Jabardasth Srinu: గెటప్ శ్రీను.. తెలుగు ప్రేక్షకులకు ఈ పేరుతో ప్రత్యేకంగా పరిచయాలు అవసరం లేదు. జబర్దస్త్ కామెడీ షో చూసే ప్రతీ ఒక్కరికి ఈ పేరు బాగానే సుపరిచితం. తన కామెడీ..
గెటప్ శ్రీను.. తెలుగు ప్రేక్షకులకు ఈ పేరుతో ప్రత్యేకంగా పరిచయాలు అవసరం లేదు. జబర్దస్త్ కామెడీ షో చూసే ప్రతీ ఒక్కరికి ఈ పేరు బాగానే సుపరిచితం. తన కామెడీ కంటే కూడా ముఖ్యంగా విభిన్నమైన గెటప్స్‌తో అందర్నీ అలరిస్తుంటాడు గెటప్ శ్రీను. బుల్లితెర కమల్ హాసన్ అంటూ నాగబాబు కూడా ఈయన్ని బాగానే నెత్తిన ఎక్కించుకున్నాడు. ఇదిలా ఉంటే ఇప్పుడు గెటప్ శ్రీనుకు బాగా కోపం వచ్చింది. తనపై కొందరు కావాలనే కుట్ర చేస్తున్నారంటూ ఫైర్ అయ్యాడు ఈయన. వాళ్లను వదిలపెట్టనని.. పోలీసులకు కంప్లైంట్ ఇస్తానంటున్నాడు ఈ జబర్దస్త్ కమెడియన్.
జబర్దస్త్ కమెడియన్ గెటప్ శ్రీను (Source: Twitter)
ఇంతకీ విషయం ఏంటంటే లాక్ డౌన్ సందర్భంగా ఇంట్లోనే ఉండి భార్యకు సాయం చేస్తున్నాడు ఈయన. ఇదిలా ఉంటే కొందరు తన పేరుతో సోషల్ మీడియాలో ఫేక్ అకౌంట్ ఒకటి క్రియేట్ చేసి పిచ్చిపిచ్చి వీడియోలన్నీ పోస్ట్ చేస్తున్నారని చెప్పాడు ఈయన. అలాంటి వాళ్ల పని పడతానంటున్నాడు ఈయన. ముఖ్యంగా తనకు కేవలం రెండు అకౌంట్స్ మాత్రమే ఉన్నాయని.. అందులో ఒకటి తన సొంత పేరుతో ఉన్న అకౌంట్ అయితే.. మరోటి జబర్దస్త్ శ్రీను అనేది మరొకటి అని చెప్పాడు.
ఈ రెండు కాకుండా ఎవరో గెటప్ శ్రీను పేరుతో అకౌంట్ ఓపెన్ చేసి అందులో ఏవేవో వీడియోలు పెడుతున్నారని చెప్పాడు ఈయన. దాంతో తనకు ఎలాంటి సంబంధం లేదని.. తను ఈ విషయంపై సైబర్ క్రైమ్ డిపార్ట్మెంట్కు ఫిర్యాదు కూడా ఇస్తానంటున్నాడు. కేవలం తన అకౌంట్లో చెప్పినవి మాత్రమే నమ్మాలంటూ.. మిగిలిన అకౌంట్స్‌లో వచ్చినవి చూసి నమ్మొద్దంటూ కోరుకుంటున్నాడు గెటప్ శ్రీను.
Published by:Praveen Kumar Vadla
First published:
తెలుగు వార్తలు, తెలుగులో బ్రేకింగ్ న్యూస్ న్యూస్ 18లో చదవండి.
రాష్ట్రీయ, జాతీయ, అంతర్జాతీయ, టాలీవుడ్, క్రీడలు, బిజినెస్, ఆరోగ్యం, లైఫ్ స్టైల్, ఆధ్యాత్మిక, రాశిఫలాలు చదవండి.