Home /News /movies /

JABARDASTH COMEDIAN DORABABU WIFE AMMU BEATEN HYPER AADI ON STAGE IN SKIT PK

Hyper Aadi: హైపర్ ఆదిని జబర్దస్త్ స్టేజీపైనే చితకబాదిన దొరబాబు భార్య..

హైపర్ ఆది స్కిట్‌లో దొరబాబు భార్య అమ్ము (hyper aadi dorababu)

హైపర్ ఆది స్కిట్‌లో దొరబాబు భార్య అమ్ము (hyper aadi dorababu)

Hyper Aadi: ప్రతీసారి తన స్కిట్‌లో కచ్చితంగా దొరబాబును టార్గెట్ చేసి పంచులు వేస్తూనే ఉంటాడు. ఆ ఘటనను గుర్తు చేసి మళ్లీ మళ్లీ కామెడీ పుట్టిస్తూనే ఉంటాడు ఆది..

అదేంటి.. హైర్ ఆదిని దొరబాబు భార్య కొట్టడం ఏంటి అనుకుంటున్నారా..? ఇప్పుడు ఇదే జరిగింది మరి. జబర్దస్త్ కామెడీ షోలో ఎన్ని టీమ్స్ ఉన్నా.. ఎంతమంది టీం లీడర్స్ ఉన్నా కూడా హైపర్ ఆదికి మాత్రం సపరేట్ ఫ్యాన్ ఫాలోయింగ్ ఉంది. ఈయన తన పంచ్ డైలాగులతో స్కిట్‌ను అలా పైకి లేపుతుంటాడు. ప్రతీసారి కూడా కొత్త మ్యాటర్ లేకపోయినా కూడా కొత్త పంచులతో పిచ్చెక్కిస్తుంటాడు. దానికితోడు జరిగిన విషయాలను వాడుకోవడంలో ఈయన కంటే తోపు ఎవరూ లేరు.
దొరబాబు, హైపర్ ఆది (Hyper Aadi Dorababu)
దొరబాబు, హైపర్ ఆది (Hyper Aadi Dorababu)

మరీ ముఖ్యంగా కాన్ టెంపరరి విషయాలపై అదిరిపోయే పంచులు వేస్తుంటాడు హైపర్ ఆది. ఇప్పుడు కూడా ఇదే చేసాడు ఆది. తన టీంలో ఉన్న దొరబాబుతో పాటు పరదేశి ఆ మధ్య ఓ బ్రోతల్ కేసులో దొరికిపోయారు. అందులో నిజానిజాలు ఇంకా బయటికి రాలేదు. వాళ్లు నిజంగానే వ్యభిచారం చేసారా లేదంటే అనుకోకుండా వెళ్లి అడ్డంగా బుక్ అయిపోయారా అనేది ఇప్పటికీ సస్పెన్సే. అయితే ఆ సంఘటనను మాత్రం తన కామెడీ కోసం వాడేసుకుంటున్నాడు హైపర్ ఆది.
హైపర్ ఆది స్కిట్‌లో దొరబాబు భార్య అమ్ము (hyper aadi dorababu)
హైపర్ ఆది, రైజింగ్ రాజు, దొరబాబు (Image: Youtube)

ప్రతీసారి తన స్కిట్‌లో కచ్చితంగా దొరబాబును టార్గెట్ చేసి పంచులు వేస్తూనే ఉంటాడు. ఆ ఘటనను గుర్తు చేసి మళ్లీ మళ్లీ కామెడీ పుట్టిస్తూనే ఉంటాడు ఆది. ఇప్పుడు కూడా ఇదే చేసాడు. అయితే ఈ సారి ఏకంగా దొరబాబు భార్య అమ్ములు ముందే ఆయన పరువు తీసాడు ఆది. ఎప్పట్లాగే దొరబాబు ఆ ఘటనపై పంచులు వేసాడు ఆది. దాంతో దొరబాబు నాకు ఇంకా పెళ్లి కాలేదు అంటూ చెప్తాడు.. వెంటనే సీన్‌లోకి దొరబాబు రియల్ లైఫ్ వైఫ్ అమ్ములు వచ్చేస్తుంది.. వచ్చి మరి నేనెవరూ అంటుంది.
హైపర్ ఆది స్కిట్‌లో దొరబాబు భార్య అమ్ము (hyper aadi dorababu)
హైపర్ ఆది స్కిట్‌లో దొరబాబు భార్య అమ్ము (hyper aadi dorababu)

అమ్మూ అంటూ దొరబాబు అనబోతుంటే.. నన్నేమో అమ్మూ అమ్మూ అంటావ్.. నువ్వు అక్కడ చేసే పనులు చూసి నేనేమో అమ్మో అమ్మో అనుకోవాల్సి వస్తుందంటూ పంచ్ వేసింది. చెప్పింది దొరబాబు భార్యే అయినా చెప్పించింది మాత్రం హైపర్ ఆదినే కదా అంటున్నారు నెటిజన్లు. అయితే ఈ స్కిట్ చివర్లో భార్యతోనే దొరబాబును కొట్టించాడు హైపర్ ఆది.
హైపర్ ఆది స్కిట్‌లో దొరబాబు భార్య అమ్ము (hyper aadi dorababu)
హైపర్ ఆది స్కిట్‌లో దొరబాబు భార్య అమ్ము (hyper aadi dorababu)

మా ఆయన ఇంత చేస్తే నువ్వు ఇంత చూపించావ్.. ఇప్పుడు ఆయన ఇంత చేస్తున్నాడు.. అప్పుడు ఆయన్ని కాదు మిమ్మల్నే కదా కొట్టాలి అంటూ హైపర్ ఆదిని కూడా కొట్టింది దొరబాబు భార్య అమ్ము. ఈమె రావడంతో స్కిట్‌కు మరింత అందం వచ్చింది. ఇక తన భర్తపై వేసే పంచులు చూసినపుడు సరదాగానే తీసుకుంటానని చెప్పింది అమ్ము.
Published by:Praveen Kumar Vadla
First published:

Tags: Hyper Aadi, Jabardasth comedy show, Telugu Cinema, Tollywood

ఉత్తమ కథలు

తదుపరి వార్తలు