్‌ ఇండస్ట్రీలో గెటప్‌ శ్రీనుగా మారిపోయాడు. పనిమీద స్వగ్రామానికి వచ్చిన ఆయన విలేకరులతో మాట్లాడుతూ తన ఫ్యూచర్ ప్రాజెక్ట్స్ గురించి చెప్పాడు. పూరీ జగన్నాథ్‌ దర్శకత్వంలో వస్తున్న పాన్ ఇండియన్ సినిమా లైగర్‌లో ముఖ్య పాత్రలో నటిస్తున్నట్లు చెప్పాడు గెటప్ శ్రీను. రెండేళ్ల కింద వచ్చిన ఇస్మార్ట్ శంకర్ సినిమాలో కీలక పాత్రలో నటించాడు గెటప్ శ్రీను. మరోసారి తన సినిమాలో శ్రీనుకు ఆఫర్ ఇచ్చాడు పూరీ జగన్నాథ్. ఇదిలా ఉంటే ఇప్పుడు మెగాస్టార్ చిరంజీవి హీరోగా వస్తున్న ఆచార్య సినిమాలో కూడా ఓ మంచి పాత్ర పోషిస్తున్నానని చెప్పాడు గెటప్ శ్రీను. చిరంజీవితో నటించడం మరిచిపోలేని అనుభూతి అంటున్నాడు ఈ జబర్దస్త్ కమెడియన్. గతంలోనే అన్నయ్యతో కలిసి నటించిన అనుభవం ఉందని.. ఇప్పుడు మరోసారి స్క్రీన్ షేర్ చేసుకోవడం ఆనందంగా ఉందంటున్నాడు శ్రీను.

jabardasth comedy show,jabardasth getup srinu,jabardasth comedy skits,jabardasth getup srinu chiranjeevi,jabardasth getup srinu movies,jabardasth getup srinu in zombie reddy,jabardasth getup srinu in acharya,jabardasth getup srinu liger movie,telugu cinema,జబర్దస్త్ కామెడీ షో,జబర్దస్త్ కమెడియన్ గెటప్ శ్రీను,జబర్దస్త్ గెటప్ శ్రీను చిరంజీవి,జబర్దస్త్ గెటప్ శ్రీను లైగర్,జబర్దస్త్ గెటప్ శ్రీను ఆచార్య చిరంజీవి
జబర్దస్త్ కమెడియన్ గెటప్ శ్రీను చిరంజీవి (getup srinu chiranjeevi)


గతంలో చిరంజీవితో ఖైదీ నెం.150తో కలిసి నటించాడు గెటప్ శ్రీను. అలాగే రాజూ యాదవ్‌ అనే సినిమాలో హీరోగా నటిస్తున్నట్లు కన్ఫర్మ్ చేసాడు గెటప్ శ్రీను. మొత్తానికి అటు జబర్దస్త్.. ఇటు సినిమాలు రెండింట్లోనూ గెటప్ శ్రీను హవా బాగానే కనిపిస్తుంది.
Published by:Praveen Kumar Vadla
First published: