సుడిగాలి సుధీర్‌ను చితకబాదిన గెటప్ శ్రీను.. రష్మీ గౌతమ్‌ను కాదన్నందుకే..

సుడిగాలి సుధీర్, రష్మి గౌతమ్

Jabardasth Comedy Show : సుడిగాలి సుధీర్, రష్మీ గౌతమ్.. అంటే బుల్లితెర ప్రేమ జంట. వీరిద్దరు కలిసి రొమాన్స్ పండించారంటే అంతకన్నా అభిమానులకు పండగ ఇంకోటి ఉండదు. అందుకే.. ఢీ ఛాంపియన్స్, జబర్దస్త్‌లో వీరిద్దరితో కలిసి బోలెడన్ని షోలు ప్లాన్ చేస్తారు నిర్వాహకులు.

  • Share this:
    సుడిగాలి సుధీర్, రష్మీ గౌతమ్.. అంటే బుల్లితెర ప్రేమ జంట. వీరిద్దరు కలిసి రొమాన్స్ పండించారంటే అంతకన్నా అభిమానులకు పండగ ఇంకోటి ఉండదు. అందుకే.. ఢీ ఛాంపియన్స్, జబర్దస్త్‌లో వీరిద్దరితో కలిసి బోలెడన్ని షోలు ప్లాన్ చేస్తారు నిర్వాహకులు. ఆ కార్యక్రమాల్లో ప్రేమలో ఉన్నామా? అన్నట్లు నటిస్తారు కూడా. ఆ సన్నివేశాలు చూసి నిజంగానే వీరిద్దరు ప్రేమలో ఉన్నారా? అన్నట్లు కనిపిస్తుంది. కానీ, తమ మధ్య ఏమీ లేదని స్పష్టం చేస్తూ వస్తున్నారు. తాజాగా.. జబర్దస్త్ టీమ్ మరో ఆసక్తికర స్కిట్‌తో ప్రేక్షకులను అలరించింది. గత వారం ప్రసారమైన ఎక్స్‌ట్రా జబర్దస్త్ షోలో సుడిగాలి సుధీర్ స్కిట్‌‌ చేశాడు. అందులో సుధీర్, రామ్ ప్రసాద్ పెళ్లి చూపులకు వెళ్లగా.. అక్కడ వాళ్లు కర్రలతో వీరిద్దరికి బడితె పూజ చేస్తారు. ఆ స్కిట్ ఆసాంతం ప్రేక్షకులను కడుపుబ్బా నవ్వించింది.

    స్కిట్ పూర్తయ్యాక రామ్ ప్రసాద్ మాట్లాడుతూ.. పెళ్లి చూపులు లాంటివి పెట్టుకోకుండా ఏడేళ్లుగా ప్రేమించుకుంటున్న రష్మీతోనే ఉండిపో అంటూ సుధీర్‌కు సలహా ఇస్తాడు. రష్మీని కాకుండా వేరే వాళ్లను పెళ్లి చేసుకోవాలని చూసినందుకే గెటప్ శ్రీను బడితె పూజ చేశారన్నట్లు సాగింది స్కిట్. జబర్దస్త్ జడ్జి రోజా కూడా కరెక్టే అన్నట్లు తలూపింది. ఏదేమైనా రష్మీ, సుధీర్ పేరుతో జబర్దస్త్ నిర్వాహకులు బాగానే రేటింగ్‌ను పెంచుకుంటున్నారన్న మాట.
    Published by:Shravan Kumar Bommakanti
    First published: