ఇన్నేళ్లుగా జబర్దస్త్ కామెడీ షోతో సంపాదించుకున్న పేరు మొత్తం ఒక్కసారి పోగొట్టుకున్నాడు దొరబాబు. మూడు నాలుగు రోజులుగా సోషల్ మీడియాలో ఈయన పేరు మార్మోగిపోతుంది. అనుకున్నదొక్కటి అయినదొక్కటి అన్నట్లు.. అక్కడ పేకాట ఆడుతున్న బ్యాచ్‌పై రైడింగ్ కోసం వెళ్తే అనుకోకుండా దొరబాబు పోలీసుల ముందు బుక్ అయిపోయాడు. అయితే ఈయన అలాంటి పరిస్థితుల్లో దొరికిన తర్వాత కూడా దొరబాబు భార్య మాత్రం ఆయనకే అండగా నిలబడింది. ఇదిలా ఉంటే ఆయన దొరికిన రోజు రాత్రి అసలేం జరిగింది అనేది ఎవరికి క్లారిటీ లేదు. పేకాట వాళ్లను పట్టుకోడానికి వచ్చిన వాళ్లు కాస్తా జబర్దస్త్ కమెడియన్లను అరెస్ట్ చేసారని ప్రచారం జరుగుతుంది.
ఇదిలా ఉంటే ఇంత జరిగిన తర్వాత కూడా దొరబాబుతో పాటు పరదేశీ కూడా మళ్లీ హైపర్ ఆది టీంలో కనిపించారు. మల్లెమాల వాళ్లకు వార్నింగ్ ఇచ్చిందని.. ఆ ఇద్దర్ని షో నుంచి తప్పించాలని నిర్ణయించుకున్నారని వార్తలు వచ్చాయి. అయితే టీం లీడర్ హైపర్ ఆది మాత్రం ప్రొడక్షన్ టీంతో మాట్లాడి సెట్ చేసాడని ప్రచారం జరుగుతుంది. తన టీంలో దొరబాబు ఎంత కీ మెంబర్ అనేది వాళ్లకు అర్థమయ్యేలా చెప్పి నిర్ణయం వెనక్కి తీసుకునేలా చేసాడని తెలుస్తుంది. ఇదిలా ఉంటే దొరబాబు ఇష్యూపై ఇప్పటి వరకు జబర్దస్త్ కమెడియన్లు ఎవరూ స్పందించలేదు. తాజాగా ఈ విషయంపై తన తోటి కమెడియన్ గడ్డం నవీన్ స్పందించాడు. ఈయన అభి టీంలో చేస్తుంటాడు.
జూనియర్ రాఘవేంద్రరావుగా మనోడికి మంచి ఇమేజ్ ఉంది. సినిమాల్లో కూడా బాగానే నటిస్తున్న గడ్డం నవీన్ ఈ మధ్యే ఓ యూ ట్యూబ్‌కు ఛానెల్‌కు ఇచ్చిన ఇంటర్వ్యూలో దొరబాబు గురించి కూడా మాట్లాడాడు. ఆయన గురించి తనకు తెలుసని.. అలాంటి వాడు కాదని మాత్రం చెప్పగలనని చెప్పాడు నవీన్. అయితే ఆ రోజు అసలు అక్కడ ఏం జరిగిందో ఎవరికీ తెలియదు.. అలాంటప్పుడు నోరు జారడం మంచిది కాదని చెబుతున్నాడు నవీన్. అలా ఇలా అని వాళ్లు వీళ్లు అనడమే కానీ.. ఏం జరిగిందో తెలిస్తే తప్ప మనం స్పందించలేమని చెప్పాడు. దానికితోడు వాళ్లే బయటికి వచ్చి ఆ రోజు ఏం జరిగిందనేది చెప్తే బాగుంటుందని అభిప్రాయపడ్డాడు ఈ జబర్దస్త్ కమెడియన్.
తెలుగు వార్తలు, తెలుగులో బ్రేకింగ్ న్యూస్ న్యూస్ 18లో చదవండి. రాష్ట్రీయ, జాతీయ, అంతర్జాతీయ, టాలీవుడ్, క్రీడలు, బిజినెస్, ఆరోగ్యం, లైఫ్ స్టైల్, ఆధ్యాత్మిక, రాశిఫలాలు చదవండి.