Home /News /movies /

JABARDASTH COMEDIAN GETUP SREENU SENSATIONAL COMMENTS ON SUDIGALI SUDHEER AND RASHMI GAUTAM RELATIONSHIP BS

సుడిగాలి సుధీర్ జీవితం రష్మీనే.. గెటప్ శీను సంచలన వ్యాఖ్యలు..

రష్మీ గౌతమ్,సుడిగాలి సుధీర్

రష్మీ గౌతమ్,సుడిగాలి సుధీర్

మందు, రష్మీ ఇద్దరూ ఉంటే ఆ కిక్కే వేరని సుధీర్ అంటాడు. అంతే.. గెటప్ శీను సహా మిగతా వారంతా బిత్తరపోవాల్సి వచ్చింది.

    సుడిగాలి సుధీర్, ఆటో రాంప్రసాద్, గెటప్ శీను.. వీరు ముగ్గురు కలిశారంటే అక్కడ నవ్వులు పువ్వులై పూస్తాయి. రాంప్రసాద్, గెటప్ శీను కలిసి సుధీర్‌పై చేసే కామెడీ అద్భుతంగా పండుతుంది. రీల్ లైఫ్‌లోనే కాకుండా రియల్ లైఫ్‌లో కూడా వీరంతా బెస్ట్ ఫ్రెండ్స్. వీరి ముగ్గురిలో పెళ్లి కానిది ఒక్క సుధీర్‌కు మాత్రమే. అందుకే సుధీర్‌తో రష్మీ గౌతమ్‌కు లింకు పెట్టి కావాల్సినంత ఆనందం పొందుతారు. వాస్తవానికి జబర్దస్త్ షో లో మాత్రమే కాదు.. మిగతా షోల్లోనూ రష్మీ, సుధీర్ ప్రేమాయణం అంటూ, వారిద్దరు పెళ్లికి రెడీ అయ్యారంటూ.. ప్రోగ్రాంలను రక్తి కట్టిస్తారు. ఓ సందర్భంలోనైతే రష్మీ, సుధీర్‌లకు పెళ్లి చేసినట్లు షో చేసి, చివరికి కల కన్నారంటూ ఎండ్ చేస్తారు. ఇదంతా.. ప్రేక్షకులకు కూడా బాగా నచ్చుతుంది. వీరిద్దరి మధ్య ఎఫైర్ ఉందంటూ పుకార్లు రెట్టింపు చేసి, కావాల్సినంత రేటింగ్ సంపాదించుకోవడానికి ఛానళ్లు కూడా వెనుకాడవు.

    అయితే, తాజాగా.. గెటప్ శీను కూడా వారిద్దరి బంధాన్ని తనకు అనుకూలంగా వాడుకున్నాడు. సుడిగాలి సుధీర్ జీవితం రష్మీ గౌతమ్ అని వ్యాఖ్యానించాడు. అసలేం జరిగిందంటే.. గత వారం ఎపిసోడ్‌లో మందు బాబులను మందు మాన్పించే సెంటర్ అంటూ ఓ స్కిట్ చేశారు. సుడిగాలి సుధీర్ టీమ్ ఈ స్కిట్ చేసింది. ఇందులో గెటప్ శీను మందు మాన్పించే నిర్వాహకుడి పాత్ర వేశాడు. సుధీర్, ఆటో రాంప్రసాద్ తాగుబోతుల పాత్రలు వేశారు. అయితే, సుధీర్‌తో మందు మాన్పించేందుకు తీవ్ర ప్రయత్నాలు చేసే క్రమంలో ఓ వైపు మందు.. మరోవైపు నీ జీవితం(రష్మీ గౌతమ్) ఉందని, ఇందులో నీకు ఎవరు కావాలని గెటప్ శీను సుధీర్‌ను అడుగుతాడు.

    చాలా సేపు ఆలోచించిన సుధీర్.. మందు, రష్మీ ఇద్దరూ ఉంటే ఆ కిక్కే వేరని సుధీర్ అంటాడు. అంతే.. గెటప్ శీను బిత్తరపోవాల్సి వచ్చింది. అటు.. జడ్జిలుగా వ్యవహరించిన నాగబాబు, రోజా కూడా షాక్ అవుతారు. వెంటనే తేరుకొని ఆ కామెడీ టైమింగ్‌కు కడుపుబ్బా నవ్వుతారు. ఈ స్కిట్ బాగా పేలిపోవడంతో పోస్టర్ ఆఫ్ ద డేగా నిలిచింది. చమ్మక్ చంద్ర వేసిన స్కిట్ కూడా బాగా రావడంతో ఈ రెండు టీమ్‌లు పోస్టర్ ఆఫ్ ద డేగా నిలిచాయి.
    First published:

    Tags: Getup srinu, Jabardasth, Jabardasth comedy show, Jabardasth getup srinu, Nagababu

    ఉత్తమ కథలు

    తదుపరి వార్తలు