Home /News /movies /

JABARDASTH COMEDIAN GETUP SRINU CLIMBS TIRUMALA HILLS ON FOOT SK

Getup Srinu: శ్రీవారి సేవలో.. కాలినడకన తిరుమల కొండలెక్కిన గెటప్ శ్రీను..

తిరుమలలో గెటప్ శ్రీను

తిరుమలలో గెటప్ శ్రీను

వెంకన్న దర్శనం కోసం జబర్దస్త్ కమెడియన్ గెటప్ శ్రీను తిరుమలకు వెళ్లాడు. మెట్లమార్గంలో కాలినడకనే తిరుమల ఆలయం చేరుకొని శ్రీవారిని దర్శించుకున్నాడు.

    గెటప్ శ్రీను..! ఈ జబర్దస్త్‌ కమెడియన్‌కు యూత్‌లో మంచి ఫాలోయింగ్ ఉంది. జబర్దస్త్‌లో మనోడు చేసే మామూలుగా ఉండదు. సుడిగాలి సుధీర్, గెటప్ శ్రీను, ఆటో రాంప్రసాద్ కలిసారంటే.. పొట్ట చెక్కలయ్యే నవ్వాల్సిందే. అంతలా ఫేమస్ అయ్యారు ఈ మూడు కోతులు. స్టేజిపై నవరసాలను అలవోకగా పండించే శ్రీను బుల్లితెర కమల్ హాసన్‌గా పిలుచుకుంటారు. జబర్దస్త్ మాత్రమే కాదు సినిమాల్లోనూ మంచి మంచి అవకాశాలు వస్తున్నాయి. ఇటు జబర్దస్త్.. అటు సినిమాలతో.. గెటప్ శ్రీను బిజీగా ఉన్నాడు. ఈ మధ్యే కాస్త తీరిక దొరకడంతో వెంకన్న దర్శనం కోసం తిరుమలకు వెళ్లాడు గెటప్ శ్రీను. మెట్లమార్గంలో కాలినడకనే తిరుమల చేరుకొని శ్రీవారిని దర్శించుకున్నాడు.

    తిరుమలలో మెట్లెక్కుతున్న ఫొటోను ఇన్‌స్టగ్రామ్‌లో పోస్ట్ చేశాడు గెటప్ శ్రీను. మోకాళ్ల పర్వత మెట్ల ద్వారేనా శ్రీవారి దర్వనార్థం ఫొటో పెట్టాడు. ఆ చిత్రాన్ని రేడియో జాకీ, నటుడు హేమంత్ తీసినట్లు పేర్కొన్నాడు.



    కాగా, జనసేన అధినేత పవన్ కళ్యాణ్ ఇవాళే తిరుమల శ్రీవారిని దర్శించుకున్నారు. తిరుపతి ఉప ఎన్నికల నేపథ్యంలో అక్కడకు వెళ్లిన జనసేనాని ఉదయం తిరుమల శ్రీవారిని దర్శించుకున్నారు. పూర్తి సంప్రదాయ వస్త్రధారణలో పవన్ కళ్యాణ్ తిరుమల శ్రీవేంకటేశ్వరస్వామిని దర్శనం చేసుకున్నారు.
    Published by:Shiva Kumar Addula
    First published:

    Tags: Getup srinu, Jabardasth, Jabardasth getup srinu, Tollywood

    ఉత్తమ కథలు

    తదుపరి వార్తలు