• HOME
  • »
  • NEWS
  • »
  • MOVIES
  • »
  • JABARDASTH COMEDIAN EMMANUEL SHOWS HIS NEW TALENT IN SRIDEVI DRAMA COMPANY PK

Jabardasth Emmanuel: జబర్దస్త్ ఇమ్మాన్యుయేల్‌లో ఈ టాలెంట్ కూడా ఉందా.. కుర్రాడు పెద్ద కంచు..!

Jabardasth Emmanuel: జబర్దస్త్ ఇమ్మాన్యుయేల్‌లో ఈ టాలెంట్ కూడా ఉందా.. కుర్రాడు పెద్ద కంచు..!

జబర్దస్త్ ఇమ్మాన్యుయేల్ (Jabardasth Emmanuel)

Jabardasth Emmanuel: జబర్దస్త్ కామెడీ షోలో(Jabardasth Comedy Show) చాలా త్వరగా ఫేమ్ తెచ్చుకున్న నటులు కొందరే ఉన్నారు. అందులో హైపర్ ఆది(Hyper Aadi) అందరికంటే ముందున్నాడు. ఆ తర్వాత ఇమ్మాన్యుయేల్ వస్తాడు. ఈయన కూడా చాలా వేగంగా గుర్తింపు తెచ్చుకున్నాడు. ఇప్పుడు తనలోని మరో టాలెంట్ బయటపెట్టాడు ఇమ్ము.

  • Share this:
జబర్దస్త్ కామెడీ షోలో చాలా త్వరగా ఫేమ్ తెచ్చుకున్న నటులు కొందరే ఉన్నారు. అందులో హైపర్ ఆది అందరికంటే ముందున్నాడు. కేవలం నాలుగేళ్లలోనే ఈయన ఇంత స్టార్ డమ్ సంపాదించుకున్నాడు. ఈయన కంటే ముందున్న వాళ్లు.. ఈయన తర్వాత వచ్చిన వాళ్లకు కూడా ఆది అంత క్రేజ్ రాలేదు. ఇదిలా ఉంటే హైపర్ ఆది మాదిరే ఈ మధ్య మరో కమెడియన్ కూడా దూసుకుపోతున్నాడు. అతడి పేరు ఇమ్మాన్యుయేల్. ఎక్కడి నుంచి వచ్చాడో తెలియదు కానీ రేసుగుర్రంలా దూసుకుపోతున్నాడు ఇమ్మాన్యుయేల్. ఈయన జోరు చూసి మిగిలిన టీమ్ లీడర్స్ కూడా ఫిదా అవుతున్నారు. జబర్దస్త్ షోతో పాటు బయట ఈవెంట్స్ కూడా కుమ్మేస్తున్నాడు ఈయన. అంతగా క్రేజ్ తెచ్చుకున్నాడు ఈయన. దాంతో పాటు సీరియల్ బ్యూటీ వర్షతో సీరియస్ లవ్ ట్రాక్ కూడా ఈయన్ని హెడ్ లైన్స్‌లో నిలబెడుతుంది. ఎప్పటికప్పుడు వర్షతో ఈయన చేసే రొమాన్స్ హైలైట్ అవుతుంది. దాంతో మనోడు ఆటోమేటిక్‌గా సంచలనం అవుతున్నాడు. చూడ్డానికి అమాయకంగా కనిపిస్తాడు కానీ మనోడు మాత్రం తెర వెనక చాలా చిలిపి అంతే.

ఇదిలా ఉంటే జబర్దస్త్ కామెడీ షోలో ఈయనకు ప్రమోషన్ వచ్చినట్లు కూడా ప్రచారం జరుగుతుంది. హైపర్ ఆది తర్వాత అంత త్వరగా స్టార్ డమ్ సంపాదించుకున్న ఇమ్మాన్యుయేల్.. త్వరలోనే టీమ్ లీడర్ కూడా కాబోతున్నట్లు ప్రచారం జరుగుతుంది.
jabardasth comedy show,jabardasth emmanuel singing,jabardasth emmanuel sings pedave palikina song,jabardasth comedians,jabardasth emmanuel new team leader,jabardasth emmanuel,jabardasth sai husband emmanuel,jabardasth lady getup sai,extra jabardasth comedy show,telugu cinema,జబర్దస్త్ ఇమ్మాన్యుయేల్ సింగర్,పాట పాడిన జబర్దస్త్ ఇమ్మాన్యుయేల్,జబర్దస్త్ ఇమ్మాన్యుయేల్ టీమ్ లీడర్,జబర్దస్త్ కామెడీ షో
జబర్దస్త్ ఇమ్మాన్యుయేల్ (Jabardasth Emmenuel)

జబర్దస్త్‌, ఎక్స్ ట్రా జబర్దస్త్‌లలో కొందరి పర్ఫార్మెన్స్‌తో దర్శకులు సంతృప్తిగా లేరని తెలుస్తుంది. వాళ్ల స్థానంలో ఇమ్మాన్యుయేల్ టీమ్ లీడర్ కావడం ఖాయంగా కనబడుతుంది. తాజాగా ఈయనలోని మరో టాలెంట్ కూడా బయటికి వచ్చింది. ఈ మధ్య ఈటీవీ చేసే ప్రతీ ఈవెంట్‌లోనూ ఇమ్మాన్యుయేల్ కనిపిస్తున్నాడు. అంతేకాదు శ్రీదేవి డ్రామా కంపెనీ అంటూ వారానికి ఓ భారీ ఎపిసోడ్ కూడా చేస్తున్నారు. ఇప్పుడు ఇందులోనే తన టాలెంట్ చూపించాడు ఇమ్మాన్యుయేల్. మదర్స్ డే సందర్భంగా మే 8న ప్రసారం కానున్న ఈ ఎపిసోడ్‌లో పాట పాడాడు ఇమ్ము.

అందులో గొప్పేముంది అనుకోవచ్చు కానీ లేడీ వాయిస్ కూడా ఈయనే పాడేసాడు. పెదవే పలికిన మాటల్లోనే అంటూ మొదలు పెట్టిన ఇమ్మాన్యుయేల్ మధ్యలో వచ్చే లేడీ వాయిస్‌ను కూడా అచ్చు గుద్దినట్లు దించేసాడు. దాంతో అక్కడున్న వాళ్లంతా ఫిదా అయిపోయారు. హైపర్ ఆది అయితే నీది మామూలు టాలెంట్ కాదురా బాబూ అంటూ గట్టిగా హత్తుకున్నాడు. ప్రస్తుతం ఈ ప్రోమో వైరల్ అవుతుంది. అందులో ఇమ్మాన్యుయేల్ వాయిస్ కూడా బాగానే వైరల్ అవుతుంది.
Published by:Praveen Kumar Vadla
First published: