• HOME
  • »
  • NEWS
  • »
  • MOVIES
  • »
  • JABARDASTH COMEDIAN EMMANUEAL GETS PROMOTION IN COMEDY SHOW AFTER HYPER AADI PK

Jabardasth Emmanuel: జబర్దస్త్ ఇమ్మాన్యుయేల్‌కు ప్రమోషన్.. హైపర్ ఆది తర్వాత మనోడే..

Jabardasth Emmanuel: జబర్దస్త్ ఇమ్మాన్యుయేల్‌కు ప్రమోషన్.. హైపర్ ఆది తర్వాత మనోడే..

జబర్దస్త్ ఇమ్మాన్యుయేల్ (Jabardasth Emmanuel)

Jabardasth Emmanuel: జబర్దస్త్ కామెడీ షోలో చాలా త్వరగా ఫేమ్ తెచ్చుకున్న నటులు కొందరే ఉన్నారు. అందులో హైపర్ ఆది అందరికంటే ముందున్నాడు. కేవలం నాలుగేళ్లలోనే ఈయన ఇంత స్టార్ డమ్ సంపాదించుకున్నాడు.

  • Share this:
జబర్దస్త్ కామెడీ షోలో చాలా త్వరగా ఫేమ్ తెచ్చుకున్న నటులు కొందరే ఉన్నారు. అందులో హైపర్ ఆది అందరికంటే ముందున్నాడు. కేవలం నాలుగేళ్లలోనే ఈయన ఇంత స్టార్ డమ్ సంపాదించుకున్నాడు. ఈయన కంటే ముందున్న వాళ్లు.. ఈయన తర్వాత వచ్చిన వాళ్లకు కూడా ఆది అంత క్రేజ్ రాలేదు. ఇదిలా ఉంటే హైపర్ ఆది మాదిరే ఈ మధ్య మరో కమెడియన్ కూడా దూసుకుపోతున్నాడు. అతడి పేరు ఇమ్మాన్యుయేల్. ఎక్కడి నుంచి వచ్చాడో తెలియదు కానీ రేసుగుర్రంలా దూసుకుపోతున్నాడు ఇమ్మాన్యుయేల్. ఈయన జోరు చూసి మిగిలిన టీమ్ లీడర్స్ కూడా ఫిదా అవుతున్నారు. జబర్దస్త్ షోతో పాటు బయట ఈవెంట్స్ కూడా కుమ్మేస్తున్నాడు ఈయన. అంతగా క్రేజ్ తెచ్చుకున్నాడు ఈయన. దాంతో పాటు సీరియల్ బ్యూటీ వర్షతో సీరియస్ లవ్ ట్రాక్ కూడా ఈయన్ని హెడ్ లైన్స్‌లో నిలబెడుతుంది. ఎప్పటికప్పుడు వర్షతో ఈయన చేసే రొమాన్స్ హైలైట్ అవుతుంది. దాంతో మనోడు ఆటోమేటిక్‌గా సంచలనం అవుతున్నాడు. చూడ్డానికి అమాయకంగా కనిపిస్తాడు కానీ మనోడు మాత్రం తెర వెనక చాలా చిలిపి అంతే. ఇదిలా ఉంటే ఇప్పుడు జబర్దస్త్ కామెడీ షోలో ఈయనకు ప్రమోషన్ వచ్చినట్లు ప్రచారం జరుగుతుంది. హైపర్ ఆది తర్వాత అంత త్వరగా స్టార్ డమ్ సంపాదించుకున్న ఇమ్మాన్యుయేల్.. ఇప్పుడు మరో రేర్ ఫీట్ అందుకునేలా కనిపిస్తున్నాడు. త్వరలోనే ఈయనకు టీమ్ లీడర్ పోస్ట్ వచ్చేలా కనిపిస్తుంది. ఇహనో ఇప్పుడో అనౌన్స్‌మెంట్ కూడా వచ్చేలా కనిపిస్తుంది.

jabardasth comedy show,jabardasth emmanuel comedy,jabardasth emmanuel hyper aadi,jabardasth comedians,jabardasth emmanuel new team leader,jabardasth emmanuel,jabardasth sai husband emmanuel,jabardasth lady getup sai,extra jabardasth comedy show,telugu cinema,జబర్దస్త్ ఇమ్మాన్యుయేల్,జబర్దస్త్ వర్ష,జబర్దస్త్ ఇమ్మాన్యుయేల్ టీమ్ లీడర్,జబర్దస్త్ కామెడీ షో
జబర్దస్త్ ఇమ్మాన్యుయేల్ (Jabardasth Emmanuel)


ఇప్పటికే జబర్దస్త్‌లో కొందరు కొత్త టీమ్ లీడర్స్ వచ్చారు. అయితే వాళ్ల నుంచి నిర్వాహకులు అంత హ్యాపీగా కనిపించడం లేదు. ఎక్స్ ట్రా జబర్దస్త్‌లో కూడా జిగేల్ జీవన్ లాంటి వాళ్లు టీమ్ లీడర్స్ అయ్యారు. కానీ వాళ్ల నుంచి కూడా ఊహించిన ఫలితాలు రావడం లేదు. అందుకే కాస్త మార్పులు చేయాలనుకుంటున్నారు. ఈ క్రమంలోనే కొత్త టీమ్ లీడర్‌గా ఇమ్మాన్యుయేల్‌ను ప్రకటించే అవకాశం కనిపిస్తుంది. ఇప్పటికే ఈయనతో పాటు వర్ష ఎప్పుడూ చేస్తూనే ఉంది.

jabardasth comedy show,jabardasth emmanuel comedy,jabardasth emmanuel hyper aadi,jabardasth comedians,jabardasth emmanuel new team leader,jabardasth emmanuel,jabardasth sai husband emmanuel,jabardasth lady getup sai,extra jabardasth comedy show,telugu cinema,జబర్దస్త్ ఇమ్మాన్యుయేల్,జబర్దస్త్ వర్ష,జబర్దస్త్ ఇమ్మాన్యుయేల్ టీమ్ లీడర్,జబర్దస్త్ కామెడీ షో
జబర్దస్త్ ఇమ్మాన్యుయేల్ (Jabardasth Emmanuel)


ఈ ఇద్దరి కాంబినేషన్‌కు పిచ్చ క్రేజ్ కూడా వచ్చేసింది. అందుకే ఈ ఇద్దరే ప్రధానంగా కొత్త టీమ్ వచ్చేలా కనిపిస్తుంది. కచ్చితంగా మరికొన్ని వారాల్లోనే ఈ మార్పు కనబడటం ఖాయం. ఏదేమైనా కూడా ఏడాదిన్నరలోపే టీమ్ లీడర్ స్థాయికి ఎదగడం అంటే మాటలు కాదు.. కానీ దాన్ని చేసి చూపించాడు ఇమ్మాన్యుయేల్.
Published by:Praveen Kumar Vadla
First published:

అగ్ర కథనాలు