JABARDASTH COMEDIAN GETUP SRINU INTERESTING COMMENTS ON MEGASTAR CHIRANJEEVI CHARACTER PK
చిరంజీవి ఎలాంటి వాడంటే.. గెటప్ శ్రీను ఆసక్తికరమైన వ్యాఖ్యలు..
జబర్దస్త్ కమెడియన్ గెటప్ శ్రీను చిరంజీవి
Jabardasth Comedy Show: గెటప్ శ్రీను అంటే తెలియని వాళ్లెవరూ ఉండరేమో..? రెండు తెలుగు రాష్ట్రాల ప్రజలను తన విచిత్రమైన గెటప్స్‌తో నవ్విస్తూనే ఉంటాడు ఈ జబర్దస్త్ కమెడియన్.
జబర్దస్త్ కామెడీ షో అంటే ఉన్న ఇమేజ్ గురించి ప్రత్యేకంగా చెప్పాల్సిన అవసరం లేదు. రెండు తెలుగు రాష్ట్రాల ప్రజలు నవ్వుకోడానికి చూసే ఏకైక షో ఇది. జబర్దస్త్ అంటే ఇష్టపడని వాళ్లు పెద్దగా ఉండరు. ఇక ఇండస్ట్రీలో కూడా దీనికి చాలా మంది ఫ్యాన్స్ ఉన్నారు. పైగా ఇదే షో నుంచి ఏటా చాలా మంది నటులు ఇండస్ట్రీకి వస్తున్నారు. తెలుగు సినిమాకు కమెడియన్లను అందించే ఫ్యాక్టరీలా మారిపోయింది జబర్దస్త్ కామెడీ షో. ఇలాంటి సమయంలో చిరంజీవి కూడా తమ షోను చాలా ఇష్టపడతారని చెప్పాడు గెటప్ శ్రీను. ఓ సారి ఆయన ఇంటికి వెళ్లినపుడు తమ షో గురించి ఆయన చెప్పిన తీరు.. మెచ్చుకున్న విధానం చూసి అంతా పొంగిపోయామని చెప్పాడు ఈ కమెడియన్.
జబర్దస్త్ కమెడియన్ గెటప్ శ్రీను చిరంజీవి
ముఖ్యంగా తన గెటప్స్ గురించి.. ఒక్కో స్కిట్ గురించి కూడా గుర్తు పెట్టుకుని మరీ చిరంజీవి మాట్లాడుతుంటే ఇదంతా కలా నిజమా అనే భ్రమలో ఉన్నానని చెప్పాడు గెటప్ శ్రీను. నాగబాబు ఓ సారి తీసుకెళ్లి చిరంజీవితో మీటింగ్ ఏర్పాటు చేసాడని.. అప్పుడు టీం అంతా వెళ్లి ఆయన్ని కలిసామని గతం గుర్తు చేసుకున్నాడు ఈయన. అంతేకాదు ఖైదీ నెం 150లో తనతో పాటు రాంప్రసాద్ కూడా నటించిన సంగతి.. అప్పుడు అన్నయ్యతో మెమోరీస్ కూడా చెప్పాడు గెటప్ శ్రీను. ఇక ఇప్పుడు కొరటాల శివ ఆచార్య సినిమాలోనూ తనకు కారెక్టర్ ఉందని చిరు హామీ ఇచ్చినట్లు చెప్పాడు ఈయన.
నాగబాబు,గెటప్ శ్రీను (Facebook/Photo)
కొరటాల నీ గురించి అడిగాడు శీను అంటూ చిరంజీవి చెప్పడంతో గాల్లో తేలిపోయానంటున్నాడు ఈయన. మొత్తానికి జబర్దస్త్ అన్నా.. అందులో నవ్వించే మేమన్నా కూడా చిరంజీవి గారు ప్రాణమిస్తారంటున్నాడు గెటప్ శ్రీను. దీనంతటికీ కారణమైన నాగబాబు అంటే తమకు ప్రాణం అంటున్నాడు ఈయన. షోలో ఒక్కొక్కరి పేరు గుర్తు పెట్టుకుని మరీ చిరంజీవి చెబుతుంటే తమకు గాల్లో తేలిపోయినట్లు అనిపించిందని చెప్పాడు శ్రీను. అంత పెద్ద మెగాస్టార్ తమ గురించి గుర్తు పెట్టుకుని.. పేర్లతో పిలవడం అనేది చిన్న విషయం కాదని.. అది ఆయన గొప్పతనం అంటున్నాడు ఈయన.
Published by:Praveen Kumar Vadla
First published:
తెలుగు వార్తలు, తెలుగులో బ్రేకింగ్ న్యూస్ న్యూస్ 18లో చదవండి.
రాష్ట్రీయ, జాతీయ, అంతర్జాతీయ, టాలీవుడ్, క్రీడలు, బిజినెస్, ఆరోగ్యం, లైఫ్ స్టైల్, ఆధ్యాత్మిక, రాశిఫలాలు చదవండి.