JABARDASTH COMEDIAN DORABABU WIFE AMULYA SERIOUS WARNING TO WHO COMMENTING ON THEM BAD PK
దొరబాబు భార్య వాళ్లకు సీరియస్ వార్నింగ్ ఇచ్చిందా..?
దొరబాబు భార్య నందు (dorababu wife nandu)
విమర్శకులకు సమాధానం చెప్పేలా దొరబాబు భార్య అమూల్య తన సోషల్ మీడియాలో సమాధానం చెబుతుంది. తనపై కామెంట్స్ చేస్తున్న వాళ్లను కుక్కలతోనే పోల్చి తనేంటి చూపించింది.
కొన్ని రోజులుగా దొరబాబుతో పాటు ఆయన భార్య అమూల్య కూడా వార్తల్లో ఉంటుంది. ఈ కమెడియన్ ఇన్నేళ్లుగా జబర్దస్త్ కామెడీ షోతో సంపాదించుకున్న పేరు మొత్తం మొన్న జరిగిన ఒక్క ఇన్సిడెంట్‌తో పోగొట్టుకున్నాడు. అనుకున్నదొక్కటి అయినదొక్కటి అన్నట్లు.. అక్కడ పేకాట ఆడుతున్న బ్యాచ్‌పై రైడింగ్ కోసం వెళ్తే అనుకోకుండా దొరబాబు పోలీసులకు వ్యభిచారం కేసులో దొరికిపోయాడు. ఇది ఇప్పుడు అంతా మరిచిపోయారు. మళ్లీ ఆయన జబర్దస్త్ కూడా చేసుకుంటున్నాడు. ప్రస్తుతం లాక్ డౌన్ పీరియడ్ ఆయన భార్యతో కలిసి ఎంజాయ్ చేస్తున్నాడు దొరబాబు. ఇన్ని వార్తలు వస్తున్నా కూడా దొరబాబుకు మాత్రం ఆయన భార్య చాలా అండగా నిలుస్తుంది.
జబర్దస్త్ నటుడు దొరబాబు (Jabardasth Comedian Dorababu)
నెల్లూరు లోకల్ టీవీ యాంకర్ అమూల్యను రెండేళ్ల కింద ప్రేమించి పెళ్లి చేసుకున్నాడు దొరబాబు. వీళ్ల ప్రేమకు గుర్తుగా ఓ కూతురు కూడా ఉంది. ఇంత మంచి భార్యా పిల్లలను పెట్టుకుని ఇవేం పనులయ్యా దొరబాబు అంటూ ఆయనకు క్లాస్ పీకేవాళ్లు ఇంకా పీకుతూనే ఉన్నారు. ఇలాంటి సమయంలో విమర్శకులకు అందరికీ సమాధానం చెప్పేలా దొరబాబు భార్య అమూల్య తన సోషల్ మీడియాలో సమాధానం చెబుతుంది. అన్నట్లు ఈమె టిక్ టాక్ సూపర్ స్టార్. చాలా వీడియోలు భర్తతో కలిసి చేసింది కూడా. చాలా మంది ఫాలోయర్స్ కూడా ఉన్నారు. అందుకే ఏదైనా చెప్పాలనుకుంటే అక్కడ్నుంచి చెబుతుంది ఈమె.
దొరబాబు భార్య నందు (dorababu wife nandu)
ఇప్పుడు కూడా తనతో పాటు భర్తపై కూడా బ్యాడ్ కమెంట్స్ చేస్తున్న వాళ్లకు చెంప పగలగొట్టినట్లు సమాధానం చెప్పింది ఈమె. ఈ మధ్య చూస్తున్నాను.. ఎక్కువగా బ్యాడ్ కామెంట్స్ వస్తున్నాయి అంటూ పక్కనే కుక్కలు మొరుగుతుంటే.. షట్ అప్ అండ్ గెట్ లాస్ట్ అంటూ సీరియస్‌గా వార్నింగ్ ఇచ్చింది అమూల్య. అక్కడ అరిచింది కుక్కలపైనే కానీ తనపై బ్యాడ్ కామెంట్స్ చేస్తున్న వాళ్లను కూడా కుక్కలతోనే పోల్చింది ఈమె. ఈ మధ్య ఎక్కువగా దొరబాబుపై కామెంట్స్ చేస్తున్న వాళ్లకే ఇప్పుడు ఆయన భార్య సెటైర్ వేసింది. ఓ వ్యక్తిని అపార్థం చేసుకునేటప్పుడు గతంలో ఆయన మనతో ఎలా ఉన్నాడనేది మరిచిపోకూడదు.. కొన్నిసార్లు మన కళ్లను మనమే నమ్మలేం.. అవి కూడా మనను మోసం చేస్తుంటాయి.. అంటూ అప్పట్లో ఓ పోస్ట్ కూడా పెట్టింది ఈమె.
విమర్శకులకు సమాధానం చెప్పిన దొరబాబు భార్య (dorababu wife quote)
దీన్నిబట్టి భర్తకు అండగా ఉంటానని చెప్పకనే చెబుతుంది. ఇప్పుడు కూడా తనపై కామెంట్స్ చేస్తున్న వాళ్లను కుక్కలతోనే పోల్చి తనేంటి చూపించింది అమూల్య. అంతేకాదు తన మొగుడి తనకు తెలుసు.. ఎన్ని వచ్చినా కూడా తను నమ్మనని చెప్పకనే చెబుతుంది ఈమె. గతంలో కూడా యూ ట్యూబ్‌లో బి గ్రేడ్ షార్ట్ ఫిల్మ్స్ చేసాడు దొరబాబు. అయినా కూడా ఆయన్ని ప్రేమించి పెళ్లి చేసుకుందంటే దొరబాబు ఎలాంటి వాడో అర్థం చేసుకోండి అంటూ ఆయన సన్నిహితులు కూడా సోషల్ మీడియాలో విమర్శించే వాళ్లను కోరుతున్నారు. ఏదేమైనా కూడా దొరబాబు భార్య పెట్టిన టిక్ టాక్ పోస్ట్ మాత్రం ఇప్పుడు హాట్ టాపిక్ అవుతుంది.
Published by:Praveen Kumar Vadla
First published:
తెలుగు వార్తలు, తెలుగులో బ్రేకింగ్ న్యూస్ న్యూస్ 18లో చదవండి.
రాష్ట్రీయ, జాతీయ, అంతర్జాతీయ, టాలీవుడ్, క్రీడలు, బిజినెస్, ఆరోగ్యం, లైఫ్ స్టైల్, ఆధ్యాత్మిక, రాశిఫలాలు చదవండి.