బిగ్‌ బాస్‌ షో నుంచి గెటప్ శ్రీనుకు ఆఫర్.. కానీ..

ఫస్ట్ సీజన్‌లో ధన్‌రాజ్ బిగ్‌ బాస్ షోలో పాల్గొన్నాడు. ఆ తర్వాత రెండు, మూడో సీజన్లలో ఒక్క జబర్దస్త్ యాక్టర్ కూడా లేరు. దీనికి గల కారణాన్ని జబర్దస్త్ కమెడియన్ గెటప్ శ్రీను వివరించాడు.

news18-telugu
Updated: October 18, 2019, 3:21 PM IST
బిగ్‌ బాస్‌ షో నుంచి గెటప్ శ్రీనుకు ఆఫర్.. కానీ..
గెటప్ శ్రీను
news18-telugu
Updated: October 18, 2019, 3:21 PM IST
బిగ్‌ బాస్ తెలుగు 3 రియాల్టీ షో క్లైమాక్స్‌కు చేరుకుంది. 15 మంది కంటెస్టంట్లతో మొదలైన బిగ్ బాస్ హౌస్‌లో.. 13 వారాలు గడిచేసరికి ఏడుగురే మిగిలారు. ఐతే మూడో సీజన్‌లో సీరియల్స్, సినీ ఇండస్ట్రీ నుంచే ఎక్కువ మందిని తీసుకున్నారు నిర్వాహకులు. జబర్దస్త్ షో నుంచి ఎవర్నో ఒకరిని తీసుకుంటారని అందరూ భావించారు. కానీ ఈసారి బజర్దస్త్ నుంచి ఎవరూ షోలో పాల్గొనలేదు. ఫస్ట్ సీజన్‌లో ధన్‌రాజ్ బిగ్‌బాస్ షోలో పాల్గొన్నాడు. ఆ తర్వాత రెండు, మూడో సీజన్లలో ఒక్క జబర్దస్త్ యాక్టర్ కూడా లేరు. దీనికి గల కారణాన్ని జబర్దస్త్ కమెడియన్ గెటప్ శ్రీను వివరించాడు.

ఓ మీడియా సంస్థకు ఇచ్చిన ఇంటర్వ్యూలో బిగ్‌ బాస్ షో‌పై మాట్లాడాడు గెటప్ శ్రీను. మొదట్లో తనకు కూడా బిగ్ బాస్ ఆఫర్ వచ్చిందని.. కానీ తాను తిరస్కరించానని తెలిపాడు. బిగ్‌ బాస్ షో దాదాపు 100 రోజుల పాటు ఉంటుందని.. అన్ని రోజులు అక్కడే ఉండే జబర్దస్త్ సహా ఇతర షోలు చేసేందుు అవకాశం ఉండదని చెప్పాడు. అందుకే బిగ్ బాస్ షోకు వెళ్లలేదన్న శ్రీను.. ఒక వేళ వెళ్లినా వారం కంటే ఎక్కువ రోజులు ఉండే వాడిని కాదని స్పష్టం చేశాడు. బిగ్ బాస్ షో సక్సెస్‌ఫుల్‌గా నడుస్తోందని.. ప్రేక్షకులను బాగానే అలరిస్తోందని అభిప్రాయపడ్డాడు శ్రీను.


First published: October 18, 2019
మరిన్ని చదవండి
Loading...
తదుపరి వార్తలు
Loading...